హోమ్ /వార్తలు /క్రైమ్ /

యువకుడి పురుషాంగం కట్ చేసి.. కళ్లు పీకేసి.. హైవేపై దారుణ హత్య.. ఇంత ఘోరమా..?

యువకుడి పురుషాంగం కట్ చేసి.. కళ్లు పీకేసి.. హైవేపై దారుణ హత్య.. ఇంత ఘోరమా..?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

UP Murder: పురుషాంగం కోసేశారని.. పొట్ట భాగంలో బలమైన గాయాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఆ యువకుడిని ఇక్కడ చంపేశారా? లేదంటే ఎక్కడో హత్యచేసి.. మృతదేహాన్ని తీసుకొచ్చి ఇక్కడ పడేశారా? అనేది తెలియాల్సి ఉంది.

ఈ సమాజంలో నేరాలు ఘోరాలు సర్వ సాధారణమే. ఎన్ని కఠిన చట్టాలు వచ్చినా.. పోలీసులు భద్రత పెరిగినా..  హత్యలు, అత్యాచారాలు జరుగుతూనే ఉంటాయి. వీటిలో కొన్ని ఘటనలు మాత్రం ఒళ్లు గడుర్పొడిచేలా ఉంటాయి. ఈ కేసు కూడా అలాంటిదే. ఓ యువకుడికి అత్యంత కిరాతకంగా చంపేశారు. పురుషాంగాన్ని కోసేశారు. కళ్లు పీకేశారు. పొట్ట, ఛాతీ భాగంలో కత్తిపోట్లతో తూట్లు పెట్టారు. అసలు ఆ యువకుడు ఎవరో తెలియదు. ఎవరు చంపారో తెలియదు. కానీ హైవే పక్కన డెడ్ బాడీ లభ్యమవడంతో తీవ్ర కలకలం రేగింది. ఈ అమానవీయ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బాందాలో వెలుగు చూసింది.

పురుషులు లేని ఊరు.. 30 ఏళ్లుగా అంతే.. కానీ మహిళలకు గర్భం ఎలా వస్తోంది..?

పోలీసుల చెప్పిన వివరాల ప్రకారం.. బిసాండా పోలీస్ స్టేషన్ పరిధిలోని పునాహూర్ గ్రామంలోని ఎక్స్‌ప్రెస్ హైవే సమీపంలో ఓ గుర్తు తెలియని మృతదేహం లభ్యమయింది. ఆరు లేన్ల రహదారిపై కల్వర్టు సమీపంలో డెడ్‌బాడీని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. ఆ యువకుడి వయసు 24-26 ఏళ్ల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. పురుషాంగం కోసేశారని.. పొట్ట భాగంలో బలమైన గాయాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఫోరెన్సిక్ టీమ్ కూడా అక్కడి వెళ్లి పలు ఆధారాలను సేకరించింది. ఆ యువకుడిని ఇక్కడ చంపేశారా? లేదంటే ఎక్కడో హత్యచేసి.. మృతదేహాన్ని తీసుకొచ్చి ఇక్కడ పడేశారా? అనేది తెలియాల్సి ఉంది. ముందు ఆ యువకుడు ఎవరో తెలిస్తే.. ఆ వివరాల ప్రకారం దర్యాప్తు ముందుకు సాగే అవకాశముంది. ఈ మర్డర్ మిస్టరీని త్వరలోచే ఛేదిస్తామని పోలీసులు వెల్లడించారు.

రోడ్డు పక్కన చెత్తు కుప్పలో నగ్నంగా మహిళ మృతదేహం.. మూట విప్పిచూసి పోలీసులు షాక్

ఇదే ఉత్తరప్రదేశ్‌లోని మరో దారుణ ఘటన జరిగింది. రాయ్‌బరేలీ జిల్లా గులాబ్ రాయ్‌ఖేడా గ్రామంలో ఇటుకతో కొట్టి భార్యను హత్య చేశాడో భర్త. వంట చేసే విషయంలో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. తనకు నచ్చిన కూర చేయకపోవడంతో భార్యతో భర్త గొడవపెట్టుకున్నాడు. ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో కోపంతో ఊగిపోయిన భర్త.. తన భార్యను ఇటుకతో కొట్టి దారుణంగా హత్య చేశాడు. అనంతరం పారిపోయాడు. హత్యపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు.

First published:

Tags: Crime news, Murder, Up news, Uttar pradesh

ఉత్తమ కథలు