కొందరు మారుతున్న సమాజంతో పాటు తమను తాము అప్ డేట్ చేసుకుంటున్నారు. విద్యా, ఉద్యోగం, ఆలోచన విధానాలలో మార్పులు తెచ్చుకుంటున్నారు. సమాజంలో ఒక మంచి స్థానంలో ఉండటానికి ప్రయత్నిస్తున్నారు. మరికొందరు దీనికి భిన్నంగా ప్రవర్తిస్తున్నారు. ఇప్పటికీ పాత ఆలోచనలు, వింత పోకడలను పాటిస్తున్నారు. కాగా, దంపతుల మధ్య గొడవలు, కుటుంబ సమస్యలు (Family disputes) రావడం సహాజం. వీటిని పెద్దల సమక్షంలో మాట్లాడుకుని పరిష్కరించుకొవాలి. కానీ కొందరు దీనికి పూర్తిగా అనాగరికమైన పనులు చేస్తున్నారు. ఈ కోవకు చెందిన ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
పూర్తి వివరాలు.. ఒడిశాలోని (Odisha) బాలాసోర్ జిల్లాలో దారుణం జరిగింది. సభ్యసమాజం తలదించుకునే ఘటన ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. బాలాసోర్ లో కు చెందిన సదరు భార్య భర్తలకు 2017లో పెళ్లి (marriage) జరిగింది. కొన్ని రోజుల పాటు వీరి కాపురం సజావుగానే సాగింది. మహిళను.. అత్త గారు తరచుగా వరకట్నం (Dowry harass ment) కోసం వేధిస్తుండే వారు. భర్త కూడా ఆమెను హింసిస్తుండే వాడు. వీరికి రెండున్నరేళ్ల కొడుకు ఉన్నాడు.
అయితే, ఈ మధ్య వీరి హింసలు మరింత ఎక్కువయ్యాయి. భర్త తరపు వారు.. మహిళను ఒక తాంత్రికుడి (Tantrik) దగ్గరకు తీసుకెళ్లారు. ఆమెకు కొన్ని దోషాలు ఉన్నాయని, అవి తగ్గిస్తానన వారికి చెప్పాడు. మహిళను ఇక్కడే ఉంచాలని చెప్పాడు. దీనికి మహిళ నిరాకరించింది. దీంతో భర్త.. పానీయంలో మత్తుపదార్థం కలిపి ఆమెచేత తాగించాడు. సృహ తప్పి పడిపోయాక ఆమెను అక్కడే వదిలేసి వారు వెళ్లిపోయారు. వారికి కావాల్సిన ఆహరాన్ని చాటుగా అందించి వెళ్లిపోయేవారు. బాధిత మహిళ... కొన్ని నెలలుగా అక్కడే ఉంది. మైనర్ కొడుకును కూడా తాంత్రికుడి వద్దనే వదిలేశారు.ఆమెను తాంత్రికుడు (Tantrik rapes woman) ప్రతిరోజు అత్యాచారం చేసేవాడు.
ప్రతిరోజు బాలుడి ముందే తాంత్రికుడు (Woman rapes by tantrik) అఘాయిత్యం చేసేవాడు. ఒక రోజు తాంత్రికుడు తన ఫోన్ ను గదిలో మరిచిపోయి బయటకు వెళ్లాడు. వెంటనే బాధితురాలు తన గొడును తన పుట్టింటి వారికి చెప్పుకుంది. దీంతో ప్రస్తుతం ఈ దారుణం వెలుగులోనికి వచ్చింది. వెంటనే వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మహిళను కాపాడారు. తాంత్రికుడు పోలీసుల రాకను గమనించి అక్కడి నుంచి పారిపోయాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Harassment on women, Husband harassment, Odisha, Rape case