పెళ్లికొడుకును బంధించి... మరొకరిని పెళ్లి చేసుకున్న వధువు

పోలీసుల ప్రకారం... ఆ జంట ఆరేళ్ల కింద సామూహిక వివాహాల్లో భాగంగా పెళ్లి చేసుకున్నారు. ఎందుకో అప్పుడు పెళ్లి జరిగిన ఫీల్ వాళ్లకు కలగలేదు. ఆరేళ్ల తర్వాత ఇప్పుడు మళ్లీ సంప్రదాయబద్ధంగా నంగల్జాత్ గ్రామంలో పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు.

news18-telugu
Updated: December 8, 2019, 8:56 AM IST
పెళ్లికొడుకును బంధించి... మరొకరిని పెళ్లి చేసుకున్న వధువు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
Uttar Pradesh : తన పెళ్లికి తానే లేటుగా వచ్చి... ఊహించని షాక్ తిన్నాడు ఆ పెళ్లి కొడుకు. ఉత్తరప్రదేశ్‌... బిజ్నూర్‌లోని నంగల్జాత్ గ్రామంలో జరిగిందీ ఘటన. పోలీసుల ప్రకారం... ఆ జంట ఆరేళ్ల కింద సామూహిక వివాహాల్లో భాగంగా పెళ్లి చేసుకున్నారు. ఎందుకో అప్పుడు పెళ్లి జరిగిన ఫీల్ వాళ్లకు కలగలేదు. ఆరేళ్ల తర్వాత ఇప్పుడు మళ్లీ సంప్రదాయబద్ధంగా నంగల్జాత్ గ్రామంలో పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. ఈ కారణంగా... ఈ ఆరేళ్లూ... ఆమె అత్తారింటికి కూడా వెళ్లలేదు. అయితే అతనితో రెండోసారి జరుగుతున్న పెళ్లి విషయంలో రెండు కుటుంబాల్లో కట్నం విషయంలో తేడా వచ్చింది. వెంటనే వరుడు, అతని బంధువుల్ని అక్కడే బంధించారు. అంతేకాదు... పెళ్లి కూతురి కోసం తెచ్చిన నగలు, విలువైన వస్తువుల్ని లాగేసుకున్నారు. ఇంతలో... ఆమె మనసు మార్చుకుంది. తల్లిదండ్రులు, ఊరి పెద్దల మాట ప్రకారం... వాళ్ల ఇంటి పక్కన నివసిస్తున్న మరో కుర్రాణ్ని పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత వరుడు, అతని బంధువుల్ని రిలీజ్ చేశారు.

వధువు కుటుంబ సభ్యులు ఏమంటున్నారంటే... కట్నంగా... డబ్బు, బైక్ అడుగుతున్నారనీ... అవి ఇచ్చుకునేంత స్థోమత తమకు లేవని అంటున్నారు. ఐతే... తాము అడిగినవి ఇవ్వకపోతే... పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని వరుడి బంధువులు ముందే హెచ్చరించినట్లు టాక్. పెళ్లి సమయంలో రెండు వైపులా గొడవ జరగడంతో... పీటలపై పెళ్లి ఆగింది. ఆ తర్వాత వాళ్లను బంధించారు. ఇలా పెళ్లి కొడుకు ఆశలు ఆవిరయ్యాయి. ఈ ఘటనపై రెండు వైపులా ఎవరూ పోలీసులకు కంప్లైంట్ ఇవ్వలేదు.

 

Pics : మేఘా ఆకాశ్ క్యూట్ ఫొటోస్


ఇవి కూడా చదవండి :

ఇంటర్నెట్‌లో టీచర్ నగ్న చిత్రాలు... ఎలా వచ్చాయ్?నిత్యానంద వీడియో రిలీజ్... పిచ్చి పీక్ స్టేజ్‌కి చేరిందిగా...

IND VS WI : వెస్టిండీస్‌తో నేడు రెండో టీ20... గెలిస్తే సిరీస్ భారత్‌దే...

జరిగింది ఎన్‌కౌంటరేనా? NHRC ఏం చెప్పబోతోంది?

జగన్‌కి మేలుచేసిన కేసీఆర్... వైసీపీ హ్యాపీ
First published: December 8, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు