BANK EMPLOYEE COMMITS SUICIDE AFTER LOSING MONEY IN SHARE MARKET IN VIJAYANAGARAM DISTRICT BN
షేర్ మార్కెట్ ఢమాల్.. నష్టమొచ్చిందని బ్యాంకు ఉద్యోగి ఎంత పనిచేశాడంటే..
ప్రతీకాత్మక చిత్రం
‘షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టా. దాదాపు రూ.20 లక్షలు నష్టపోయా. ఇక నేను బతకలే’నంటూ తన తల్లికి లేక రాసి ఆత్మహత్య చేసుకున్నాడో బ్యాంకు ఉద్యోగి. ఈ ఘటన విజయనగరం జిల్లా బలిజిపేట మండల కేంద్రంలో జరిగింది.
‘షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టా. దాదాపు రూ.20 లక్షలు నష్టపోయా. ఇక నేను బతకలే’నంటూ తన తల్లికి లేక రాసి ఆత్మహత్య చేసుకున్నాడో బ్యాంకు ఉద్యోగి. ఈ ఘటన విజయనగరం జిల్లా బలిజిపేట మండల కేంద్రంలో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. అజయ్‌బాబు(27)ది ఉత్తరప్రదేశ్‌లోని ఆర్య జిల్లా స్వస్థలం. బలిజిపేటలో ఉంటూ స్థానిక బ్యాంకులో ఫీల్డ్ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. అయితే అజయ్‌బాబు ఓవైపు ఉద్యోగం చేస్తూనే.. మరోవైపు షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాడు. ఇటీవల కరోనా వైరస్ నేపథ్యంలో షేర్ మార్కెట్ భారీ ఒడిదుడుకులకు గురయ్యింది. ఈ క్రమంలోనే అజయ్‌బాబు తాను షేర్ మార్కెట్లో పెట్టిన దాదాపు రూ.20 లక్షలను నష్టపోయాడు. దీంతో మనస్తాపం చెందిన అతడు మంగళవారం రాత్రి తన రూమ్‌లో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అజయ్‌బాబు పర్సులో షేర్ మార్కెట్లో పెట్టిన డబ్బులు నష్టపోవడం వల్లే ఆత్మహత్యకు చేసుకుంటున్నానని తల్లికి రాసిన లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నామని ఎస్ఐ నరేష్ తెలిపారు.
Published by:Narsimha Badhini
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.