HOME »NEWS »CRIME »bank loans scam busted in east godawari andhra pradesh prn

Andhra Pradesh: రైతుల పేరుతో ఘరానా మోసం.., మోసగాళ్లతో బ్యాంక్ అధికారుల కుమ్మక్కు..?

Andhra Pradesh: రైతుల పేరుతో ఘరానా మోసం.., మోసగాళ్లతో బ్యాంక్ అధికారుల కుమ్మక్కు..?
ప్రతీకాత్మక చిత్రం

సాధారణంగా కౌలు కార్డుపై ఎకరానికి రూ.35 వేలకు మించి లోన్ ఇచ్చే అవకాశం లేదు. అలాంటికి ఏకంగా లక్షలాది రూపాయాలు ఎలా మంజూరు చేశారన్నది అనుమానాస్పదంగా మారింది.

  • Share this:
    దుక్కిదున్నడం, పంట పండించడం తప్ప వారికేం తెలియదు. బ్యాంకులు లెక్కల గురించే అవగాహనే లేదు. ఇంకేముందు కేటుగాళ్లు రంగంలోకి దిగారు. బ్యాంక్ అధికారులతో కుమ్మక్కై లోన్లు నొక్కేశారు. విషయం బయటపడే సరికి దిద్దుబాటు చర్యలు ప్రారంభించారు. వివరాల్లోకి వెళ్తే తూర్పుగోదావరి జిల్లా అంబాజీ పేటలో రైతుల పేరుతో భారీ కుంభకోణం జరిగింది. రైతులకు తెలియకుండానే వారి భూమిపైనే కొందరు వ్యక్తులు లక్షల రూపాయల లోన్లు తీసుకున్నారు. పొలాలపై అప్పటికే పెండింగ్ లోన్లున్నా బ్యాంక్ అధికారులు అవేం పట్టించుకోకుండా మళ్లీ రుణాలిచ్చేశారు. దీంతో భూమికి అసలైన యజమానులైన రైతులు అవాక్కయ్యారు. అంబాజీపేట మండలం మాచవరం గ్రామానికి చెందిన శ్రీరాములు అనే రైతుకు గ్రామంలో ఎకరం కొబ్బరి తోట ఉంది. దీనిపై ఎలాంటి లోన్ తీసుకోలేదు.

    ఇటీవల శ్రీరాములు తన కుమార్తె పెళ్లి కోసం తోటపై లోన్ తీసుకునేందుకు బ్యాంకుకు వెళ్లాడు. ఐతే అక్కడ అధికారులు చెప్పిన మాటతో షాక్ తినడం అతని వంతైంది. ఆ భూమిపై అప్పటికే నరేంద్రపురం గ్రామానికి చెందిన కుడిపూడి శ్రీనివాస్ అనే వ్యక్తి కౌలు రైతు కార్డుతో లోన్ తీసుకున్నట్లు రికార్డుల్లో ఉంది. దాదాపు లక్ష రూపాయలు లోన్ తీసుకున్నట్లు ఉండటంతో శ్రీనివాసులుకు షాక్ తప్పలేదు. దీనిపై బ్యాంక్ అధికారులను సంప్రదించగా వారు కూడా పొంతనలేని సమాధానాలు చెప్పారు. విషయం బయకు పొక్కడంతో లోన్ తీసుకున్న వ్యక్తి ఈ లోన్ తిరిగి చెల్లించేశాడు.



    దీనిపై లోతుగా పరిశీలించగా అదే సర్వే నెంబర్లో బాధితుడి పిన్ని కొలిశెట్టి నాగ వెంకటలక్ష్మి పేరుతో మూడెకరాల కొబ్బరితోట ఉంది. ఆమెకు చెందిన భూమిపై 2019 జూలైలో వెంకటమాధవి అనే మహిళ పేరుతో రూ.లక్ష లోన్ మంజూరు చేశారు బ్యాంక్ అధికారులు. దీనిపై బ్యాంక్ మేనేజర్ ను సంప్రదించగా కౌలు కార్డుల ఆధారంగానే రుణాలు మంజూరు చేసినట్లు చెప్పారు.

    బ్యాంక్ అధికారుల హస్తముందా..?
    ఈ రుణాల వ్యవహారంపై భూ యజమానులు మండిపడుతున్నారు. తమ భూములను ఎవరికీ కౌలుకు ఇవ్వకుండానే రెవెన్యూ అధికారులు కౌలు కార్డులు ఎలా మంజూరు చేశారని ప్రశ్నిస్తున్నారు. ఐతే ఒక్కో కౌలు కార్డుకు ఎకరానికి రూ.35 వేలకు మించి లోన్ ఇచ్చే అవకాశం లేదు. అలాంటికి ఏకంగా లక్షలాది రూపాయాలు ఎలా మంజూరు చేశారన్నది అనుమానాస్పదంగా మారింది. ఈ స్కామ్ లో బ్యాంక్ అధికారుల పాత్ర కూడా ఉన్నట్లు తెలుస్తోంది. బ్యాంక్ అధికారుల హస్తం లేనిదే.. కౌలు కార్డులపై స్థాయిలో రుణాలివ్వడం సాధ్యం కాదంటున్నారు. ఈ వ్యవహారంలో వందలాది మంది రైతులు బాధితలుగా ఉన్నట్లు అనుమానిస్తున్నారు.
    Published by:Purna Chandra
    First published:January 03, 2021, 19:42 IST