కాలేజీలోని అమ్మాయిల రెస్ట్‌రూంలో రహస్య కెమెరా (hidden camera) పెట్టిన ఓ విద్యార్థిని పోలీసులు అరెస్టు చేశారు. అతని మొబైల్లో 1200కి పైగా ప్రైవేట్ ఫొటోలున్నాయి. అలాగే 2000కు పైగా వీడియోలున్నాయి. వాటిలో కొన్ని ఫొటోల్లో ఫ్రెండ్స్ శారీరకంగా కలిసి ఉన్న దృశ్యాలున్నాయి. ఈ వార్త స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఇంతకీ ఈ ఘటన.. బెంగళూరు (Bengaluru)లోని.. హోసకరహళ్లిలో జరిగింది.
ఓ ప్రైవేట్ కాలేజీలో BBA చదువుతున్న సుభమ్ ఎం ఆజాద్.. కొంతకాలంగా.. అనుమానాస్పదంగా ప్రవర్తిస్తున్నాడు. అతని ప్రవర్తన క్లాసులో ఇతర విద్యార్థులకు ఆశ్చర్యం కలిగించేది. మిగతా విద్యార్థులకు దూరంగా ఉండటం, ఎవరైనా అతనితో మాట్లాడితే చిరాకుపడడం.. ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ ఉండటం వంటివి చేసేవాడు. తాజాగా అతను అమ్మాయిల రెస్ట్ రూమ్ వైపు వెళ్లాడు. అది గమనించిన ఓ అమ్మాయి.. అటు ఎందుకు వెళ్తున్నాడు? అని సీక్రెట్‌గా ఫాలో అయ్యింది. అమ్మాయిల రెస్ట్ రూంలోకి వెళ్లి.. రెండు నిమిషాల తర్వాత నక్కి నక్కి బయటకు వస్తుండగా.. అప్పటికే ఇతర అమ్మాయిలను పోగేసిన ఆమ్మాయి.. అక్కడే నిలదీసింది.
ఏం లేదనీ, అర్జెంట్ అవ్వడంతో లోపలికి వెళ్లానని చెప్పాడు. అర్జెంట్ అయితే.. జంట్స్ వాష్ రూమ్ ఉంది కదా అంటూ నిలదీసిన అమ్మాయిలు.. లోపలికి వెళ్లి.. అంతా పరిశీంచారు. ఓ చోట రహస్య కెమెరాను గుర్తించారు. దాంతో ఆజాద్ కన్నింగ్ ప్లాన్ బయటపడింది.
అక్కడికి వచ్చిన పోలీసులతో.. ఆజాద్ వాదనకు దిగాడు. తనకేమీ తెలియదని బుకాయించాడు. కానీ పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించి.. పక్కా ఆధారాలతో ఆజాద్‌ని అరెస్ట్ చేశారు. అతని మొబైల్‌ని స్వాధీనం చేసుకున్నారు.
ఈ కేసులో మరో ట్విస్ట్ కూడా ఉంది. ఆజాద్ దగ్గరున్నది అసలు మొబైల్ కాదు. అతను ఇంకో మొబైల్ కూడా వాడుతున్నాడు. అది ఎక్కడుందని అడిగితే.. లేదనీ, ఒకటే వాడుతున్నానని బుకాయిస్తున్నాడు. దీనిపై లోతుగా దర్యాప్తు చేసి.. రెండో మొబైల్ కూడా స్వాధీనం చేసుకుంటామని పోలీసులు తెలిపారు.
Ghost Patient : ఆస్పత్రిలో దెయ్యం పేషెంట్ .. భయపెడుతున్న వీడియో వైరల్
చక్కగా చదువుకోవాల్సిన వయసులో కొందరు ఇలా చేస్తున్నారు. తమ కెరీర్ పాడుచేసుకోవడమే కాకుండా.. ఇతరుల జీవితాలతో ఆడుకుంటున్నారు. మన కాలేజీయే కదా అని లైట్ తీసుకోవద్దు. ప్రతీ కాలేజీలో మంచి విద్యార్థులు ఉన్నట్లే.. కంత్రీలూ ఉంటారు. అప్రమత్తంగా ఉండటం ద్వారా.. సమస్యల్లో చిక్కుకోకుండా బయటపడొచ్చు. ఆ అమ్మాయి ఎంతో మంది అమ్మాయిలను సేవ్ చేసింది అనుకోవచ్చు. అందరూ అలా ధైర్యం ప్రదర్శిస్తే.. ఇలాంటి కొండెగాళ్లకు చెక్ పెట్టవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bangalore, Crime, National News