Bank Loot: బ్యాంక్ దగ్గర హైడ్రామా... రూ.58 లక్షలు దోపిడీ... అచ్చం సినిమాల్లోలాగే...

బ్యాంక్ దగ్గర హైడ్రామా... రూ.58 లక్షలు దోపిడీ... అచ్చం సినిమాల్లోలాగే... (ప్రతీకాత్మక చిత్రం)

Bank Loot: బ్యాంక్ దోపిడీలు ఇలా కూడా జరుగుతాయా అనిపించేలా జరిగిందా ఘటన. అందరూ చూస్తుండగానే రూ.58 లక్షలు దోచేశారు. ఎలాగో తెలుసుకుందాం.

  • Share this:
    Bank Loot in Agra: అది ఆగ్రాలోని రోహ్తా ఏరియా. అక్కడ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఉంది. టైమ్... మంగళవారం సాయంత్రం అయ్యింది. బ్యాంకు బయట ఉన్న ఏటీఎం బ్రాంచి నుంచి కొందరు ఉద్యోగులు బయటకు వచ్చారు. సరిగ్గా అప్పుడే మరణాయుధాలతో వచ్చిన దుండగులు... ఓ ఉద్యోగి పట్టుకొని... పాయింట్ బ్లాంక్‌లో గన్ గురిపెట్టారు. ఒక్కసారిగా కలకలం రేగింది. తనను చంపొద్దని ఆ ఉద్యోగి వేడుకుంటుంటే... ఆ దుండగులు... ఆ ఉద్యోగిని అలాగే పట్టుకొని... బ్యాంక్ లోపలికి వెళ్లారు. అక్కడి సెక్యూరిటీ గార్డు చేతిలోని ఆయుధాన్ని దుండగులు లాగేసుకున్నారు. బ్యాంకులో ఎక్కడ ఉన్నవారి అక్కడే ఉండాలనీ... లేదంటే ఆ ఉద్యోగిని చంపేస్తామని బెదిరించారు. దాంతో... ఉద్యోగులు, కస్టమర్లు అందరూ శిలలా అయిపోయారు.

    ఆ తర్వాత దుండగులు తమతో తెచ్చిన తాళ్లతో... బ్యాంక్ సిబ్బందిని కట్టేశారు. ఆ తర్వాత మేనేజర్ తలకు గన్ గురిపెట్టి... పద అంటూ... స్ట్రాంగ్ రూమ్‌కి లాక్కెళ్లారు. "ఊ...చూస్తావే... తాళం తియ్" అంటూ ప్రెషర్ పెంచడంతో... మేనేజర్... స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేశాడు. అంతే... దుండగులు... తమతో తెచ్చుకున్న సంచుల్లో... డబ్బు కట్టలను అలా వేసేసుకున్నారు. ఆ తర్వాత... క్షణాల్లో అక్కడి నుంచి పారిపోయారు. చూస్తుండగానే అంతా అయిపోయింది.

    దుండగులు పారిపోతుంటే... బ్యాంక్ ఉద్యోగులు పోలీసులకు కాల్ చేశారు. పోలీసులు వెంటనే అక్కడికి వచ్చారు కానీ అప్పటికే దుండగులు పారిపోయారు. వెంటనే పోలీసులు... బ్యాంక్ సీసీ కెమెరా ఫుటేజ్ చూడగా... దుండగుల ముఖాలు గుర్తు పట్టలేని విధంగా ఉన్నాయి. అందరూ కరోనా మాస్క్ లాంటి ముసుగులతోనే ఉన్నారు. వారి కోసం ప్రత్యేక టీమ్‌లు రంగంలోకి దిగి గాలించినా... ఎక్కడా దుండగులు దొరకలేదు.

    ప్రస్తుతం బ్యాంక్ దగ్గర పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు. ఆగ్రాలోని అన్ని సరిహద్దుల దగ్గరా చెకింగ్ చేస్తున్నారు. ఈ దోపిడీలో మొత్తం ఐదుగురు పాల్గొన్నారని ఆగ్రా SSP బబ్లూ కుమార్ తెలిపారు. బబ్లూతోపాటూ... ADG అజయ్ ఆనంద్, IG సతీష్ గనేష్ కూడా స్పాట్‌కి వెళ్లి ఏం జరిగిందో తెలుసుకున్నారు.

    ఇది కూడా చదవండి:Love Harassment: నిమ్స్ మహిళా డాక్టర్‌పై లైంగిక వేధింపులు... ఆ మెసేజ్‌లు పంపుతూ...

    ఈ కేసుకు సంబంధించి సదార్ పోలీస్ స్టేషన్‌లో FIR నమోదైంది. ఆగ్రా పోలీసులతోపాటూ... చుట్టుపక్కల అలీఘడ్, ఫిరోజాబాద్, హత్రాస్, మథుర, ధోల్పూర్, మోరేనా పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు. సెర్చ్ కొనసాగుతోంది. మొత్తం 7 బృందాలు దుండగుల కోసం గాలిస్తున్నాయి. ఈ దోపిడీ దొంగలతో బ్యాంక్ సిబ్బందిలో ఎవరికైనా సంబంధం ఉందా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు.
    Published by:Krishna Kumar N
    First published: