Video: నకిలీ బిచ్చగాడు.. రోజు సంపాదన రూ.వెయ్యి

నకిలీ బిచ్చగాడు.. రోజు సంపాదన రూ.వెయ్యి

Video Video: బిచ్చం ఎత్తుకునే వారిని చూసి జాలి పడి ప్రజలు డబ్బులు ఇస్తారు. వాళ్ల సెంటిమెంట్‌ను తన నకిలీ వ్యాపారానికి ఉపయోగించుకొని... ఆ నకిలీ బిచ్చగాడు లక్షలు కూడబెడుతున్నాడు.

 • Share this:
  Video: మనం రోడ్డుపైకి వెళ్లగానే... కాలు లేదనో, చెయ్యి లేదనో చాలా మంది బిచ్చం అడుగుతూ వస్తూ ఉంటారు. వాళ్లకు నిజంగానే అవి లేవా లేక డ్రామా ఆడుతున్నారా అనే డౌట్ మనకు ఉన్నా... ఈ చిన్న విషయంపై పరిశోధన ఎందుకులే అని జాలి పడి డబ్బులిస్తాం. అలా... ఆ వ్యక్తులు... ఒకరి తర్వాత ఒకరి దగ్గరకు వెళ్లూ... అయ్యా, బాబూ అని అడుక్కుంటూ ఉంటారు. వాళ్లు నిజంగానే దివ్యాంగులు, ఆకలితో అలమటించేవారైతే... మనం బిచ్చం వేసినా తప్పు కాదు... కానీ వాళ్లు నకిలీ బిచ్చగాళ్లైతే... మనం మోసపోయినట్లే. మన మంచి తనాన్ని వాళ్లు క్యాష్ చేసుకుంటున్నట్లే. అలాంటి ఓ బిచ్చగాడి నిజస్వరూపం మధ్యప్రదేశ్... ఇండోర్‌లో బయటపడింది.

  అక్కడి ఓ సెంటర్‌లో ఓ బిచ్చగాడు.. తనకు కుడి చెయ్యి లేదంటూ... బిచ్చం ఎత్తుకుంటుంటే... ట్రాఫిక్ పోలీసులకు అతనిపై అనుమానం వచ్చింది. ఈ కొత్త బిచ్చగాడు ఎవడు... ఎక్కడి నుంచి వచ్చాడు.. అరే... ఎవర్నీ వదలకుండా అందర్నీ వెంటపడి మరీ అడుగుతున్నాడు... అసలు చెయ్యి ఏమైంది... ఎలా పోయింది.... ఇలా ఎన్నో అనుమానాలు ట్రాఫిక్ పోలీసులకు కలిగాయి. జాగ్రత్తగా గమనించారు. మధ్యాహ్నం వరకూ కలెక్షన్ కొల్లగొట్టిన బిచ్చగాడు... ఆ తర్వాత... ఎవరూ లేని చోటికి వెళ్తుంటే... ట్రాఫిక్ పోలీస్ సుమంత్ అతన్ని వెంబడించాడు. నీకు చెయ్యి వచ్చేలా చేస్తా... ఆపరేషన్ చేయిస్తా... ఏ స్థాయిలో దెబ్బతిందో చూపించు అని వెంబడించాడు.

  కొంతదూరం పరిగెత్తిన బిచ్చగాడు రాకేష్... ఆ తర్వాత దొరికిపోయాడు. తనకు చెయ్యి ఉందంటూ షర్టులో దాచుకున్న చేతిని బయటకు తీశాడు. దాంతో... అతను దివ్యాంగుడు కాదనీ... అలా నటిస్తున్నాడని తేలిపోయింది.

  పోలీసులు అతన్ని ప్రశ్నించగా... రోజుకు వెయ్యి రూపాయల దాకా సంపాదిస్తున్నట్లు చెప్పాడు. అది విని షాకవ్వడం పోలీసుల వంతైంది. అతని నిజస్వరూపాన్ని ట్రాఫిక్ పోలీస్ సుమంత్ బయటపెట్టారు. చెయ్యి లేనట్లు నటిస్తున్న అతన్ని చూస్తే ఎక్కడో ఏదో తేడాగా అనిపించిందనీ... అలా తాము డౌట్ పడటమే మంచిదైందనీ... ఇప్పుడు నిజం తెలిసిందని ఆయన చెప్పారు.

  రాజస్థాన్‌... కోటాకి చెందిన రాకేష్ తక్కువోడు కాదు. ఇదివరకు ఢిల్లీలో అడుక్కునేవాడు. అక్కడ కలెక్షన్ తగ్గిపోవడంతో... మధ్యప్రదేశ్ వచ్చాడు. ఇక్కడ కలెక్షన్ బాగా వస్తోంది. తాను ఒక్కడినే కాదనీ... తనతో పెద్ద గ్యాంగ్ ఉందని రాకేష్ చెప్పాడు. వాళ్లంతా... చెయ్యీ, కాలు, కళ్లు లేనట్లు నటిస్తారనీ... అందరికీ అన్నీ ఉన్నాయని చెప్పాడు. వాళ్ల కోసం వెతికితే... ఆల్రెడీ వాళ్లంతా ఇండోర్ నుంచి చెక్కేసినట్లు తేలింది.

  ఆ వీడియో ఇక్కడ చూడండి


  ఇది కూడా చదవండి: Rakshabandhan 2021: పేడతో రాఖీలు.. జోరుగా కొనుగోళ్లు

  ఇదీ పరిస్థితి. బిచ్చం అడిగేవాళ్లు కూడా ఈ రేంజ్‌లో రెచ్చిపోతున్నారు. ప్రజల్ని ఎడాపెడా మోసం చేస్తున్నారు. ప్రజల జాలి గుండెలు వాళ్లకు కాసులు కురిపిస్తున్నాయి. లక్షలు దోచేస్తూ... హాయిగా జీవిస్తున్నారు. ఈసారి ఎవరైనా బిచ్చం అడుగుతూ... దివ్యాంగులలా కనిపిస్తే... ఓసారి జాగ్రత్తగా గమనించమని కోరుతున్నారు పోలీసులు.
  Published by:Krishna Kumar N
  First published: