బ్యాంకులోనే దొంగ మృతి...స్ట్రాంగ్ రూం కట్ చేస్తుంటే ప్రమాదం...షాకింగ్

సినిమా తరహాలో బ్యాంకుకు కన్నం వేశాడు. లోపలికి ప్రవేశించాడు. అంతా ప్లాన్ ప్రకారం సెట్ చేసుకున్నాడు. కానీ ఒక్క చిన్న పొరపాటు ఆ దొంగ జీవితానికి ముగింపు పలికింది.

news18-telugu
Updated: August 10, 2020, 11:49 PM IST
బ్యాంకులోనే దొంగ మృతి...స్ట్రాంగ్ రూం కట్ చేస్తుంటే ప్రమాదం...షాకింగ్
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
సినిమా తరహాలో బ్యాంకుకు కన్నం వేశాడు. లోపలికి ప్రవేశించాడు. అంతా ప్లాన్ ప్రకారం సెట్ చేసుకున్నాడు. కానీ ఒక్క చిన్న పొరపాటు ఆ దొంగ జీవితానికి ముగింపు పలికింది. వివరాల్లోకి వెళితే గుజారత్ లోని అహ్మదాబాద్ పట్టణంలో ఓ బ్యాంకు దొంగతనానికి వెళ్లాడో దొంగ. బ్యాంకు స్ట్రాంగ్ రూమ్‌ తలుపులు కోస్తున్న ప్రయత్నంలో అతడి మెడ తెగడంతో అక్కడికక్కడే మరణించాడు. బ్యాంకుకు కన్నం వేయడానికి వెళ్లిన ఆ దొంగ ఓ ఎలక్ట్రిక్ కట్టర్ సహాయంతో స్ట్రాంగ్ రూమ్‌ తలుపులు బలవంతంగా తెరవాలని నిర్ణయించుకున్నాడు. అయితే స్ట్రాంగ్‌ రూమ్‌లోకి వెళ్లే దారి సన్నగా ఉండటంతో అతని చేతిలోని ఎలక్ట్రిక్ కట్టర్ పొరబాటున అతడి మెడకు తాకింది. ఇంకేముంది సర్రుమని అతడి మెడ గొంతులోకి దిగిపోయింది. తీవ్ర రక్త స్రావంతో అతడు స్పాట్ లోనే మరణించాడు. దొంగ మృతదేహాన్ని గమనించిన బ్యాంకు మేనేజర్ వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు.
Published by: Krishna Adithya
First published: August 10, 2020, 11:49 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading