కూల్ డ్రింక్‌లో మత్తు మందు కలిపి హీరోయిన్‌పై అత్యాచారం.. ఆపై

2019 జూన్ 22వ తేదీన కన్నడ నటి ఇంటిలో తన పుట్టినరోజు వేడుకలను మోహిత్ నిర్వహించాడు. మరుసటి రోజే సదరు నటి పుట్టిన రోజు కావడంతో అక్కడే ఇద్దరు కలిసి భోజనం చేశారు. అనంతరం కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి నటికి ఇచ్చాడు.

news18-telugu
Updated: July 5, 2020, 11:01 AM IST
కూల్ డ్రింక్‌లో మత్తు మందు కలిపి హీరోయిన్‌పై అత్యాచారం.. ఆపై
ప్రతీకాత్మకచిత్రం
  • Share this:
అతడు ఓ ప్రైవేటు కంపెనీకి సీఈఓ. తన కంపెనీకి ప్రచారకర్త ఉండాలంటూ ఓ హీరోయిన్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఆ పేరుతో గోవాకు తీసుకెళ్లి ఫొటోషూట్ చేశాడు. అనంతరం ఆర్థిక సమస్యలంటూ హీరోయిన్ నుంచి రూ.1.50 లక్షలు తీసుకున్నాడు. ఓ రోజు నటి పుట్టిన రోజు కావడంతో ఆమె ఇంటికి వెళ్లాడు. ఆ క్రమంలో కూల్‌ డ్రింక్‌లో మత్తమందు కలిపి ఆమెపై అత్యాచారం చేశాడు. ఈ ఘటన బెంగుళూరులో వెలుగు చూసింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. బెంగళూరు నగరంలోని జగ్జీవన్ రాంనగరలోని ఓ అపార్టుమెంటులో ఓ కన్నడ నటి నివాసం ఉంటోంది. 2018 సంవత్సరంలో గాంధీబజారులోని కాఫీడేకు వెళ్లింది. ఈ సమయంలో కాఫీడేలో నాయండహళ్లికి చెందిన మోహిత్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది.

దీంతో మోహిత్ తాను ఓ ప్రైవేటు కంపెనీ సీఈఓనంటూ చెప్పాడు. తన కంపెనీ ప్రచారకర్తగా ఆ కన్నడ నటిని నియమించుకున్నాడు. ఆ పేరుతోనే 2019 జనవరి 15న ఆమెను గోవాకు తీసుకెళ్లాడు. అక్కడ కన్నడ నటిపై ఫొటోషూట్ చేశాడు. ఈ క్రమంలో కంపెనీలో ఆర్థిక సమస్యలంటూ ఆమె నుంచి రూ.1.50 లక్షలు తీసుకున్నాడు. 2019 జూన్ 22వ తేదీన కన్నడ నటి ఇంటిలో తన పుట్టినరోజు వేడుకలను మోహిత్ నిర్వహించాడు.

మరుసటి రోజే సదరు నటి పుట్టిన రోజు కావడంతో అక్కడే ఇద్దరు కలిసి భోజనం చేశారు. అనంతరం కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి నటికి ఇచ్చాడు. ఆమె స్పృహ కోల్పోగానే అత్యాచారానికి ఒడిగట్టాడు. ఆ అత్యాచార దృశ్యాలను చిత్రీకరించాడు. జూన్ 24న అత్యాచార వీడియోలను నటికి చూపించి డబ్బు ఇవ్వాలని, లేనిపక్షంలో సోషల్ మీడియాలో పెడతానంటూ బెదిరింపులకు దిగాడు. దీంతో భయపడిన ఆ నటి మోహిత్‌కు రూ.11 లక్షలు ఇచ్చింది.

అయినా మరోసారి ఈ తరహాలోనే బెదిరించి మరో రూ.9 లక్షలు లాక్కుని అత్యాచారం చేశాడు. విసిగిపోయిన కన్నడ నటి తన తండ్రితో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. నటి ఫిర్యాదు మేరకు మోహిత్, అతడి తల్లిదండ్రులపై కేసు నమోదు చేసి వారి కోసం గాలిస్తున్నారు.
Published by: Narsimha Badhini
First published: July 5, 2020, 11:01 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading