హైవేపై అందమైన యువతి, పక్కకు రమ్మని పిలిచి... ప్రియుడు, అతని స్నేహితులతో కలిసి...

నెల్లూరు జిల్లా హైవే మీద దోచుకుంటున్న కిలేడీ గ్యాంగ్‌... అందాన్ని ఎరగా వేసి దోపిడీకి ట్రాప్... ప్రియుడు, అతని స్నేహితులతో కలిసి

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: May 18, 2019, 12:20 PM IST
హైవేపై అందమైన యువతి, పక్కకు రమ్మని పిలిచి... ప్రియుడు, అతని స్నేహితులతో కలిసి...
నెల్లూరు జిల్లా హైవే మీద దోచుకుంటున్న కిలేడీ గ్యాంగ్‌... అందాన్ని ఎరగా వేసి దోపిడీకి ట్రాప్... ప్రియుడు, అతని స్నేహితులతో కలిసి
Chinthakindhi.Ramu | news18-telugu
Updated: May 18, 2019, 12:20 PM IST
అందాన్ని ఎరగా వేస్తూ హైవేల మీదే వెళ్లే లారీడ్రైవర్‌లను దోచుకుంటున్న కిలేడీ యువతి బాగోతం స్థానికంగా సంచలనం క్రియేట్ చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెల్లూరు జిల్లా హైవే మీద దోచుకుంటున్న గ్యాంగ్‌ గురించి వేదాయపాళెం పోలీసులు మీడియాకు వివరించారు. ఆ వివరాల ప్రకారం నెల్లూరు జిల్లా సంతపేట ఏరియాకు రమాదేవి అనే యువతికి ఆమంచర్ల గ్రామానికి చెందిన అనిల్‌కు వివాహేతర సంబంధం ఉంది. అనిల్ ఆటో నడుపుతూ జీవనం సాగించేవాడు. అయితే ఆటో ద్వారా వచ్చే ఆదాయం వారి జల్సాలకు సరిపోలేదు. దాంతో ఆమంచర్ల ఏరియాకు చెందన మల్లి శ్రీనివాస్, వీరేశం బాలవర్థన్‌లతో గురించి చోరీలు చేయాలని ఫిక్స్ అయ్యారు. పథకం ప్రకారం రమాదేవి అందాన్ని ఎరగా వేసి దోచుకోవడం మొదలెట్టారు. రాత్రి 8 అవ్వగానే అందంగా తయారై, లారీడ్రైవర్లే టార్గెట్‌‌గా హైవే మీద టార్చ్‌లైట్ పట్టుకుని నిలబడేది రమాదేవి. టార్చ్‌లైట్ వెలుగులో తన అందాలను చూపించి, లారీ ఆపాలని సైగ చేసేది. ఆమె అందానికి ఆకర్షితులై లారీ దిగి వచ్చిన డ్రైవర్లను పక్కకు రమ్మంటూ పిలిచేది. ఆమెపై ఆశపడి పొదల్లోకి వెళ్లేవాళ్లు లారీడ్రైవర్లు. అంతే అక్కడ సరైన సమయం కోసం ఎదురుచూస్తూ కాపుకాచి కూర్చునే అనిల్, బాలవర్థన్, శ్రీనివాస్... డ్రైవర్‌పై దాడి చేసి అతని దగ్గరున్న డబ్బులు, సొమ్ములు దోచుకునేవాళ్లు.

ఆ తర్వాత చీకట్లో దాచి ఉంచిన ఆటోలో పరారయ్యేవారు. ఇలా చాలామంది డ్రైవర్ల నుంచి డబ్బు, నగలు, సెల్‌ఫోన్లు దోచేసిందీ గ్యాంగ్. దోపిడికీ గురైన చాలామంది చెబితే పరువు పోతుందనే కారణంగా ఫిర్యాదు చేసేందుకు కూడా రాలేదు. దాంతో రెండేళ్లుగా దోచుకుంటూ జల్సాలు చేస్తూ ఎంజాయ్ చేశారు రమాదేవి అండ్ గ్యాంగ్. ఖమ్మం జిల్లా చింతకాని వంట గ్రామానకి చెందిన శివాజీ కూడా రమాదేవి ట్రాప్‌లో చిక్కాడు. అందాన్ని చూసి కక్కుర్తి పడి పొదల్లోకి వెళ్లాడు. తీరా అక్కడికి వెళ్లాక ఆశపడింది దొరకకపోగా తన దగ్గరున్న డబ్బు, సెల్‌ఫోన్, మెడలో గొలుసు దోచుకుని పోయింది రమాదేవి గ్యాంగ్. దాంతో ఏం చేయాలో తెలియక పోలీసులకు ఫిర్యాదు చేశాడు శివాజీ. అతని ఫిర్యాదుతో కేసు నమోదుచేసుకున్న పోలీసులు... లారీ డ్రైవర్ల రూపంలో రెక్కీ నిర్వహించారు. రమాదేవి అండ్ గ్యాంగ్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వీరి దగ్గర నుంచి ఐదు వేల డబ్బు, వెండి బ్రాస్‌లైట్, ఓ బంగారు ఉంగరంతో పాటు ఆటోను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. రమాదేవి ట్రాప్‌లో పడి ఎంత మంది లారీ డ్రైవర్లు దోపిడికి గురయ్యారోననే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

First published: May 18, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...