కొట్టుకొచ్చిన బంగారాన్ని కొట్టేసిన కేసును చేధించిన పోలీసులు..

హైదరాబాద్ లో నగల దుకాణానికి చెందిన ఒక వ్యక్తి తన బైక్ మీద నగలు తీసుకెళ్తుండగా భారీ వర్షం కురవడంతో అవి కాస్తా వరదలో కొట్టుకుపోతున్నాయి. ఇది గమనించిన ఆ వ్యక్తి.. దానిని పట్టుకోవడానికి ప్రయత్నించాడు. బ్యాగ్ దొరికింది. కానీ అందులో బంగారం లేదు.

news18
Updated: October 23, 2020, 8:37 AM IST
కొట్టుకొచ్చిన బంగారాన్ని కొట్టేసిన కేసును చేధించిన పోలీసులు..
ప్రతీకాత్మక చిత్రం
  • News18
  • Last Updated: October 23, 2020, 8:37 AM IST
  • Share this:
హైదరాబాద్ లో ఈ నెల 9న బంజారాహిల్స్ లో జరిగిన బంగారు ఆభరణాల చోరీ కేసును పోలీసులు చేధించారు. ప్రమాదవశాత్తు వరదలో కొట్టుకుపోతున్న బంగారాన్ని కొట్టేసిన మోసగాళ్లను పోలీసులు గుర్తించారు. నలుగురు నిందితులను బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. వారి దగ్గర్నుంచి ఒక్కటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 143 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ గురువారం మీడియాకు వెల్లడించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు నిరంజన్ తో పాటు మరో నలుగురిని కూడా అదుపులోకి తసీుకున్నట్టు ఆయన వెల్లడించారు.

చోరీకి సంబంధించిన వివరాలిలా.. ఈనెల 9న బషీర్ బాగ్ లో ఉన్న వీఎస్ జ్యువెల్లర్స్ కు నగలు కొనడానికి ఒక కస్టమర్ వచ్చింది. ఆమె అడిగిన నగలు అక్కడ లేకపోవడంతో.. ఆ షాపునకు జుబ్లీహిల్స్ లో తెలిసిన కృష్ణా పెరల్స్ నగల షాపు యజమానికి ఫోన్ చేశాడు. దీంతో కృష్ణా పెరల్స్ షాప్ ఓనర్ ప్రదీప్ అనే సేల్స్ మెన్ తో ఆభరణాలను పంపించాడు. కాగా, వాటిని తిరిగి తీసుకెళ్తున్న సమయంలో.. హఠాత్తుగా వర్షం పడింది. స్కూటీపై నగల బ్యాగును తీసుకెళ్తున్న ప్రదీప్ వరద ప్రవాహాన్ని తట్టుకోలేదు. దీంతో ఆ బ్యాగ్ కింద పడి వరద నీటిలో కొట్టుకుపోయింది. ఖాళీ బ్యాగుతో వెళ్లితే షాప్ ఓనర్ తననేమైనా అంటాడేమోనని భావించిన ప్రదీప్.. బ్యాగ్ కోసం వెతకడం ఆరంభించాడు.

వెతుకుతూ వెతుకుతూ.. సుమారు 3 కిలోమీటర్ల దాకా వరద ప్రవాహంలోనే బ్యాగు కోసం చూశాడు. అక్కడ ఉన్న గుడిసెల్లో నిరంజన్ కు బ్యాగు దొరికింది. ఇదే అదునుగా భావించిన నిరంజన్.. తన పంట పండింది అనుకున్నాడు. నగలు తీసుకుని.. బ్యాగును అక్కడే వదిలేసి అక్కడ్నుంచి నాగర్ కర్నూల్ కు ఉడాయించాడు. ప్రదీప్ వెతుకుతూ ఉండగా బ్యాగ్ కనిపించింది గానీ అందులో బంగారం లేదు.

అయితే సదరు షాప్ యజమాని ముందు ప్రదీప్ నే అనుమానించినా.. తర్వాత విషయం తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీసీటీవీ ఫుటేజీలు, సెల్ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా పోలీసులు నిందితులను పట్టుకుని అరెస్టు చేశారు. వారి దగ్గర్నుంచి నగలను స్వాధీనం చేసుకున్నారు.
Published by: Srinivas Munigala
First published: October 23, 2020, 8:36 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading