హోమ్ /వార్తలు /క్రైమ్ /

Woman Arrested : 15 ఏళ్ల క్రితం సరిహద్దు దాటి..హిందువుగా వేషం మార్చిన ముస్లిం యువతి

Woman Arrested : 15 ఏళ్ల క్రితం సరిహద్దు దాటి..హిందువుగా వేషం మార్చిన ముస్లిం యువతి

పాయల్ ఘోష్ ​గా పేరు మార్చుకున్న రోనీ బేగం

పాయల్ ఘోష్ ​గా పేరు మార్చుకున్న రోనీ బేగం

MuslimWoman As Hindu : భారత్ లోకి అక్రమంగా ప్రవేశించిన సమయంలో రోనీ బేగం వయస్సు 12ఏళ్లు. భారత్ లోకి వచ్చిన తర్వాత రోనీ బేగమ్ నుంచి పాయల్ ఘోష్​గా పేరు మార్చుకుంది. బార్లలో, పబ్​ల్లో డ్యాన్సర్​గా జీవనం ప్రారంభించింది.

Bangladeshi Woman Arrested : ఒకటి కాదు రెండుకాదు ఏకంగా 15 ఏళ్ల నుంచి హిందువుగా అందరినీ నమ్మించి అక్రమంగా భారత్ లో ఉంటున్న బంగ్లాదేశ్ యువతి ఆటకట్టించారు పోలీసులు. మూడు నెలల పాటు వెతికిన పోలీసులు ఈమె ఆచూకిని కనిపెట్టి అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన బెంగళూరు నగరంలో చోటు చేసుకుంది.

బెంగళూరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బంగ్లాదేశ్ కు చెందిన రోనీ బేగం(27)15ఏళ్ల క్రితం బోర్డర్ దాటి​ భారత్ లోకి అక్రమంగా ప్రవేశించింది. భారత్ లోకి అక్రమంగా ప్రవేశించిన సమయంలో రోనీ బేగం వయస్సు 12ఏళ్లు. భారత్ లోకి వచ్చిన తర్వాత రోనీ బేగమ్ నుంచి పాయల్ ఘోష్​గా పేరు మార్చుకుంది. బార్లలో, పబ్​ల్లో డ్యాన్సర్​గా జీవనం ప్రారంభించింది. తాను వెస్ట్ బెంగాల్ కు చెందిన హిందూ యువతిగా పరిచయం చేసుకొనేది. ముంబైలోని ఓ డ్యాన్స్ బార్‌ లో డ్యాన్సర్‌ గా పనిచేసే సమయంలో మంగళూరుకు చెందిన డెలివరీ ఎగ్జిక్యూటివ్ నితిన్ కుమార్‌ తో ప్రేమ‌లో ప‌డింది. కొంత కాలం త‌రువాత ఆయ‌న‌ను పెళ్లి చేసుకుంది. ఈ జంట పెళ్లి తర్వాత 2019లో బెంగళూరులోని అంజననగర్‌ లో స్థిరపడ్డారు. ఈ బంగ్లాదేశ్ యువతి బెంగళూరులో టైలర్‌గా పనిచేసేది. ముంబైలో ఉన్న సమయంలోనే ఈ జంట పాన్ కార్డును పొందారు. నితిన్ బెంగళూరులోని త‌న స్నేహితుడి సహాయంతో ఈ యువతికి ఆధార్ కార్డును ఇప్పించారు.

ALSO READ Toyota Heading To Moon : చంద్రుడిపైకి టయోటా కారు..ఎందుకో తెలుసా

అయితే కొంత కాలం క్రితం రోనీ బేగం తండ్రి చనిపోయారు. దీంతో ఆమె తండ్రి అంత్య‌క్రియల కోసం బంగ్లాదేశ్ కు వెళ్లాల‌ని భావించారు. అయితే ముందుగా కోల్‌కతా వెళ్లి అక్కడి నుంచి ఢాకా వెళ్లాలనేది ఆమె ప్లాన్. కోల్​కతా వెళ్లింది. అయితే ఇమ్మిగ్రేషన్ డిపార్టెమెంట్​ కు అందించిన ధ్రువపత్రాలపై అధికారులకు అనుమానం వచ్చింది. విచారణ అనంతరం.. రోనీ అక్రమంగా భారత్​లోకి వచ్చినట్లు తేలింది. అప్పటికే రోనీ బెంగళూరు చేరుకోగా.. ఆమె గురించి ఫారినర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్(FRRO)అధికారులు బెంగళూరు పోలీస్ కమిషనర్​ కు సమాచారం ఇచ్చారు. దీంతో బ్యాదరహళ్లి స్టేషన్ పోలీసులు కేసు నమోదు చేశారు. మూడు నెలలు గాలించి ఆమె ఆచూకీ కనిపెట్టి గురువారం ఆమెను అరెస్ట్ చేశారు. రోనీకి పాన్​ కార్డు, ఆధార్ కార్డు, ఓటర్ కార్డు లభించేందుకు సాయపడిన వారి కోసం గాలిస్తున్నామని బెంగళూరు వెస్ట్ డీసీపీ సంజీవ్ పాటిల్ తెలిపారు. అయితే రోనీ భర్త నితిన్​ కుమార్ కూడా పరారీలో ఉన్నాడని తెలిపారు.

First published:

Tags: Arrested, Bangladesh, Bengaluru, WOMAN

ఉత్తమ కథలు