హోమ్ /వార్తలు /క్రైమ్ /

మాజీ ప్రియుడితో కలిసున్న ఫోటోలను మార్ఫింగ్ చేసి... కోటిన్నర వసూలు చేసిన ప్రస్తుత ప్రేయసి..

మాజీ ప్రియుడితో కలిసున్న ఫోటోలను మార్ఫింగ్ చేసి... కోటిన్నర వసూలు చేసిన ప్రస్తుత ప్రేయసి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఎనిమిదేండ్ల క్రితం ఇద్దరూ ప్రేమించుకున్నారు. తర్వాత విడిపోయారు. ఆమెకు పెళ్లైంది. ఒక పాప. ఇంతలో వాళ్లు మళ్లీ కలిశారు. పరిచయాలు, బంధాలు పెరిగాయ్. వాటితో పాటు మోసం కూడా అక్కడే పురుడు పోసుకుంది.

 • News18
 • Last Updated :

  ఒక పదేండ్లు వెనక్కి వెళ్తే.. ఎనిమిదేండ్ల క్రితం ఒక యువతీ యువకుడు ప్రేమించుకున్నారు. వారు పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ ఎందుకో కుదరలేదు. ఇంతలో ఆ యువతికి వేరే వ్యక్తితో పెళ్లైంది. వారికి ఒక పాప. భార్యాభర్తలు హాయిగా కాపురం చేసుకుంటున్నారు. ఇంతలో.. మాజీ ప్రేమికుడి నుంచి ఫోన్.. మళ్లీ కలిశారు. ఈ మహిళకు పెళ్లై..పాప పుట్టినా.. మన దేవదాసు మాత్రం ఇంకా పెళ్లి చేసుకోలేదు. ఇద్దరి మధ్య తెగిన బంధాన్ని వాట్సాప్ మళ్లీ కలిపింది. కానీ మన అభినవ దేవదాసు మరో పార్వతిని ప్రేమించాడండోయ్...! ఆమెను పాత పార్వతికి పరిచయం చేశాడు. అక్కడే మొదలైంది మోసం.. అసలేంటిది.. అనుకుంటున్నారా..? అయితే ఈ వార్త చదవాల్సిందే.

  బెంగళూరుకు చెందిన షాలిని (పేరు మార్చాం) గతంలో మహేశ్ అనే వ్యక్తిని ప్రేమించింది. వాళ్లిద్దరూ పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. కానీ అద కుదరలేదు. ఇంతలో షాలినికి బెంగళూరు కు చెందిన ఒక వ్యాపారవేత్తతో వివాహమైంది. వాళ్లిద్దరికి ఆరేళ్ల పాప కూడా ఉంది. కాపురం హాయిగా సాగుతుంది. ఇంతలో గతేడాది జులైలో మహేశ్ నుంచి షాలినికి ఒక మెసేజ్ వచ్చింది. ఎలా ఉన్నావ్..? ఏం చేస్తున్నావ్..? అనే కుశల ప్రశ్నల నుంచి.. కుటుంబ వ్యవహారాల దాకా వెళ్లింది. వాట్సాప్ పుణ్యమా అని వారు మళ్లీ బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యారు. షాలిని పెళ్లి చేసుకున్నా.. మహేశ్ మాత్రం ఇంకా విరహా వేదనను అనుభవిస్తున్నాడు. షాలినిని మరిచిపోవడానికంటూ.. ఆయనకు మరో అమ్మాయి పరిచయమైంది. ఆమె పేరు అనూశ్రీ (పేరు మార్చాం). అనూశ్రీని షాలినికి పరిచయం చేశాడు. ముగ్గురూ చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యారు.

  ఈ క్రమంలో అనూశ్రీ... షాలినిని అప్పుడప్పుడు తన వ్యక్తిగత విషయాలు కూడా అడిగేది. మహేశ్ తో గతంలో ఏమైనా ఫోటోలుంటే పంపించాలని కోరేది. దాంతో అనూశ్రీని నమ్మిన షాలిని.. ఇద్దరు కలిసి దిగిన ఫోటోలను పంపించింది. ఇక్కడే అనూశ్రీ ఆట మొదలెట్టింది. ఆ ఫోటోలను మార్ఫింగ్ చేసి... అసభ్యకరంగా తయారుచేసింది. తనకు డబ్బులివ్వాలంటూ బెదిరించడం మొదలుపెట్టింది. డబ్బులివ్వకుంటే ఈ ఫోటోలను సోషల్ మీడియాలో పెడతానని బెదిరించేది. దీంతో ఈ ఏడాది కాలంలో.. షాలిని దగ్గర అనూశ్రీ ఏకంగా రూ. 1.3 కోట్ల నగదు వసూలు చేసింది. కానీ అనూశ్రీ మాత్రం పదేపదే డబ్బులు కావాలని వేధించేది.

  ఇక భరించలేని షాలిని.. ఈ విషయాన్ని ఆయన భర్తతో చెప్పుకుంది. విషయం మొత్తం అర్థమైన షాలిని భర్త.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు.. అనూశ్రీ తో పాటు మహేశ్ ను కూడా అదుపులోకి తీసుకున్నారు. వారిద్దరినీ విచారిస్తున్నారు. అనూశ్రీ స్వయంగా ఈ పనికి పూనుకుందా..? లేక మహేశ్ హస్తం కూడా ఈ కుట్రలో ఉందా..? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

  Published by:Srinivas Munigala
  First published:

  Tags: Bangalore, Crime, Crime news, Fraud, Karnataka, Love, Love cheating

  ఉత్తమ కథలు