Home /News /crime /

BELGIAN MAN ADMITS STABBING HIS PRIMARY SCHOOL TEACHER MARIA VERLINDEN TO DEATH AFTER 30 YEARES HUMILIATED HIM IN CLASS VB

OMG: ఇదేం బుద్ధి రా నాయనా.. అప్పడు ఆమె అలా చేసిందని.. నువ్వు ఇలా చేస్తావా.. ఇప్పుడు చూడు ఏమైందో..

హత్యకు గురైన మారియా, నిందితుడు

హత్యకు గురైన మారియా, నిందితుడు

OMG: పగలు, ప్రతీకారాలతో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ఎంతో మంది జైలులో చిప్పకూడు తినుకుంటూ బతుకు జీవడా అంటూ జీవిస్తున్నారు. పరువు హత్యలు, అత్యాచారల నేపథ్యంలో ఎంతో మంది.. తమను నమ్ముకొని ఉన్న కుటుంబసభ్యులను నిరాశ్రయులకు గురి చేస్తున్నారు. ఇక్కడ జరిగిన ఓ ఘటన కూడా ఈ కోవలోకి చెందినదే.

ఇంకా చదవండి ...
పగలు, ప్రతీకారాలతో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ఎంతో మంది జైలులో(Jail) చిప్పకూడు తినుకుంటూ బతుకు జీవడా అంటూ జీవిస్తున్నారు. పరువు హత్యలు(Murder), అత్యాచారాల నేపథ్యంలో ఎంతో మంది.. తమను నమ్ముకొని ఉన్న కుటుంబసభ్యులను(Family Members) నిరాశ్రయులకు గురి చేస్తున్నారు. ఇక్కడ జరిగిన ఓ ఘటన కూడా ఈ కోవలోకి చెందినదే. ఎప్పుడో 30 ఏళ్ల క్రితం తన టీచర్(Teacher) అవమానించిందని.. మూడు దశాబ్ధాల తర్వాత తన పగను తీర్చుకున్నాడు. ఈ ఘటన బెల్జియంలో చోటు చేసుకుంది. ప్రాథమిక పాఠశాలలో తన టీచర్ ద్వారా తాను అవమానంగా భావించానని చెప్పిన 37 ఏళ్ల వ్యక్తి మూడు దశాబ్దాల తర్వాత ఆమెను కత్తితో పొడిచి చంపాడు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. బెల్జియంలోని ఓ పాఠశాలలో 7 ఏళ్ల గుంటెర్ ఉవెంట్స్ చదువుకుంటున్నాడు.

Viral Video: ఆమె ప్రెగ్నెంట్.. ఆ మహిళ చేసిన పనికి భర్త షాక్.. సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతున్న వీడియో..


ఆ పాఠశాలలో మారియా వెర్లిండెన్ టీచర్ పాఠాలను బోధిస్తుంటుంది. ఉవెంట్స్ 7 ఏళ్ళ బాలుడిగా ఉన్నప్పుడు తరగతి గదిలో తోటి విద్యార్దులు అతడిని హేళన చేసేవారు. వేధించి అవమానించే వారు. క్లాస్ రూమ్ లో అందరూ అతడిని చిన్న చూపు చూసేవారని… ఆఖరుకు క్లాస్ టీచర్ మారియా కూడా తనను చిన్న చూపు చూశారని అతడు చెప్పుకొచ్చాడు. క్లాస్ లో ఏదైనా ప్రశ్నకు సమాధానం చెప్పటానికి అతడు చేయి ఎత్తినా అతడికి అవకాశం ఇవ్వకుండా మారియా వేరొకరికి అవకాశం ఇచ్చి అతడిని నిరాశ పరిచేదని అతడు చెప్పుకొచ్చాడు. ఈ కారణాలతోనే అతడు ఆమెపై పగను పెంచుకున్నాడు. క్లాస్ రూమ్ లో తనను తక్కువ చేసిన ఉపాధ్యాయురాలిపై పగ పెంచుకున్న ఉవెంట్స్ 30 ఏళ్ల తర్వాత ఆమె ఆచూకీ తెలుసుకున్నాడు.

Viral News: అతడు ఒక ఐపీఎస్ అధికారి.. తన లగేజ్ ను తనిఖీ చేసిన భద్రతా సిబ్బంది షాక్ అయ్యారు.. ఎందుకంటే..


నవంబర్ 2020లో ఆంట్‌వెర్ప్ సమీపంలోని నూర్‌డెర్‌విజ్క్ గ్రామంలోని ఆమె ఇంటి వెళ్లాడు. ఆమెను చూసిన వెంటనే పగతో రగిలిపోయి.. కత్తి తీసుకొని 101 కత్తి పోట్లు పొడిచాడు. వంట గదిలోనే ఆమె శవాన్ని వదిలి పెట్టి అక్కడ నుంచి పారిపోయాడు. 16 నెలలుగా కేసు కొలిక్కిరాలేదు, నిందితుడు పోలీసులకు పట్టుబడకుండా సాక్ష్యాలు దొరక్కుండా హత్య చేశాడు. సమాచారం తెలుకుసుని ఘటనా స్ధలానికి వచ్చిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఆ సమయంలో వంటగదిలో డైనిగ్ టేబుల్ పై మనీ పర్సు అలాగే ఉంది.

పెళ్లై నెల రోజులు కూడా కాలేదు.. రాత్రికి రాత్రే ఆమె ఎంత పని చేసిందో తెలుసా.. ఈ మాత్రానికి పెళ్లి అవసరమా..?


అందులో డబ్బుకానీ, ఇంట్లో ఇతర విలువైన వస్తువులు ఏమీ దొంగతానికికి గురికాలేదని పోలీసులు గుర్తించారు. అంటే వచ్చిన దొంగ నగదు కోసం రాలేదని తేల్చారు పోలీసులు.నిందితుడ్ని పట్టుకునేందుకు పోలీసులు వందలాది డీఎన్ఏ లను పరిశీలించినప్పటికీ నిందితుడు దొరకలేదు. ఇటీవల నేరం చేసింది ఒకప్పటి ఆమె దగ్గర చదువుకున్నవిద్యార్ధి గుంటర్ ఉవెంట్స్(37) అని గుర్తించిన పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. నేరం చేయటానికి గల కారణాలను ఉవెంట్స్ చెప్పినప్పుడు విన్న పోలీసులు ఆశ్చర్యపోయారు. తనను హేలన చేసినందుకే ఆమెను హత్య చేశానని అతడు చెప్పుకొచ్చాడు. ఉవెంట్స్‌ను న్యాయమూర్తి ముందు హాజరుపరచగా.. హత్యానేరంపై కస్టడీలో ఉంచారు.
Published by:Veera Babu
First published:

Tags: Attempt ot murder, Crime, Crime news

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు