Krishna Kumar NKrishna Kumar N
|
news18-telugu
Updated: June 16, 2019, 1:06 PM IST
ప్రతీకాత్మక చిత్రం
బెంగళూరులో జరిగిందీ ఘటన. 26 ఏళ్ల ఇమాన్యూయెల్ సింగ్... కుందలహళ్లిలో ఉంటున్నాడు. ఓ ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. రెండేళ్లుగా అక్కడి ఓ అపార్ట్మెంట్లోని ఫ్లాట్‌లో నివసిస్తున్నాడు. ఓ రోజు ఓ కుర్రాడు ఆ ఫ్లాట్‌కి వచ్చాడు. తాను ఆంధ్రప్రదేశ్ నుంచీ వచ్చాననీ, తన పేరు విజయ్ అనీ చెప్పాడు. ఫ్లాట్ ఓనర్‌ను రూం అడగ్గా... ఈ ఫ్లాట్‌లో ముగ్గురు ఉండేందుకు వీలవుతుందనీ, ఈ ఫ్లాట్‌లో రూం షేర్ చేసుకోమని చెప్పారని అన్నాడు. బ్యాగుతో వచ్చిన అతన్ని చూసి ఇమాన్యూయెల్ నిజమే అనుకున్నాడు. తన ఫ్లాట్‌ను షేర్ చేసుకుంటే, తనకూ అద్దె తగ్గుతుంది కదా అనుకున్నాడు. ఒకటే బ్యాగ్‌తో వచ్చావేంటి అని అడిగితే... త్వరలో తన అన్నయ్య మిగతా సామాన్లతో వస్తాడనీ, ఏడాది పాటూ తాను బెంగళూరులో ఉంటానని విజయ్ చెప్పాడు. సరే అంటూ ఇమాన్యూయెల్... ల్యాప్‌టాప్‌లో తన వర్క్ కంటిన్యూ చేశాడు.
రాత్రి 9 గంటలకే నిద్రలోకి జారుకున్నాడు విజయ్. ఇమాన్యూయెల్ మాత్రం రాత్రి 2.30 వరకూ వర్క్ చేసుకొని... అప్పుడు నిద్రపోయాడు. తెల్లారి 8 గంటలకు నిద్రలేచాడు. చూస్తే విజయ్ లేడు. ల్యాప్‌టాప్, మొబైల్, రిస్ట్ వాచ్, వాలెట్, ల్యాప్‌టాప్ బ్యాగ్ ఏపీ లేవు. విషయం మీకు అర్థమైందిగా... ఆ విజయ్ అనేవాడు... మొత్తం ఊడ్చేశాడన్నమాట. అపార్ట్మెంట్ సీసీటీవీ ఫుటేజ్ చెక్ చెయ్యగా... విజయ్ ఉదయమే లేచి, వస్తువుల్ని పట్టుకుపోయినట్లు తెలిసింది.
పక్క ఫ్లాట్‌లో వ్యక్తి నుంచీ మొబైల్ తీసుకున్న ఇమాన్యూయెల్... తన మొబైల్‌కి కాల్ చేశాడు. ఆ మొబైల్‌ను ఎత్తుకెళ్లిన ఇమాన్యూయెల్... కాల్ రిసీవ్ చేసుకున్నాడు. ఎత్తుకెళ్లిన వస్తువులు తిరిగి కావాలంటే... రూ.20 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. వెంటనే పోలీస్ స్టేషన్‌కి వెళ్లిన ఇమాన్యూయెల్ కంప్లైంట్ ఇచ్చాడు. తన మొబైల్ సిమ్ కార్డును ట్రాక్ చెయ్యమని పోలీసుల్ని కోరాడు. బట్ వాళ్లు వెంటనే స్పందించలేదు. ఆలస్యమైంది. అప్పటికే విజయ్... ఆ మొబైల్‌ను స్విచ్ఛాఫ్ చేశాడు. అతను ఎత్తుకెళ్లిన వస్తువుల రేటు రూ.లక్షా 20 వేల దాకా ఉంటుంది. అంతేకాదు... ఆ దొంగ... ఇమాన్యూయెల్ క్రెడిట్ కార్డును వాడి... రూ.2వేలు విత్ డ్రా చేశాడు. వెంటనే ఇమాన్యూయెల్ బ్యాంకుకి వెళ్లి... ఆ కార్డును బ్లాక్ చేయించాడు.
ఐడీ కార్డ్ చెక్ చెయ్యకుండా... ఎవడు బడితే వాడికి రూం ఎలా ఇచ్చారంటూ... అపార్ట్మెంట్ ఓనర్ ఎంపీ రెడ్డిపై కూడా కంప్లైంట్ ఇచ్చాడు ఇమాన్యూయెల్. పోలీసులు మాత్రం FIRలో ఓనర్ పేరును రాయలేదు. ఇటీవల ఇలాంటి చోరీలు ఎక్కువవుతున్నాయనీ, ఇళ్లు అద్దెకు ఇచ్చేవాళ్లు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
Miss India 2019 : సెకండ్ రన్నరప్‌గా తెలంగాణ యువతి సంజనా విజ్...
సారా టెండుల్కర్‌కి షబ్మాన్ గిల్ "హార్ట్" మెసేజ్... హార్ధిక్ పాండ్యా ఏమన్నాడో తెలుసా...4 నెలల కిందట పెళ్లి... అంతలోనే ఆత్మహత్య... సంతోష్, అర్చన విషయంలో ఏమైంది...
జమ్మూకాశ్మీర్‌లో హైఅలర్ట్... ఉగ్రదాడులు జరగొచ్చన్న పాకిస్థాన్...
Miss India 2019 : ఫెమినా మిస్ ఇండియా విజేతగా నిలిచిన సుమన్ రావు
Published by:
Krishna Kumar N
First published:
June 16, 2019, 1:06 PM IST