బిడ్డ కాదు పిండి ముద్ద ... ప్రభుత్వ పథకం కోసం మహిళ పన్నాగం

అయితే శిశువును పరీక్షించాకే.. పేరు నమోదు చేస్తామని తెలిపారు ఆస్పత్రి సిబ్బంది. పరీక్షల నిమిత్తం కన్నబిడ్డను డాక్టర్‌కు ఇవ్వాలంటూ అడిగారు. అందుకు ఆమె ససేమిరా అంది

news18-telugu
Updated: August 25, 2019, 11:48 AM IST
బిడ్డ కాదు పిండి ముద్ద ... ప్రభుత్వ పథకం కోసం మహిళ పన్నాగం
బిడ్డ కాదు పిండి ముద్ద ... ప్రభుత్వ పథకం కోసం మహిళ పన్నాగం
  • Share this:
ఓ మహిళ ప్రభుత్వ పథకం కోసం ఏకంగా బిడ్డను తయారు చేసింది. అదెలా అనుకుంటున్నారా? కళ్లు, ముక్కు, చెవులు ఉన్న బిడ్డ కాకుండా ... పిండితో తయారు చేసిన బిడ్డను ఒడిలో పెట్టుకొని అందర్నీ నమ్మించింది. ఆమె పొత్తిళ్లలో ఉన్నది నిజమైన శిశువు అని అందరూ నమ్మారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌కు 465 కిలోమీటర్ల దూరంలో ఉన్న మొరినా జిల్లాలో చోటు చేసుకుంది.

ఎంపీలో శ్రామిక్ సేవా ప్రసూతి సహాయ యోజన కింద గ్రామీణ ప్రాంతాలకు చెందిన ఒక మహిళకు పోషకమైన ఆహారం కోసం 1400 రూపాయలు, డెలివరీ తర్వాత రూ .16 వేలు ఇస్తుంది అక్డకి ప్రభుత్వం. డెలివరీ ఉన్నప్పుడు మాత్రమే ఈ పథకం కింద సహాయం ఇవ్వబడుతుంది. ఆస్పత్రిలో, డాక్టర్ల పర్యవేక్షణలో జరిగిన డెలివరీలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. అయితే ఓ మహిళ స్థానికంగా ఉన్న ఆశావర్కర్‌తో కలిసి ప్రభుత్వాసుపత్రికి చేరుకుంది. ఒడిలో బిడ్డను పట్టుకొని అక్కడుకు వెళ్లిన ఆమె  అక్కడున్న నర్సుతో తన పేరు రిజిస్టర్‌లో నమోదు చేయమంది. అయితే శిశువును పరీక్షించాకే.. పేరు నమోదు చేస్తామని తెలిపారు ఆస్పత్రి సిబ్బంది. పరీక్షల నిమిత్తం కన్నబిడ్డను డాక్టర్‌కు ఇవ్వాలంటూ అడిగారు.

అందుకు ఆమె ససేమిరా అంది. తాను మృతశిశువుకు జన్మనిచ్చానని ... బిడ్డను ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో అక్కడున్న వాళ్లకు అనుమానం వచ్చి బలవంతంగా ఆమె వద్ద నుంచి బిడ్డను లాక్కునేందుకు ప్రయత్నించారు. బట్టలో చుట్టుకొని మహిళ తీసుకొచ్చింది బిడ్డ కాదు పిండి ముద్ద అని తెలుసుకొని అవాక్కయ్యారు. మహిళ తెచ్చింది బిడ్డకాదా అంటూ నోళ్లు వెళ్లబెట్టారు. అయితే ఈ ఘటన జరగగానే అక్కడ్నుంచి ఆ మహిళ ఆమె భర్త పరారయ్యారు. దీంతో ఆస్పత్రి అధికారులు మహిళ వెంట వచ్చిన ఆశా కార్యకర్తని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఆశాకార్యకర్తపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలంటూ ఆదేశించారు.

  
First published: August 25, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు