Andhra Pradesh: ఆ గ్రామ ప్రజలకు కంటిమీద కునుకు కరువు.. ఎటువైపు నుంచి దాడి జరుగుతుందో తెలియక భయం భయం

ప్రతీకాత్మక చిత్రం

What Happend this Village: పగలు, రాత్రి తేడా లేదు.. క్షణ క్షణం భయంతో బతుకుతున్నారువారంతా..? ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక అరచేత ప్రాణాలను పెట్టుకుంటున్నారు. ఇంతకీ ఆ గ్రామస్తులను భయపెడుతున్నది ఏంటో తెలుసా? ఎందుకు అంతలా భయపడుతున్నారు.

 • Share this:
  Tension has gripped Uddanam: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లోని శ్రీకాకుళం జిల్లా (Srikakulam District)లో ఉన్న ఉద్దానం (Uddanam)గురించి అందరూ వినే వింటారు. అక్కడి ప్రజలంతా కిడ్నీ సంబంధింత వ్యాధులతో ఇబ్బంది పడుతుండడంతో గుర్తింపు వచ్చింది. సాధారణంగా ఎవరికైనా జ్వరం వస్తే కరోనా వైరస్ (Corona Virus) వచ్చిందని భయపడతారు.. కానీ అక్కడ ఎవరికి జ్వరం వచ్చినా కిడ్నీ సమస్య ఉందా అని భయపడుతుంటారు.. ఇప్పటికే ఆ సమస్య అలాగే ఉంది.. ఇప్పుడు వారిని మరో టెన్షన్ వెంటాడుతోంది. ప్రాణాలు అరచేత పెట్టుకునేలా చేస్తోంది. గత కొంతకాలంగా ఎలుగుబంట్లు (Bears)కలకలం రేపుతున్నాయి. తాజాగా శ్రీకాకుళం జిల్లాలోని మందస మండలం బాహడపల్లి గ్రామంలో ఎలుగుబంటి బీభత్సం స‌ృష్టించింది. హఠాత్తుగా ఊరిలోకి చొరబడ్డ ఎలుగుబంటి కనిపించిన వారిపై దాడికి ప్రయత్నించింది. ఇలా ఎలుగు బంటి లోకనాధంపై దాడికి దిగింది. దీంతో లోకనాధంను సమీపంలోని హరిపురం ప్రభుత్వ ఆస్పత్రికి (Government Hospital)కు తరలించారు. గాయపడ్డ లోకనాధం పరిస్థితి ప్రస్తుతం బాగానే ఉంది. ఊహించని విధంగా విరుచుకుపడిన ఎలుగు దాడితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

  మరోవైపు దాడి చేసిన ఎలుగు కనిపించకుండా పోవడంతో మళ్లీ ఆ ఎలుగు బంటి ఎక్కడ దాడి చేస్తుందోనని బాహడపల్లి గ్రామంతో పాటు చుట్టు ప్రక్కల గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఇలా ఎలుగుబంటి దాడి చేయడం ఇదే మొదటి సారి కాదు. ఇటీవల శ్రీకాకుళం జిల్లాలో ఇటీవల ఒక ఎలుగుబంటి దాడి ఘటనలో ఒక మహిళ మృతి చెందగా, ఏడుగురు గాయపడ్డారు. సోంపేట మండలం ఎర్రముక్కాం గ్రామంలోకి ఒక్కసారిగా ఎలుగుబంటి చొరబడి బీభత్సం సృష్టించింది.40 ఏళ్ల ఊర్మిళ ఆమె భర్త తిరుపతిరావు చనిపోయారు.
  అయితే ఇప్పటికీ ఉద్దానం ప్రజలను ఎలుగుబంట్లు భయభ్రాంతులకు గురిచేస్తూనే ఉన్నాయి.

  ఇదీ చదవండి: ఆకు కూరలు తింటే ఎన్నో ప్రయోజనాలు.. ఏఏ ఆకుకూరలతో ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి

  సోంపేట మండలంలోని ఎర్రముక్కాం, పాతపితాళిలలో ఎలుగుబంటి చేసిన బీభత్సం ఇంకా అక్కడి ప్రజల కళ్ల ముందు కదులుతూనే ఉంది. ఎర్రముక్కాం గ్రామంలో ఎలుగుబంటి సృష్టించిన బీభత్సంతో గ్రామానికి చెందిన బైపల్లి శ్యాం జీవితం చీకట్లోకి వెళ్లిపోయింది. మొత్తం ఆరు కుటుంబాలకు ఎలుగు రూపంలో తీరని కష్టం కలిగింది.

  ఇదీ చదవండి: నోటి పూత సమస్యతో బాధపడుతున్నారా.. ఈ నేచురల్ టిప్స్ పాటిస్తే చాలు.. కొన్ని రోజల్లోనే ఫలితాలు

  ఎర్రముక్కాం గ్రామంలో గత ఎనిమిది సంవత్సరాలుగా ఒక ఎలుగు సంచరించేది. మనుషులు మాటలు విని వెళ్లిపోతుండంతో దాన్ని గ్రామస్తులు ఏమి అనేవారు కాదు. కాని ఒక ఎలుగు ఎర్రముక్కాంలో సృష్టించిన విధ్వంసంతో గ్రామంలో ఎలుగు పేరు చెపితే బయపడే పరిస్థితి వచ్చింది. ఇక చుట్టుపక్కలున్న గ్రామాల్లో కూడా ఎలుగులు సంచరిస్తున్నాయని ప్రజలు భయపడుతున్నారు. మందస మండల పరిధిలో రెండు ఎలుగులు సంచరిస్తున్నాయని ఆ గ్రామంలోని యువత గ్రామం చుట్టూ కర్రలు పట్టుకుని కాపలా కాస్తున్నారు.

  ఇదీ చదవండి: మీ పని మాది అంటున్న యాప్స్.. బూజు దులిపే దగ్గర నుంచి హెయిర్ కటింగ్ వరకు అన్నీ ఇంటి దగ్గరే.. ఏపీలో పెరిగిన డిమాండ్

  సోంపేట, మందస మండలాల్లో బీభత్సం సృష్టించిన ఎలుగుబంటిని గ్రామస్తులు చంపేశారు. అది హతమైనప్పటికీ పదుల సంఖ్యలో ఉన్న ఎలుగుబంట్లు ఉద్దానం వాసులను తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఇటీవల రెండు ఎలుగుబంట్లు సముద్ర తీర ప్రాంతాల్లో హల్‌చల్‌ చేశాయి. దీంతో తీర ప్రాంతానికి చెందిన ఉద్దానం వాసులు ఏ క్షణాన ఏం జరుగుతుందోనని భయపడుతున్నారు.

  ఇదీ చదవండి: యాపిల్ మంచిదని ఎక్కువగా తింటున్నారా..? అయితే జాగ్రత్త.. ప్రమాదం మీ చెంతనే..

  ఉద్దానం కొండలు, జీడితోటల్లో సంచరిస్తున్న రెండు ఎలుగులు దారి తప్పి భేతాళపురం, దున్నవూరు, రట్టి, గంగువాడ తదితర గ్రామాల పరిసరాల్లో తిరుగుతున్నాయి. ఇక మందస మండలంలోని నల్లబొడ్లూరు గ్రామానికి చెందిన బొడ్డు గంగమ్మ తోటల్లోకి వెళ్తుండగా ఒక్కసారిగా ఎలుగుబంటి దాడి చేసింది. ఆమె కుడిచేయిపై కొంత భాగాన్ని కొరికేసింది. గ్రామస్తులు గమనించి, కేకలు వేసి తరమడంతో ఎలుగు పారిపోయింది. అలాగే సువర్ణాపురం గ్రామానికి చెందిన సాలీన భీమారావు తోటకు వెళ్తుండగా దారిలో ఎలుగుబంటి దాడికి యత్నించడంతో..
  సమయ స్ఫూర్తితో వ్యవహరించి సమీపంలోని చెట్టు ఎక్కారు. దీంతో ఆ ప్రాంతంలోనే కొంతసేపు తిరిగిన ఎలుగుబంటి.. చివరకు వెళ్లిపోవడంతో ఆయన బతుకు జీవుడా అనుకుంటూ ఇంటికి చేరుకున్నారు. ఇలా వరుస ఎలుగుబంట్లు దాడులతో ఉద్దాన ప్రాంత వాసులు హడలెత్తి పోతున్నారు. ప్రాణభయంతో రాత్రి వేళల్లో ఇంటి నుంచి రావడానికి భయపడుతున్నారు.
  Published by:Nagesh Paina
  First published: