గుంటూరులో బెంగళూరు బ్యాచ్.. బాయ్స్ హాస్టల్ నుంచి ‘బిజినెస్’

గతంలో బెట్టింగ్ దెబ్బకి మూడు నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. కొత్తగా నియమితులైన ఎస్పీ రాజశేఖరబాబు ఎలక్షన్ల హడావిడిలో వీళ్ళపై పెద్దగా దృష్టి పెట్టలేదనే చెప్పాలి.

news18-telugu
Updated: May 17, 2019, 7:31 PM IST
గుంటూరులో బెంగళూరు బ్యాచ్.. బాయ్స్ హాస్టల్ నుంచి ‘బిజినెస్’
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: May 17, 2019, 7:31 PM IST
గుంటూరు జిల్లా నరసరావుపేటలో క్రికెట్ బెట్టింగ్ భూతం మళ్లీ పడగవిప్పింది. నరసరావుపేట రూరల్ పోలీసులు ఐదుగురు బుకీలతో పాటు ,రెండు కార్లు , లక్షల్లో నగదు స్వాధీనం చేసుకున్నారు. నరసరావుపేట వినుకొండ రోడ్డులోని నూతనంగా నిర్మించిన హోటల్ ల్లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారనే సమాచారంతో ఆ హోటల్ పై దాడి చేసిన నరసరావుపేట రూరల్ పోలీసులు బెంగళూరుకు చెందిన బుకీ సురేంద్ర తో, మరో నలుగురు బుకీలను అదుపులోకి తీసుకున్నారు. వీరంతా హోటల్లో బస ఏర్పాటు చేసుకొని దగ్గరలోని ఓ ప్రైవేటు బాయ్స్ హాస్టల్ నుంచి తమ బెట్టింగ్ కార్యకలాపాలు సాగిస్తున్నారని తెలుసుకున్న పోలీసులు అవాక్కయ్యారు. ఐతే ఈ వ్యవహారం అంతా స్థానికంగా పనిచేస్తున్న కొందరు క్రిందిస్థాయి పోలీసు అధికారులు, సిబ్బంది ద్వారా నడిపిస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

గతంలో బెట్టింగ్ దెబ్బకి మూడు నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. బెట్టింగ్ ముఠాపై గతంలో జిల్లా ఎస్పీగా పనిచేసిన అప్పలనాయుడు, దీనిలో ప్రమేయం ఉందని తెలిసిన ఏడుగురు పోలీస్ సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు. ఇద్దరు ఎస్‌ఐలు, ఒక ఏఎస్ఐ, మరో నలుగురు హోంగార్డులపై వేటు పడింది. దీంతో బెట్టింగ్ ముఠా దాక్కుంది. ఐతే గుంటూరు రూరల్ ఎస్పీగా అప్పలనాయుడు ను తప్పించడంలో ఈ బెట్టింగ్ మాఫియా గట్టి ప్రయత్నమే చేసిందని అప్పట్లో పుకార్లు షికార్లు చేశాయి. కొత్తగా నియమితులైన ఎస్పీ రాజశేఖరబాబు ఎలక్షన్ల హడావిడిలో వీళ్ళపై పెద్దగా దృష్టి పెట్టలేదనే చెప్పాలి. కష్టపడకుండా లక్షల్లో డబ్బు సంపాదించవచ్చనే మాయమాటలతో బెట్టింగ్ మాఫియా యువతను తప్పుదోవ పట్టించి వారి ప్రాణాలతో చెలగాటం అడుతుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

(రఘు అన్నా, గుంటూరు కరస్పాండెంట్, న్యూస్‌18)

First published: May 17, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...