• HOME
  • »
  • NEWS
  • »
  • CRIME
  • »
  • BANGALORE LOVERS COMMITS SUCIDE IN CHENNAI HERE THE DETAILS SRD

వాళ్లిద్దరూ బావ మరదలు..బెంగళూరులో రెండేళ్ల ప్రేమ..చివరికి చెన్నైలో ఆలింగనం చేసుకుని..

వాళ్లిద్దరూ బావ మరదలు..బెంగళూరులో రెండేళ్ల ప్రేమ..చివరికి చెన్నైలో ఆలింగనం చేసుకుని..

ప్రతీకాత్మక చిత్రం

ఆ ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు. పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారు. వివాహ బంధంతో ఒక్కటవ్వాలని అనుకున్నారు. కానీ వారి కోరిక తీరలేదు.

  • Share this:
    వాళ్లిద్దరూ ప్రేమికులు. పైగా బావ మరదళ్లు. రెండేళ్లుగా ప్రేమించుకున్నారు. అయితే, ప్రేమలో గెలిచిన ఆ జంట జీవిత పయనంలో ఓడారు. వివరాల్లోకెళితే.. చెన్నైలోని స్థానిక పళ్ళికరణై సమీపంలోని చీట్లపాక్కం రోడ్డులో బెంగళూరుకు చెందిన ప్రేమ జంట విషం తాగి ఆత్మహత్య చేసుకుంది. బెంగళూరు ఆర్కేపురానికి చెందిన అభినేష్‌ (30), పల్లవి (30) గత రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పల్లవి స్వయానా అభినేష్‌ మేనత్త కుమార్తె. వీరి ప్రేమ విషయం తెలిసిన పల్లవి తల్లి గాయత్రి మేనరికం వద్దని వీరి ప్రేమను నిరాకరించింది. దీనితో దిగులు చెందిన ఆ జంట సోమవారం రాత్రి బెంగళూరు నుంచి చెన్నైకి చేరుకుంది. ఇరువురూ పళ్ళికరణై రహదారి వద్ద విషం తాగి మృతి చెందారు. ఆ ప్రేమికులు కౌగలించుకున్న భంగిమలో విగతజీవులుగా వుండటం చూసి స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని ఇరువురి మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టంకు పంపారు. పోలీసుల జరిపిన విచారణలో ఆ ఇరువురి ఉదంతం వెలుగులోకి వచ్చింది. విచారణలో వెలుగు చూసిన అంశాల మేరకు అభినేష్‌(30), పల్లవి(30) బావ మరదళ్లుగా గుర్తించారు. అభినేష్‌ బెంగళూరులోని ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్నాడు. అభినేష్, పల్లవి రెండేళ్లుగా ప్రేమించుకుంటూ వచ్చారు. ఈ వ్యవహారం పల్లవి తల్లి గాయత్రి దృష్టికి చేరింది. వీరి ప్రేమకు ఆమె అడ్డు చెప్పడమే కాదు, పల్లవిని తీవ్రంగా మందలించింది. దీంతో పది రోజుల క్రితం ఇళ్లు వదలి అభినేష్‌తో కలిసి చెన్నైకు పల్లవి చేరుకుంది. తాంబరం– చిట్లపాక్కం మార్గంలోని పిల్లయార్‌ కోవిల్‌ వీధిలోని తన సోదరి ఇంటికి పల్లవితో అభినేష్‌ చేరుకున్నాడు.

    వీరి కోసం గాలింపు చేపట్టిన గాయత్రి ఎట్టకేలకు చెన్నైలో ఉన్నట్టు గుర్తించింది. అభినేష్‌ సోదరికి చీవాట్లు పెట్టింది. ఆందోళన చెందిన ఆమె ఇద్దరు బెంగళూరుకు వెళ్లిపోవాలని హెచ్చరించింది. దీంతో అభినేష్, పల్లవి ఇంటి నుంచి బయటకు వచ్చేశారు. బెంగళూరుకు వెళ్తే విడదీస్తారాని, ప్రాణహాని తప్పదన్న ఆందోళన వారిలో నెలకొంది. దీంతో ప్రేమలో గెలిచిన తాము.. జీవిత పయనంలో ఓడుతున్నామని చాటుతూ మరణంలో ఒక్కటయ్యారు. ముందుగా సిద్ధం చేసుకున్న విషాన్ని తాగి, తమను ఎవరూ విడదీయలేరన్నట్టుగా ఆలింగనం చేసుకున్న స్థితిలోనే మృత్యుఒడిలోకి చేరారు. వీరి మరణ సమాచారాన్ని బెంగళూరులోని కుటుంబసభ్యులకు పెరుంబాక్కం పోలీసులు తెలియజేశారు.

    మృతదేహాల్ని పోస్టుమార్టం నిమిత్తం క్రోంపేట జీహెచ్‌కు తరలించారు. వీరి బలన్మరణానికి కారణంగా గాయత్రిపై కేసు నమోదుకు చర్యలు చేపట్టారు. బెంగళూరు నుంచి మంగళవారం వస్తారనుకున్న కుటుంబసభ్యులు, బంధువులు, ఎంతకు రాకపోవడంతో మృతదేహాల్ని మార్చురీలో ఉంచారు. ప్రేమజంట తమ ప్రాంతంలో బలవన్మరణానికి పాల్పడిన సమాచారంతో మృతదేహాలు పడి ఉన్న ప్రాంతానికి అర్ధరాత్రి వేళ కూడా అక్కడి జనం పరుగులు తీయడంతో ఆ పరిసరాలు విషాదంతో నిండాయి.
    Published by:Sridhar Reddy
    First published: