BADAUN RAPE MURDER CASE FIR AGAINST TWO COPS FOR DERELICTION OF DUTY SU
Badaun rape-murder case: మహిళపై పూజారి అత్యాచారం, హత్య.. ఇద్దరు పోలీసులపై కేసు నమోదు
ప్రతీకాత్మక చిత్రం
ఉత్తరప్రదేశ్ బదౌన్‌లో గుడికి వెళ్లిన అంగన్వాడీ హెల్పర్‌ను మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి పూజారి రేప్ చేసి హత్య చేసిన ఘటన తీవ్ర సంచనలం రేపిన సంగతి తెలిసిందే.
ఉత్తరప్రదేశ్ బదౌన్‌లో గుడికి వెళ్లిన అంగన్వాడీ హెల్పర్‌ను మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి పూజారి రేప్ చేసి హత్య చేసిన ఘటన తీవ్ర సంచనలం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో పోలీసులు ఇప్పటికే పూజారితో పాటుగా అతని ఇద్దరు అనుచరులను అదుపులోకి తీసుకున్నారు. అలాగే కేసుకు సంబంధించి లోతైన దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించి ఫిర్యాదు చేస్తే స్థానిక పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో నిర్లక్ష్యంగా వహించారని బాధిత మహిళ కుటుంబసభ్యులు తెలిపారు. 18 గంటల ఆలస్యంగా ఎప్ఐఆర్ నమోదు చేయడం జరిగిందని ఆరోపించారు. దీంతో ఈ కేసుకు సంబంధించి పోలీసుల నిర్లక్ష్యంపై కూడా ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. సంబంధింత పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌వో, పోస్ట్ ఇంచార్జ్‌లపై కేసు నమోదు చేశారు. అయితే తొలుత వీరిని విధుల నుంచి సస్పెండ్ చేశారు.
ఇందుకు సంబంధించి బదౌన్(రూరల్) ఎస్పీ సిదార్థ వర్మ మాట్లాడుతూ.. "పోలీసులకు సంబంధించి కొంత లోపం ఉన్నట్టు మా విచారణలో తేలింది. ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో ఆలస్యం జరిగింది. మహిళలకు సంబంధించిన ఫిర్యాదులు, నేరాల విషయంలో వెంటనే స్పందించడంతో పాటుగా, కొన్ని విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది" అని తెలిపారు.
అంగన్వాడీ హెల్పర్‌గా పనిచేస్తున్న ఓ మహిళ గత ఆదివారం గ్రామ శివార్లలోని ఆలయానికి వెళ్లింది. అయితే పొద్దుపోయాక కూడా ఆమె ఇంటికి తిరిగిరాలేదు. అయితే అదే రోజు రాత్రి ఆ ఆలయ పూజారి, అతని ఇద్దరు సహాయకులు మహిళ మృతదేహాన్ని వాహనంలో ఇంటికి తీసుకువచ్చారు. ఆమె ఆలయ ప్రాంగణంలోని ఎండిపోయిన బావిలో పడిపోయిందని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో మహిళ కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందజేశారు. ఇక, బాధిత మహిళ మృదేహానికి పోస్ట్ మార్టమ్ నిర్వహించగా.. ఆమెపై అత్యాచారం జరిగినట్టుగా వెల్లడైంది. మహిళ పక్కటెమెక పగులు వచ్చిందని, ఊపిరితిత్తులు కూడా దెబ్బతిన్నాయని పోస్ట్‌మార్టమ్ నివేదికలో తేలింది.
Published by:Sumanth Kanukula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.