Be Care Full In Auto Journey: మీరు మహిళలా? ఆటోలో ఒంటరిగా ప్రయాణిస్తున్నారా? (Auto Journey) అయితే కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిందే.. ఎందుకంటే.. ఆటోలో ప్రయాణికులలాగా ఎక్కి.. మీతోనే ప్రయాణిస్తూ మీ బ్యాగ్‌ల నుంచి దొంగతనాలు (Thefting) చేసే మహిళలు ఎక్కువైపోయారు. ఆటోల్లో దొంగతనం చేయడం కుదరకపోతే.. తమ పంథా మార్చి మీరు దిగిపోయాక.. కత్తులతో బెదిరించి మరీ మీదగ్గర ఉన్న డబ్బు, నగలు, ఇతర ఆభరణాలు దోచుకుని పోతున్నారు. అలాంటి ఇద్దరు పాత మహిళా నేరస్తులను విజయనగరం జిల్లా (Vizianagaram District) పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి ఇలాంటి పలు కేసుల్లో దోచుకున్న 11.5 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.
విజయనగరం జిల్లాలో ఇటీవల చోటు చేసుకుంటున్న వినూత్న దోపిడీని పోలీసులు చేధించారు. విజయనగరం గంట్యాడలో కత్తులతో బెదిరించి దోపిడీకి పాల్పడ్డ ఇద్దరు పాత నేరస్తులను విజయనగరం డీఎస్పీ అనిల్ కుమార్.. మీడియా ముందు ప్రవేశపెట్టారు. రెండు రోజుల క్రితం గంట్యాడ మండలానికి చెందిన కమ్మెల్ల రామలక్ష్మి.. విజయనగరం పట్టణంలోని ఓ బంగారు షాపులో 11.5 తులాల బరువున్న రెండు మొలగొలుసులను కొనుగోలు చేశారు. తిరుగు ప్రయాణంలో గంట్యాడకు వెళ్లేందుకు ఆటో ఎక్కారు.
ఇదీ చదవండి : సోలార్ ఉన్నా చలినీళ్లతోనే విద్యార్థుల స్నానాలు.. ఎందుకంటే?
రామలక్మ్మిని గమనించిన ఇద్దరు పాత మహిళా నేరస్తులు.. అదే ఆటోను ఫాలో అవుతూ ..అయ్యన్నపేట దాటిన తరువాత ఆటో మారి ఆమె వెళ్తున్న ఆటో ఎక్కారు. కొత్తవలస 202 కాలనీకి చెందిన గంటా కాళేశ్వరి, విశాఖ జిల్లా కె.కోటపాడు గ్రామానికి చెందిన రావుల ఎల్లారమ్మలు ఆటో ఎక్కారు. కొంతదూరం వెళ్లాక రామలక్ష్మి ఆటో దిగి ఇంటికి వెళ్తుండగా.. ఆమెనే ఫాలో అవుతున్న ఇద్దరు పాత నేరస్తులు.. వెనుక నుంచి వచ్చి కత్తి చూపించి బెదిరించడం మొదలుపెట్టారు.
ఇదీ చదవండి : నాన్ వెజ్ ప్రియులకు శుభవార్త.. భారీగా తగ్గిన చికెన్ ధర.. కారణం ఇదేనా..?
భయపడిన రామలక్ష్మీ చేతినుండి బ్యాగ్‌ను లాక్కొన్నారు. ఒకరు కత్తితో భయపెడుతుంటే.. మరో నేరస్తురాలు బ్యాగులో ఉన్న బంగారు ఆభరణాలను లాక్కొంది. పని అయిపోవడంతో.. అక్కడ నుంచి పరారయ్యారు. కత్తులు చూపించి బెదిరించడంతో.. నిర్ఘాంతపోయిన రామలక్ష్మి.. తర్వాత కాసేపటికి కోలుకొని.. ఈ ఘటనపై గంట్యాడ పోలీసు స్టేషన్లో ఫిర్యాదుచేసింది.
ఇదీ చదవండి : చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ పదవి కోసం ఫైట్.. వాట్సప్ లో వైరల్ పోస్టులు
దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు రెండు రోజుల తర్వాత .. గంట్యాడ మండలం తామరపల్లి కూడలి వద్ద ఆకస్మిక వాహన తనిఖీలు చేస్తుండగా, ఎస్.కోట నుంచి గంట్యాడ వైపు వస్తున్న ఆటో తామరాపల్లి జంక్షన్ కు రాగానే.. పోలీసులను చూసి అనుమానం వచ్చి, ఆటో దిగి గాబరాగా వెళ్లిపోవడం మొదలు పెట్టారు. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు.. ఆ ఇద్దరు మహిళలను వెంబడించి.. అదుపులోకి తీసుకున్నారు.
వారి వివరాలను అడిగేందుకు ప్రయత్నించగా తడబడడం మొదలుపెట్టారు. దీంతో చోరీ కేసు నిందితులుగా భావించి గంట్యాడ పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చి.. వారిని విచారించారు. విచారణలో వారు పాతనేరస్తులుగా గుర్తించడంతో.. ఆటోలో ప్రయాణిస్తున్న రామలక్ష్మి అనే మహిళను కత్తులతో బెదిరించి బంగారు ఆభరణాలను తస్కరించింది తామేనని అంగీకరించారు. ఆభరణాలను పోలీసులకు అప్పగించారు.
ఇదీ చదవండి : లక్క బొమ్మల గురించి మరిచిపోవాల్సిందేనా..? సమస్య ఏంటో తెలుసా..?
వారిద్దరిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలిస్తున్నట్టు డీఎస్పీ వెల్లడించారు. ఇద్దరు పాత మహిళా నేరస్తులలో గంటా కాళేశ్వరి పైన 22 కేసులు, రావుల ఎల్లారమ్మపై 18 కేసులు గతంలో ఉన్నట్లు గుర్తించారు. ఆటోలో ప్రయాణించే సమయంలో అప్రమత్తంగా ఉండాలని, బంగారు ఆభరణాలతో ప్రయాణాల సమయంలో ఎవరినైనా తోడు ఉండేలా చూసుకోవాలని పోలీసులు కోరుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Crime news, Vizianagaram