HOME » NEWS » crime » BANK FIELD ASSISTANT TOOK LOAN FROM CUSTOMERS AND RESIGN TO JOB IN GUNTUR DISTRICT BA

కస్టమర్ల వద్ద అప్పులు చేసి, ఉద్యోగానికి రాజీనామా చేసిన బ్యాంక్ ఉద్యోగి

గుంటూరు జిల్లా మేడికొండూరు భారతీయ స్టేట్ బ్యాంకు శాఖలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు లోనికి వచ్చింది.

news18-telugu
Updated: November 27, 2020, 7:50 PM IST
కస్టమర్ల వద్ద అప్పులు చేసి, ఉద్యోగానికి రాజీనామా చేసిన బ్యాంక్ ఉద్యోగి
ప్రతీకాత్మకచిత్రం
  • Share this:
ఖాతాదారులతో పరిచయం పెంచుకుని వారి నుంచి ప్రైవేటుగాను, బ్యాంకుల్లోను లక్షల్లో అప్పులు చేసి తీర్చలేక చివరకు ఉద్యోగానికి రాజీనామా చేశాడు ఓ ఫీల్డు అసిస్టెంట్. గుంటూరు జిల్లా మేడికొండూరు భారతీయ స్టేట్ బ్యాంకు శాఖలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు లోనికి వచ్చింది. సరాల శ్రీనివాస్​ అనే ఓ వ్యక్తి జూలై 2018లో మేడికొండూరు స్టేట్ బ్యాంకులో ఫీల్డు అసిస్టెంట్​గా బాధ్యతలు చేపట్టాడు. క్రమంగా ఖాతాదారులతో పరిచయం ఏర్పడింది. దానిని అదునుగా చేసుకొని వ్యక్తి గతంగా అప్పులు చేయటం ఆరంభించారు. ఈ క్రమంలో అప్పు ఇచ్చిన వాళ్లు బ్యాంకుకు వచ్చి నిలదీసే వారు. దీంతో శ్రీనివాసు బ్యాంకుకు సక్రమంగా వెళ్లేవాడు కాదు. బాధితులు బ్యాంకు మేనేజరు దేవేంద్రనాధ్​కి ఫిర్యాదు చేయగా ఈ విషయాన్ని ఉన్నతాధికారులు దృషికి తీసుకెళ్లాడు. దీనిపై అధికారులు విచారణ చేశారు. శ్రీనివాస్​ మేడికొండూరుకు చెందిన వ్యక్తుల వద్ద రూ. 24 లక్షలు దాకా అప్పులు చేశాడని తెలిసింది. అంతకు ముందు పని చేసిన గుంటూరు బ్రాంచిలో హౌసింగ్ లోన్​ పేరిట రూ. 51 లక్షలు, మంగళగిరిలో ఎడ్యుకేషన్ లోన్​​ పేరుతో రూ.10 లక్షలు, ఆత్మకూరు బ్రాంచ్​లో రూ.10 లక్షలు, విజయవాడ కో- అపరేటివ్ బ్యాంకులో రూ. 4 లక్షలు అప్పు చేశాడని తెలుసుకున్నారు. అంతే కాకుండా తోటి ఉద్యోగుల దగ్గర కూడా రూ.10 లక్షలు అప్పు చేశాడని తెలిసి ఖంగుతిన్నారు.

దీనిపై అధికారులు నిలదీస్తే, అనారోగ్యం అని చెప్పి ఉద్యోగానికి రాజీనామా చేసాడు. దీంతో అప్పు ఇచ్చిన వారు లబోదిబోమని కోర్టు మెట్లు ఎక్కారు. ఉద్యోగ విరమణ అనంతరం రావలసిన డబ్బులు, బ్యాంకులో చేసిన అప్పులకు జమ చేయాలని కోర్టు ఆదేశాలిచ్చింది. ఫీల్డు అసిస్టెంట్ కి ఇప్పుటికి బ్యాంకు రుణాన్ని ఇచ్చారు. మరికొందరు అదనపు సొమ్ము కూడా చెల్లించగా... ఆ డబ్బు తిరిగి ఇచ్చేస్తామని బ్యాంకు మేనేజరు తెలిపారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: November 27, 2020, 7:38 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading