రోజు రోజుకు సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. అమాయకులను ఆసరా చేసుకొని వారిని నిలువునా ముంచుతున్నారు. ఫోనుకు వచ్చిన లింక్ క్లిక్ చేస్తే చాలు బ్యాంక్ అకౌంట్స్ లోని డబ్బులు ఖల్లాస్ అవుతున్నాయి. స్మార్ట్ యాప్స్, ఆన్‌లైన్ గేమ్స్ వచ్చి సైబర్ క్రిమినల్స్‌కి రూట్ క్లియర్ అయ్యాయి. అన్నోన్యాప్స్ ట్రాప్‌లో ఈజీగా చిక్కుతున్నారు. షాపింగ్, ఫుడ్, మనీ అవసరాల కోసం అన్నోన్ లింక్స్ క్లిక్ చేసి సైబర్ నేరగాళ్లకు టార్గెట్అవుతున్నారు. ఇలాంటి ఘటనే బెంగళూరులో జరిగింది. బెంగళూరుకు చెందిన ఓ 65 ఏళ్ల వ్యక్తి ఇలాగే మోసపోయాడు. అన్ నోన్ లింకులతో యాప్ డౌన్ లోడ్ చేసి అడ్డంగా బుక్కయ్యాడు. ఆ యాప్ ద్వారా తిరువనంతపురంకు ఫ్లైట్ టికెట్ బుక్ చేయాలని ప్రయత్నించాడు. ఇంకేముంది అతని ఆకౌంట్ నుంచి 7 లక్షల రూపాయలు పోయినట్లు బ్యాంక్ నుంచి మెసేజ్ వచ్చింది. ఇలాగే.. నాసిక్ లోనూ ఓ డాక్టర్ ను కూడా సైబర్ నేరగాళ్లు బురిడీ కొట్టించారు. వాట్సాప్ కు మీ ఫోన్ సిమ్ కార్డు ఔట్ డేట్ అయిందని మెసేజ్ పంపి.. ఈ యాప్ ద్వారా సమస్య పరిష్కరించుకోవచ్చని లింక్ పంపారు.
ఇంకేముంది ఆ లింక్ ఓపెన్ చేసిన యాప్ డౌన్ లోడ్ చేసిన తర్వాత భారీగా ఆ డాక్టర్ అకౌంట్ నుంచి డబ్బుల్ని దోచుకున్నారు నేరగాళ్లు.గతేడాదితో పోల్చితే ఈ ఏడాది సుమారు 30 శాతం సైబర్ క్రైమ్స్పెరిగినట్టు పోలీసులు చెబుతున్నారు. లాక్‌డౌన్ టైమ్‌లో ఎక్కువ మంది ఆన్‌లైన్ గేమ్స్‌కి పై ఇంట్రస్ట్ చూపినట్టు కేస్ స్టడీస్ చెప్తున్నాయి. టైమ్‌పాస్ కోసం ప్లే చేసిన గేమ్స్ ఇప్పుడు అకౌంట్స్ ఖాళీ చేయిస్తున్నాయి.
నెటిజన్లు అన్నోన్యాప్స్, యూఆర్‌ఎల్ లింక్స్ క్లిక్ చేయడంతో సైబర్ నేరగాళ్లకు టార్గెట్‌గా మారుతున్నారు. క్విక్ సపోర్ట్ యాప్, టీమ్ వ్యూవర్‌ను ఇన్‌స్టాల్ చేయిస్తూ సైబర్ క్రిమినల్స్ రెచ్చిపోతున్నారు. ఓటీపీలు లేకుండానే అకౌంట్స్ ఖాళీ చేస్తున్నారు. ఇలాంటి అన్ నోన్ యాప్స్ తో జర జాగ్రత్తగా ఉండాలని ఆర్బీఐ మెసేజ్ లు పంపుతున్నా.. ఈజీగా సైబర్ నేరగాళ్లకు టార్గెట్ అవుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime news, CYBER CRIME, FAKE APPS, Rbi