Husband: చనిపోయే ముందు భార్యకు ఓ పచ్చి నిజం చెప్పాడు.. అలా ఈ ముగ్గురు చేసిన నీచమైన పని బయటపడింది..

పోలీసుల అదుపులో నిందితులు

టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక ప్రజల జీవన శైలి పూర్తిగా మారిపోయింది. ఇంటర్నెట్ అందరికీ అందుబాటులోకి రావడం, సోషల్ మీడియాతో ప్రపంచంలో ఏ మూల ఏం జరిగినా స్పందించే అవకాశం ఉండటంతో స్మార్ట్‌ఫోనే జీవితమైపోయింది. అయితే.. సోషల్ మీడియాను మంచికీ వినియోగించుకునేవాళ్లున్నారు.

 • Share this:
  టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక ప్రజల జీవన శైలి పూర్తిగా మారిపోయింది. ఇంటర్నెట్ అందరికీ అందుబాటులోకి రావడం, సోషల్ మీడియాతో ప్రపంచంలో ఏ మూల ఏం జరిగినా స్పందించే అవకాశం ఉండటంతో స్మార్ట్‌ఫోనే జీవితమైపోయింది. అయితే.. సోషల్ మీడియాను మంచికీ వినియోగించుకునేవాళ్లున్నారు. చెడుకూ వినియోగించుకునే వాళ్లూ ఉన్నారు. అపరిచిత వ్యక్తులతో పరిచయాలు పెంచుకుని తీరా మోసపోయాక లబోదిబోమన్న వాళ్లు, చివరకు ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలూ గతంలో చోటుచేసుకున్నాయి. తాజాగా.. ఛత్తీస్‌గర్‌లో కూడా అలాంటి ఘటనే జరిగింది. కానీ.. తాను చనిపోయే ముందు భర్త అతని భార్యకు నిజం చెప్పడంతో అసలేం జరిగిందో వెలుగులోకి వచ్చింది.

  ఈ ఘటన గురించి పూర్తి వివరాల్లోకి వెళితే.. ఛత్తీస్‌గర్‌లోని నవ్‌గర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న సెమ్రా అనే గ్రామంలో సోనీలత, రేషమ్ లాల్ అనే భార్యాభర్తలు కాపురం ఉంటున్నారు. రేషమ్ లాల్‌ ఆర్థికంగా స్థితిమంతుడే. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉండే రేషమ్ లాల్‌కు ఫేస్‌బుక్‌లో నిషా అనే మహిళ పరిచయమైంది. ఆమె ఎవరో లాల్‌కు తెలియదు. కానీ.. ప్రొఫైల్ పిక్చర్‌లో ఆ మహిళ ఫొటో పెట్టడం, కాస్త చూడటానికి అందంగా కనిపించడంతో ఎఫ్‌బీలో ఆమెకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టాడు. ఆమె కూడా ఇలాంటి వ్యక్తుల కోసమే ఎదురుచూస్తోంది. దీంతో.. అతని రిక్వెస్ట్‌ను యాక్సెప్ట్ చేసింది. ఒకరి ఫొటోలను ఒకరు లైక్ కొట్టడం దగ్గర్నుంచి మెసెంజర్‌లో ఇద్దరూ చాట్ చేసుకునేంత వరకూ వీరి స్నేహం వెళ్లింది. అంతటితో ఆగలేదు. ఇద్దరూ ఫోన్ నంబర్లు తెలుసుకుని వాట్సాప్‌లో చాటింగ్, వీడియో కాల్స్ వరకూ వచ్చారు.

  కొన్నిరోజులకు ఆమెను లాల్ నేరుగా కూడా కలిశాడు. కలిసిన సమయంలో ఆమెతో శృంగారం చేశాడు. ఆ తర్వాత నుంచే అసలు కథ మొదలైంది. ఆ మహిళ తనతో గడిపిన దృశ్యాలను లాల్‌కు తెలియకుండా వీడియో తీసింది. లాల్‌కు ఫోన్ చేసి బ్లాక్‌మెయిల్ చేసింది. తాను అడిగినంత డబ్బు ఇవ్వకపోతే వీడియోను ఇంటర్నెట్‌లో పోస్ట్ చేస్తానని ఆమె బెదిరించింది. వీడియో పేరుతో బెదిరిస్తే తాను నమ్మనని చెప్పడంతో ఆ వీడియోను లాల్‌కు వాట్సాప్‌లో పంపింది. వీడియో చూసి కంగుతిన్న లాల్ విషయం బయట తెలిస్తే పరువు పోతుందని.. భార్యకు కూడా తెలియకుండా నిషా అడిగినప్పుడల్లా డబ్బులిస్తూ వచ్చాడు. వీడియో వైరల్ చేస్తానని బెదిరించడంతో అలా ఆరు నెలల్లో రేషమ్ లాల్ నిషాకు మొత్తం రూ.14 లక్షలు ఇచ్చాడు. ఇక.. ఆమె బెదిరింపులు తాళలేకపోయిన లాల్ ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. చనిపోయే ముందు జరిగిన విషయాన్ని భార్యతో చెప్పుకోవాలనుకున్నాడు.

  ఇది కూడా చదవండి: Sad: దొంగ అనుకుని ఆ యువకుడిని కట్టేసి కొట్టారు.. తీరా అసలు నిజం తెలిసి ఏం చేశారంటే..

  జరిగిందంతా.. లాల్ తన భార్య సోనీలతకు పూసగుచ్చినట్లు వివరించాడు. ఆ తర్వాత ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. భర్త చనిపోయిన తర్వాత సోనీలత ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితురాలితో పాటు ఈ బ్లాక్‌మెయిలింగ్ దందాలో ఆమెకు సహకరించిన మరో మహిళను, ఒకతనిని అరెస్ట్ చేశారు. పోలీసుల విచారణలో మరో విషయం కూడా వెలుగుచూసింది. నిందితురాలి అసలు పేరు నిషా కాదు. సుజాత, మరో మహిళ పేరు రజిత. ఇద్దరూ పేర్లు మార్చి ఫేస్‌బుక్‌లో ఫేక్ ఐడీలను క్రియేట్ చేసుకున్నారు. పోలీసులు నిందితుల వద్ద నుంచి రూ.లక్షా డెబ్భై వేల నగదుతో పాటు 3 బ్యాంకు పాస్‌బుక్‌లు, 4 ఏటీఎంలు, ఒక బైక్, ఒక స్మార్ట్‌ఫోన్, పది సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై సెక్షన్ 384 కింద కేసు నమోదు చేశారు.
  Published by:Sambasiva Reddy
  First published: