TELANGANA BJP: రాసలీలల వ్యవహారం.. కీలక నేతపై బీజేపీ వేటు!

బయటపడ్డ వీడియోలోని దృశ్యం

TELANGANA BJP: కరీంనగర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడి పదవి నుంచి బాస సత్యనారాయణరావును తొలగిస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆదేశాలు జారీ చేశారు. జిల్లా బీజేపీ నూతన అధ్యక్షుడిగా గంగాడి కృష్ణారెడ్డిని నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. సత్యనారాయణ రాసలీలల వ్యవహారం బయటకు రావడంతో వేటు వేసినట్లు సమాచారం.

  • Share this:
    కరీంనగర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడి పదవి నుంచి బాస సత్యనారాయణరావును తొలగిస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆదేశాలు జారీ చేశారు. జిల్లా బీజేపీ నూతన అధ్యక్షుడిగా గంగాడి కృష్ణారెడ్డిని నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు బండి సంజయ్ ఉత్తర్వులు జారీ చేశారు. బాస సత్యనారాయణ మహిళా కార్యకర్తను పదవులను ఎరగా వేసి లొంగదీసుకున్నాడన్న ఆరోపణలు వచ్చాయి. ఆయన రాసలీలల వీడియో, ఆడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడం సంచలనంగా మారింది. పార్టీకి సైతం ఈ విషయం ఇబ్బందిగా మారింది. దీంతో ఆయనను తప్పిస్తూ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నిర్ణయం తీసుకున్నారు.



    క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పబడే బీజేపీలో జిల్లా అధ్యక్షుడి స్థాయి నేత రాసలీలల వ్యవహరం బయటకు రావడం సంచలనంగా మారింది. కరీంనగర్ కు చెందిన ఆ జిల్లా నాయకుడు మహిళా కార్యకర్తలతో రాసలీలు సాగించిన వీడియో, ఆడియోలు బయటకు వచ్చాయి. ఓ మహిళా కార్యకర్తకు పదవులు ఇప్పిస్తాడని లోబర్చుకుని ఆమెతో తన కామ కోరికలను తీర్చుకున్నాడని ఆరోపణలు వచ్చాయి. మోజు తీరాక వద్దనడంతో ఆ మహిళా కార్యకర్త ఆ నాయకుడి బండారాన్ని బయటపెట్టడంతో బేరాలకు దిగినట్లు సమాచారం. అయితే ఆ బేరాలు బెడిసి కొట్టడం తో విషయం బయటకు వచ్చింది. ఆ మహిళా కార్యకర్తతో సదరు నాయకుడు చేసిన క్రమక్రీడలు వెలుగులోకి వచ్చాయి. అందుకు సంబంధించిన వీడియో, ఆడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో ఈ నాయకుడి వ్యవహారం బీజేపీకి తలనొప్పిగా మారింది. నలుగురికి ఆదర్శంగా ఉండాల్సిన నాయకుడే ఇలా వ్యవహరించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. బీజేపీ నాయకత్వం స్పందించి సదరు నేతపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ వ్యక్తమైంది. దీంతో స్పందించిన పార్టీ నాయకత్వం ఈ నిర్ణయం తీసుకుంది. పార్టీకి చెడ్డపేరు తీసుకువచ్చిన నాయకుడిని బాధ్యతల నుంచి తప్పించింది.
    Published by:Nikhil Kumar S
    First published: