అమ్మకానికి 4 రోజుల పసికందు...కన్నతల్లి, లేడీ డాక్టర్ కలిసి...

పార్వతి భర్త 15 ఏళ్ల క్రితమే చనిపోయాడని పోలీసుల విచారణలో తేలింది.

news18-telugu
Updated: May 17, 2019, 10:05 PM IST
అమ్మకానికి 4 రోజుల పసికందు...కన్నతల్లి, లేడీ డాక్టర్ కలిసి...
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: May 17, 2019, 10:05 PM IST
నిజామాబాద్ జిల్లాలో పసికందు విక్రయం కలకలం రేపింది. 4 రోజుల శిశువును కన్నతల్లి, వైద్యురాలు కలిసి అమ్మేందుకు ప్రయత్నించారు. బోధన్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో శిశువు జన్మించగా.. హైదరాబాద్‌లో అమ్మేందుకు ప్లాన్ చేశారు. పక్కా సమాచారంతో ఐ.సి.డి.ఎస్ అధికారులు, పోలీసులు రంగంలోకి దింగి బేబీ విక్రయాన్ని అడ్డుకున్నారు. శిశువు తల్లితో పాటు డాక్టర్‌పై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

మహారాష్ట్ర నాందేడ్‌కు చెందిన పార్వతి మే 4న భోధన్‌లోని శ్రీసాయి ప్రసన్న ఆస్పత్రిలో మగబిడ్డకు జన్మనిచ్చింది. పార్వతికి కాన్పుచేసిన డాక్టర్ ప్రసన్న..హైదరాబాద్‌లో ఉన్న తమ బంధువులకు పిల్లలు లేరని..వారికి బిడ్డను అమ్మాల్సిందిగా కోరింది. అందుకు పార్వతి ఒప్పుకోవడంతో ఓ రేటు మాట్లాడుకున్నారు. నాలుగు రోజుల తర్వాత బిడ్డను డాక్టర్ ప్రసన్న కుమారి బంధువులకు చేర్చాలని ఆయా శాంషన్ బేగంకు ఇచ్చి హైదరాబాద్‌కు పంపించారు.

హైద్రాబాద్ బస్‌స్టాండ్‌లో ఆయా చేతిలో పాపను చూసిన కొందరికి అనుమానం వచ్చి ప్రశ్నించారు. ఆమె పొంతన లేని సమాధానాలు చెప్పడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. హైదరాబాద్ పోలీసుల వెంటనే బోధన్ సీడీపీవో లలిత కుమారికి సమాచారం ఇచ్చారు. అనంతరం లలిత కుమారి బోధన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆ మేరకు శిశువు తల్లి పార్వతి, డాక్టర్ ప్రసన్న కుమారి, ఆయా శాంషన్ బేగంపై కేసులు నమోదు చేశారు. ఐతే పార్వతి భర్త 15 ఏళ్ల క్రితమే చనిపోయాడని పోలీసుల విచారణలో తేలింది.

First published: May 17, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...