ఉద్యోగం చేసుకొని దర్జాగా బతకాల్సిన వాడు వ్యసనానికి అలవాటుపడి కటకటాలపాలయ్యాడు. ఆదిలాబాద్ (Adilabad)జిల్లాలో జరిగిన ఓ భారీ కుంభకోణం
Scam వెనుక ఓ వ్యక్తి అరెస్ట్ అయ్యాడు. బేల Bhelaమండల కేంద్రంలోని జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (Central Cooperative Bank)లో పనిచేస్తున్న ఉద్యోగి ఉద్యోగి శ్రీపతి కుమార్ (Sripathikumar)బ్యాంక్ మేనేజర్, సహాయ మేనేజర్‌లకు తెలియకుండా వారి పాస్ వర్డ్ లను ఉపయోగించి తప్పుడు రుణ ఖాతాల ద్వారా తన కుటుంబ సభ్యుల ఖాతాల్లోకి నగదును బదిలీ చేశాడు. . ఆన్ లైన్ బెట్టింగ్ (Online betting)కు అలవాటుపడిన శ్రీపతి కుమార్ చివరకు డబ్బుల కోసం తాను పనిచేస్తున్న బ్యాంకుకే కన్నం వేశాడు. బేల మండల కేంద్రంలోని జిల్లా కేంద్ర సహాకార బ్యాంకులో రెండు కోట్ల 85 లక్షల కుంభకోణం జరిగింది. శాఖాపరమైన ఆడిటింగ్‌లో ఈ కుంభకోణం భయటపడింది. దీంతో ఈ ఘటనపై విచారణ చేపట్టిన ఆ సంస్థ ఉన్నతాధికారులు పద కొండు మంది బ్యాంకు ఉద్యోగులపై సస్పెన్షన్ (Suspension)వేటు వేశారు. అయితే బ్యాంకు ఆ తర్వాత విడతల వారీగా కొందరు సహా ఉద్యోగుల ఖాతాల్లోకి కూడా నగదును బదిలీ చేసినట్లు తేలింది. ఇందులో ప్రధాన నిందితుడైన శ్రీపతి కుమార్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుండి 98 లక్షల 15 వేల 419 రూపాయలను రికవరీ చేశారు. నిందితుడు బదిలీ చేసిన ఇతరుల ఖాతాల్లోని 37 లక్షల 97 వేల 419 రూపాయలను ఫ్రీజ్ చేసి ఏడిసిసి బ్యాంకు ఖాతాకు బదిలీ చేసినట్లు తెలిపారు. నిందితుడు శ్రీపతి కుమార్ ఆన్ లైన్ బెట్టింగ్ లో సుమారు కోటి 40 లక్షల ఐదు వేల 106 రూపాయల నగదు పోగొట్టుకున్నాడని, 20 లక్షలు జల్సాలకు వాడుకున్నట్లుగా తేలింది. మరో నిందితుడు బండి రమేశ్ అనే బ్యాంకు ఉద్యోగి కూడా 26 లక్షల 60 వేల రూపాయలను జల్సాలకు వాడుకున్నట్లు అధికారులు తెలిపారు.
ఖజానాకే కన్నం వేసిన ఖిలాడీ..
బేల సహాకార బ్యాంకు అసిస్టెంట్ జనరల్ మేనేజర్ మండల కేంద్రంలోని పోలీసు స్టేషన్ చేసిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు కూడా దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్.పి ఉదయ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్ర సహాకార వ్యవస్థలోనే సంచలనం రేపిన ఈ ఘటనపై అధికార యంత్రాంగం నాబార్డుకు నివేదకలు అందజేసినట్లు సమాచారం. రానున్న రోజుల్లో ఈ కుంభకోణం విషయంలో ఎలాంటి నిర్ణయాలు వెలువడతాయో వేచిచూడాలి.
వ్యసనమే కొంప ముంచింది..
బాగా చదువుకున్న చాలా మంది ఉద్యోగాలు లేక అరకొర పనులు చేసుకుంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎందరో మంది నిరుద్యోగులు ఏళ్ళుగా ఎదురుచూస్తున్నారు. కొందరైతే ఎలాగైనా సరే ప్రభుత్వ ఉద్యోగం సాధించాలన్న పట్టుదలతో నిరంతరం శ్రమిస్తూనే ఉన్నారు. అలాంటి మంచి అవకాశం వస్తే సంతృప్తి చెంది ఉద్యోగం చేసుకోవాల్సిన వ్యక్తి వాటిని విస్మరించి తన వ్యసనం కోసం ఏకంగా ఉద్యోగమే పోగొట్టుకునే వరకు తెచ్చుకున్నాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.