HOME »NEWS »CRIME »baby girl for 60000 and baby boy for one and half lakh child trafficking racket arrested in mumbai hsn

ఘోరం.. పసిపిల్లలకు రేట్లు కట్టి.. అమ్మేస్తున్నారు. పాపకు రూ.60వేలు.. బాబుకు లక్షన్నర..

ఘోరం.. పసిపిల్లలకు రేట్లు కట్టి.. అమ్మేస్తున్నారు. పాపకు రూ.60వేలు.. బాబుకు లక్షన్నర..
ప్రతీకాత్మక చిత్రం

పేద ప్రజలు, ఫుట్ పాత్ లపై నివసించేవారు, కూటికి అల్లాడుతున్న వారిని ఓ ముఠా టార్గెట్ చేస్తోంది. వాళ్ల ఇళ్లల్లో ఉంటున్న నెలల పిల్లలను కొనుక్కుంటామని బేరాలు ఆడుతోంది. రోజూ వంద రూపాయలు కూడా ఆదాయం లేని ఆ కుటుంబానికి అంత డబ్బు అని చెప్పగానే ఆశ పుట్టో, మా బిడ్డ మంచిగా బతుకుతాడన్న కోరికతోనో వారికి ఓకే చెబుతున్నారు. పిల్లలను అమ్మేస్తున్నారు. ఈ రాకెట్ లో ఓ మహిళ పట్టుబడటంతో వీరి ముఠా ఆగడాలు బయటకొచ్చాయి.

  • Share this:
    రూ.60 వేలు, రూ.1.50 లక్షలు.. ఏంటీ ఈ ధరలు చూస్తే ఏదో బ్రాండెడ్ ఫోన్ ధరలనుకుంటున్నారా.? కొత్తగా వచ్చిన స్మార్ట్ టీవీ ఖరీదనుకుంటున్నారా.? అయితే మీరు పొరపాటు పడినట్టే. ఈ ధరలు పసిపిల్లలకు కట్టిన రేట్లు. ఆడ బిడ్డలను 60వేల రూపాయలకు అమ్మేస్తున్నారు. అబ్బాయిలనయితే లక్షన్నర పెట్టి కొంటున్నారు. ముంబాయి నడిబొడ్డున జరుగుతోందీ ఘోరం. పేద ప్రజలు, ఫుట్ పాత్ లపై నివసించేవారు, కూటికి అల్లాడుతున్న వారిని ఓ ముఠా టార్గెట్ చేస్తోంది. వాళ్ల ఇళ్లల్లో ఉంటున్న నెలల పిల్లలను కొనుక్కుంటామని బేరాలు ఆడుతోంది. రోజూ వంద రూపాయలు కూడా ఆదాయం లేని ఆ కుటుంబానికి అంత డబ్బు అని చెప్పగానే ఆశ పుట్టో, మా బిడ్డ మంచిగా బతుకుతాడన్న కోరికతోనో వారికి ఓకే చెబుతున్నారు. పిల్లలను అమ్మేస్తున్నారు. ఈ రాకెట్ లో ఓ మహిళ పట్టుబడటంతో వీరి ముఠా ఆగడాలు బయటకొచ్చాయి.

    రూక్షర్ అనే మహిళ రూపాలి వెర్మ అనే మహిళ సాయంతో తన పాపను అమ్మేసింది. ఈ విషయం పోలీసులకు తెలిసి వారిని పట్టుకున్నారు. పాపను శిశు సంరక్షణ కేంద్రానికి తరలించారు. రూపాలి వెర్మను నిలదీస్తే ఆమె చెప్పింది విని పోలీసులే అవాక్కయ్యారు. ఆమెతో కలిపి మొత్తం ఎనిమిది మంది గ్యాంగ్ ఈ వ్యాపారాన్ని చేస్తోంది. వారిలో ఆరుగురు మహిళలే కావడం గమనార్హం. పేదరికంలో మగ్గిపోతూ గర్భవతులైన వారిని తాము టార్గెట్ గా చేసుకుంటామనీ, వారి పిల్లలను డబ్బిచ్చి కొంటుంటామని ఆమె వెల్లడించింది. గత ఆరు నెలలుగా నలుగురు పిల్లలను ఇలాగే తల్లుల వద్ద కొనుక్కుని, ఎవరికి కావాలో వారికి అమ్మేశామని తెలిపింది.



    వెర్మను విచారిస్తే ఆ గ్రూపులోని మిగిలిన సభ్యుల పేర్లను కూడా వెల్లడించింది. నిషా అహిరే, హీనా ఖాన్, ఆర్తి సింగ్, రూష్కర్ షైక్, గీతాంజలి గైక్వాడ్, షాజహాన్ జోగిల్కార్, సంజయ్ పాదం తదితరులపై ముంబై పోలీసులు కేసును రిజిస్టర్ చేశారు. మానవ అక్రమ రవాణా కింద వారిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. కాగా, వారు చెప్పినట్టుగా నలుగురు పిల్లలే కాకుండా అంతకంటే ఎక్కువ మందినే అమ్మేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా, పిల్లలను పేదల దగ్గర నుంచి కొని, వారిని ధనవంతులకు, పిల్లలు లేని వాళ్లకు అమ్మడం అన్ని ప్రధాన నగరాల్లో జరుగుతోంది. ఇటీవలే హైదరాబాద్ లో ఫుట్ పాత్ పై నివసించే మహిళ పాపను బలవంతంగా ఆమె భర్తే అమ్మేశాడు. ఈ విషయం తెలిసి మహిళ కేసు పెట్టగా, భర్తను, ఆ నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
    Published by:Hasaan Kandula
    First published:January 18, 2021, 15:09 IST