యూట్యూబ్ లో వెతికి మరీ సాఫ్ట్ వేర్ ఉద్యోగి దారుణం.. ఈ యాంత్రిక జీవితాన్ని గడపలేకపోతున్నా.. గుడ్ బై.. అంటూ..

Jeevan Ambate (ఫేస్ బుక్ ఫొటో)

‘జీవితంలో ఎన్నో సాధించాలనుకున్నాను. కానీ ఏమీ సాధించలేకపోయాను. ఎన్నో కలలు కన్నాను. అవన్నీ కలలుగానే మిగిలిపోయాయి. ఈ యాంత్రిక జీవితాన్ని నేను గడపలేకపోతున్నా. జీవితంపై విరక్తి పుట్టింది. నా చావుకు ఎవరూ కారణం కాదు.. గుడ్ బై..‘ అంటూ

 • Share this:
  ఉదయాన్నే లేవడం. చకాచకా రెడీ అవడం. కాస్త టిఫిన్ తిని క్యారేజ్ కట్టుకుని ఆఫీసుకు బయలుదేరడం. తొమ్మిది గంటల పాటు కంప్యూటర్ స్క్రీన్ ముందు కూర్చుని కోడింగ్ తో కుస్తీలు పడటం. ఆఫీసు టార్గెట్లు. ప్రాజెక్ట్ టాస్కులు, బాస్ అక్షింతలతో రాత్రి పూట ఇంటికి తిరిగి రావడం. శారీరకంగా ఫ్రెషప్ అయి మానసికంగా మాత్రం ఆలోచనలతో సతమతమవుతూ కాసింత కూడు తిని నిద్రపోవడం. మళ్లీ ఉదయాన్నే లేచి యాంత్రికంగా జీవనాన్ని స్టార్ట్ చేయడం. ఇదీ ప్రస్తుతం సగటు ఉద్యోగ జీవి.. అందులోనూ సాప్ట్ వేర్ ఉద్యోగుల పాట్లు. ఈ యాంత్రిక జీవితాన్ని గడపలేక కొందరు జాబ్స్ ను వదిలేసి సొంతూళ్లకు వెళ్లి వ్యాపారాలు చేస్తున్నారు. ఎన్నో అద్భుతాలను సృష్టిస్తున్నారు. మరికొందరు మాత్రం మానసికంగా కుంగిపోయి ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. అలాంటి ఘటనే ఒకటి బెంగళూరులో జరిగింది.

  ‘జీవితంలో ఎన్నో సాధించాలనుకున్నాను. కానీ ఏమీ సాధించలేకపోయాను. ఎన్నో కలలు కన్నాను. అవన్నీ కలలుగానే మిగిలిపోయాయి. ఇప్పటి వరకు ఏమీ సాధించలేదు. ఇకపైన కూడా ఏమీ సాధించలేనేమో. ఈ యాంత్రిక జీవితాన్ని నేను గడపలేకపోతున్నా. జీవితంపై విరక్తి పుట్టింది. నా చావుకు ఎవరూ కారణం కాదు.. గుడ్ బై..‘ అంటూ ఓ యువకుడు సూసైడ్ లెటర్ రాసి మరీ ఆత్మహత్య చేసుకున్నాడు. కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ కు చెందిన 33 ఏళ్ల జీవన్ అంబటే బెంగళూరులోని మహదేవపురా లక్ష్మీనగర్ లే అవుట్ లో నివాసం ఉంటున్నాడు. మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి అమెజాన్ కంపెనీలో టీం లీడర్ గా పనిచేస్తున్నాడు.
  ఇది కూడా చదవండి: రాజీవ్‌తో ప్రేమ పెళ్లికి ఒకే ఒక్క కండీషన్ పెట్టిన దేవదాస్ కనకాల.. నేరుగా సుమ ఫోన్ చేసి చెప్తే..

  కొద్ది రోజులుగా తన వ్యక్తిగత జీవితం విషయంలో మనోవేధనకు గురవుతున్నాడు. జీవితంలో ఏమీ సాధించలేకపోయానంటూ ఆవేదన చెందాడు. ఈ క్రమంలోనే ‘ఎలా మరణించాలి‘ అని యూట్యూబ్ లో వెతికాడు. అందులో వచ్చిన సమాచారం మేరకు ‘కార్బన్ మోనాక్సైడ్ గ్యాస్’ను ఎంచుకున్నాడు. ఆన్ లైన్ లో కార్బన్ మోనాక్సైడ్ గ్యాస్ ను ఆర్డర్ ఇచ్చాడు. ప్రయోగాలు చేయాలన్న కారణం చెప్పి మరీ వాటిని తెప్పించుకున్నాడు. ఆ తర్వాత ముఖాన్ని ఓ ప్లాస్టిక్ సంచీతో చుట్టుకున్నాడు. అందులోకి ఓ పైపును పెట్టుకున్నాడు. దాని ద్వారా కార్బన్ మోనాక్సైడ్ గ్యాస్ ను పీల్చి ఆత్మహత్య చేసుకున్నాడు.


  ఇది కూడా చదవండి: శోభన్ బాబు చనిపోయిన రోజు అసలేం జరిగింది..? తండ్రితో మాట్లాడి కొడుకు బయటకు వెళ్లగానే..

  మూడు రోజులుగా జీవన్ ఆఫీసుకు రాకపోవడంతో అతడి స్నేహితులు జీవన్ ఉండే ఫ్లాట్ కు వచ్చారు. ఆ ఫ్లాట్ డోర్ కు ఓ నోటీసు అంటించి ఉంది. ‘తలుపులు తీసిన వెంటనే లైట్లు వేయకండి. కిటికీలు తెరవండి. గ్యాస్ ను ఆపేయండి. లేకుంటే మీ ప్రాణాలకే ప్రమాదం’ అని రాసి తలుపులకు అంటించాడు. దీంతో వెంటనే తలుపులు తీసి చూసిన స్నేహితులకు గదిలో నిర్జీవంగా కనిపించాడు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
  Published by:Hasaan Kandula
  First published: