కన్నతండ్రిని నిర్దాక్షిణ్యంగా చంపిన కూతురు.. ఆ కారణానికే..

ప్రతీకాత్మక చిత్రం

ఇద్దరు పిల్లల్లో కుమార్తె(15) పెద్దది. తొమ్మిదో తరగతి చదువుతున్న కుమార్తెకు.. ఆమె స్కూల్లో ప్రవీణ్ అనే బాలుడితో పరిచయం ఏర్పడింది. వారిద్దరి ఫ్రెండ్‌షిప్ విషయం ఆమె తండ్రికి తెలిసింది. మగపిల్లలతో స్నేహం వద్దని ఆమె తండ్రి వారించాడు.

 • Share this:
  మగపిల్లలతో స్నేహం వద్దని వారించినందుకు ఆమె తండ్రి పైనే కక్ష పెంచుకుంది. ఆయనెవరు తనను వద్దనడానికి అని లోలోపల రగిలిపోయింది. ఇదే విషయంలో ఓరోజు ఆ తండ్రి.. కూతురిపై చెయ్యి చేసుకోవడంతో ఆమె మనసు మరింత కక్షతో నిండిపోయింది. చివరకు తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి తండ్రినే హతం చేసింది. బెంగళూరులో ఈ ఘటన వెలుగుచూసింది.

  వివరాల్లోకి వెళ్తే.. బెంగళూరులోని రాజాజీ నగర్‌లో చాలాకాలంగా ఓ కుటుంబం నివసిస్తోంది. క్లాత్ మర్చంట్‌గా పనిచేసే అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇద్దరు పిల్లల్లో కుమార్తె(15) పెద్దది. తొమ్మిదో తరగతి చదువుతున్న కుమార్తెకు.. ఆమె స్కూల్లో ప్రవీణ్ అనే బాలుడితో పరిచయం ఏర్పడింది. వారిద్దరి ఫ్రెండ్‌షిప్ విషయం ఆమె తండ్రికి తెలిసింది. మగపిల్లలతో స్నేహం వద్దని ఆమె తండ్రి వారించాడు. ఇదే విషయంలో ఒకరోజు ఆమెను కొట్టాడు. దీంతో తండ్రి పైనే పగ పెంచుకుంది.ఆదివారం ఉదయం 10.30గం. సమయంలో ఇంట్లో తండ్రి, తాను మాత్రమే ఉన్న సమయంలో..అతనికి పాలల్లో నిద్రమాత్రలు వేసింది. అతను అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో తన స్నేహితుడిని ఇంటికి పిలిపించి అతనితో కలిసి తండ్రిని హత్య చేసింది. ఆపై మృతదేహానికి ఇద్దరు కలిసి నిప్పంటించి పరారయ్యారు. ఇంట్లో నుంచి పొగలు వస్తుండటంతో చుట్టుపక్కలవారు పోలీసులకు సమాచారం అందించారు.

  పోలీసులు వచ్చేసరికి అతని మృతదేహం బాత్రూమ్‌లో సగం కాలిపోయి ఉంది. దీనిపై ఆ బాలికను విచారించగా.. పొంతన లేని సమాధానాలు చెప్పింది. తాను బ్రేక్‌ఫాస్ట్ చేయడానికి సమీపంలోని బంధువుల ఇంటికెళ్లి వచ్చానని.. ఆలోపే ఇలా జరిగిపోయిందని చెప్పింది. మరో సందర్భంలో మార్నింగ్ వాక్‌కి వెళ్లొచ్చేసరికి ఇలా జరిగిందని తెలిపింది. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు
  కాస్త లోతుగా విచారించగా అసలు విషయం బయటపెట్టింది. కన్నతండ్రినే పొట్టనబెట్టుకున్న ఆ కూతురిపై చాలామంది విమర్శలు గుప్పిస్తున్నారు.
  Published by:Srinivas Mittapalli
  First published: