తూర్పు గోదావరి జిల్లాలో కలకలం... ఈ చిన్నారిని కిడ్నాప్ చేసిందెవరు?

ఓ బ్యాంక్ ఉద్యోగి కొడుకును కిడ్నాప్ చెయ్యడంతో... డబ్బు కోసమే ఎత్తుకుపోయారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.

Krishna Kumar N | news18-telugu
Updated: July 24, 2019, 12:25 PM IST
తూర్పు గోదావరి జిల్లాలో కలకలం... ఈ చిన్నారిని కిడ్నాప్ చేసిందెవరు?
క్షేమంగా తల్లిదండ్రులను చేరిన జషిత్
  • Share this:
ప్రపంచం తెలియని చిన్నతనం. వయసు అంతాకలిపి నాలుగేళ్లే. ఆ చిట్టి తండ్రి జషిత్‌ని ఎత్తుకుపోయిందెవరు? ఎందుకు అన్నది మిస్టరీగా మారిపోయింది. తూర్పుగోదావరి జిల్లా మండపేటలోని... విజయలక్ష్మినగర్‌లో జరిగిందీ ఘటన. జులై 22న బ్యాంక్ ఉద్యోగి కొడుకైన ఈ చిన్నారి నాయనమ్మతో కలిసి వాకింగ్ చేసి ఇంటి మెట్లు ఎక్కుతుండగా జషిత్‌ని దుండగులు బైక్‌పై వచ్చి ఎత్తుకుపోయారు. సోమవారం సాయంత్రం స్థానిక యూనియన్ బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్ గా ఉద్యోగం నిర్వహిస్తున్న నూక వెంకటరమణ కుమారుడు జషిత్(4) ను నాయనమ్మ పార్వతి సమీపంలోని అపార్టుమెంట్ వద్దకు ఆదుకునేందుకు తీసుకుని వెళ్ళింది. అక్కడ నుండి తాము నివసిస్తున్న విజయలక్ష్మి నగర్ శశి స్కూల్ ప్రధాన రహదారి లోని శ్రీ సాయి ధరణి ప్లాజా కు చేరుకునేసరికి సినీఫక్కీలో ఓ ఆగంతకుడు ఆమెను కరెంటు ఉందా అంటూ ప్రశ్నించాడు. వెంటనే ఆమె పై పిడి గుద్దులు గుద్ది... గాయ పర్చాడు. వెంటనే బాలుడిని మోటర్ సైకిల్ పై ఎత్తుకెళ్లాడు. కొద్ది దూరం పరుగులు తీసిన పార్వతి పెద్దగా కేకలు వేయడంతో స్థానికులు గుమి గుడారు. విషయం తెలుసుకుని వెంటనే బైపాస్ రోడ్ లో వెళ్లారు. మోటార్ సైకిల్ వేగంగా ఆలమూరు రోడ్డు వైపుకు వెళ్లడాన్ని గమనించిన వారు వాహనాన్ని వెంబడించారు. అయితే టోల్ గేట్ వద్ద లారీ అడ్డురావడంతో క్షణాల్లో వారు మాయమయ్యారు.

సమాచారం అందుకున్న టౌన్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. దీంతో పోలీసులు ఎలర్ట్ అయ్యారు. ప్రతి చోటా జల్లెడ పట్టారు. ఒక్క ప్రాంతాన్ని కూడా వదలకుండా సోదాలు నిర్వహిస్తున్నారు. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లకు సమాచారం ఇచ్చారు. దీంతో బాలుడి ఆచూకీ కనుగొనేందుకు రామచంద్రపురం డిఎస్పీ జెవి సంతోష్ నేతృత్వంలో రూరల్ సిఐ మంగాదేవి, టౌన్,రూరల్ ఎస్ ఐ లు రాజేష్ కుమార్, దొరరాజులు  రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. బాలుడి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. వారి నుంచి వివరాలు రాబట్టల్సిఉంది. ఎవరైనా తెలిసిన వారే కిడ్నాప్ చేసి ఉంటారని భావిస్తున్నారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. భాదితుల నుండి పోలీసులు వివరాలు సేకరించారు.

చిన్నారిని కిడ్నాప్ చేసిందెవరు?


పోలీసులు అక్కడి సీసీ కెమెరాల్లో ఇద్దరు కిడ్నాపర్లను గుర్తించారు. ఐతే... వాళ్లు ముఖాలకు కర్చీఫ్ కట్టుకోవడంతో... ఎవరు ఎత్తుకెళ్లారో, ఎందుకు పట్టుకుపోయారో తెలియట్లేదు. కన్నీటి సంద్రమైన ఆ చిన్నారి తల్లిదండ్రులు... దయచేసి తమ పిల్లాణ్ని వెనక్కి తెచ్చి ఇవ్వాలని వేడుకుంటున్నారు. ఎవరికైనా చిట్టితండ్రి ఆచూకీ తెలిస్తే చెప్పాలంటూ... సోషల్ మీడియాలో పిల్లాడి ఫొటోతోపాటూ... ఇతర వివరాలు షేర్ చేస్తున్నారు. ఈ నెల 3న పిల్లాణ్ని కిడ్నాప్ చేయాలని ప్రయత్నించి విఫలమయ్యారు కిడ్నాపర్లు. ఇప్పుడు చిన్నారి మాయమై రెండ్రోజులైనా ఏ జాడా తెలియట్లేదు. ఆల్రెడీ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు.

చిన్నారిని కిడ్నాప్ చేసిందెవరు?


శ్రీకాకుళం నుండి వచ్చి: ప్రశాంతత కు పెట్టింది పేరు మండపేట. ఇక్కడ నివసిస్తున్న వారు ఈ పట్టణాన్ని వదిలి వెళ్ళేందుకు ఇష్టపడరు. అలాంటి పట్టణంలో కిడ్నాప్ కలవరపాటుకు గురిచేసింది. శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చిన భార్య భర్త లు చెరో బ్యాంక్ లో ఉద్యోగాలు చేస్తూ ఆనందంగా జీవిస్తున్న తరుణంలో ఇలాంటి సంఘటన చోటు చేసుకుంది. నూక వెంకట రమణ ది శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస మండలం కనుగులవలస స్వస్థలం. ఉద్యోగం లో స్థిరపడ్డ అనంతరం శ్రీకాకుళం పట్టణంలో ఇల్లు నిర్మించుకున్నరు. ఆరు నెలలు క్రితం మండపేట యూనియన్ బ్యాంకు లో అసిస్టెంట్ మేనేజర్ గా వచ్చారు. ఈయన భార్య బెండీ నాగావళి కూడా స్థానిక కెనరా బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్ గా విధులు నిర్వహిస్తున్నారు. వీరికి నాలుగేళ్ళ జషిత్ వున్నాడు. కాగా ఆమె ఇప్పుడు నిండు గర్భిణీ. ఆనందంగా సాగిపోతున్న వీరి జీవితంలో కిడ్నాప్ కన్నీళ్లు తెప్పిస్తోంది. ముద్దులు ఒలికించే జషిత్ అంటే అక్కడి అపార్టుమెంట్లో వారందరికీ ఎంతో ఇష్టం.అలాంటి చిన్నారి కిడ్నాప్ కావడంతో వారంతా ఆందోళనకు గురయ్యారు. ఇరువురి బ్యాంకు సహా ఉద్యోగులు అక్కడికి చేరుకుని వారిని ఓదార్చారు. తమ కుమారుడు ఆచూకీ కోసం ఆ తల్లి తల్లడిల్లడం చూపరులను సైతం కంట కన్నీరు రప్పించింది. బాలుడి ఆచూకీ తెలిస్తే సమాచారం ఇవ్వాలని డీఎస్పి కోరారు.
Published by: Krishna Kumar N
First published: July 24, 2019, 12:00 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading