(P.Mahendar,News18,Nizamabad)
తన ఇద్దరు కవల పిల్లలకు నోట్లో విషం పోసి ప్రాణాలు తీయాలని చూసింది ఓ తల్లి. వాళ్లతో పాటు తాను కూడా ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించింది. దారుణ ఘటనలో తల్లి ఒక బిడ్డ బ్రతకగా ..మరో పసికందు ప్రాణాలు విడిచింది. ఇంతటి దారుణ ఘటన కామారెడ్డి(Kamareddy)జిల్లాలో చోటుచేసుకుంది. మాచారెడ్డి (Machareddy)మండలం ఇసాయిపేట(Isaipet)గ్రామానికి చెందిన కడెం నవీన్ (Naveen)మమత (Mamtha) దంపతులు నివసిస్తున్నారు. ఈ దంపతులకు 11 నెలల క్రితమే ఆడ కవల పిల్లలు జన్మించారు. వారం రోజుల క్రితం రోడ్డు ప్రమాదానికి గురైన నవీన్ గాయాలపాలై ఇంట్లోనే ఉంటున్నాడు. ఈక్రమంలోనే అత్త లక్ష్మీ(Lakshmi)కోడలు మమతకు మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి. అయితే రెండ్రోజుల క్రితమే అత్త, కోడలు మాట మాట అనుకుంటూ గొడవపడుతుండగా నవీన్ కలుగుచేసుకొని భార్య మమతను, తల్లి లక్ష్మిని ఇద్దరినీ మందలించాడు.
పిల్లలకు పురుగుల తాగించిన తల్లి..
అత్తారింట్లో తరచూ గొడవలు జరగడం...భర్త తననే తిడుతున్నారనే మమత మనస్తాపానికి గురైంది. తనకు పుట్టిన ఇద్దరు కవల పిల్లలు మహాశ్రీ, మహన్యను గదిలోకి తీసుకెళ్లింది. ఇద్దరికి ఎలుకల మందు తాగించి తానూ తాగింది. ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో తలుపులు పగులగొట్టి చూడటంతో ముగ్గురు అపస్మారక స్థితి లో కనిపించారు. హుటాహుటిన కామారెడ్డిలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా చికిత్స అందించారు. అయితే ఇద్దరు ఆడకవల పిల్లల్లో చికిత్స పొందుతూ చిన్నారి మహాశ్రీ ఆదివారం తెల్లవారుజామున మృతిచెందింది. మరో చిన్నారి పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్ నిలోఫర్ ఆసుపత్రికి తరలించారు.
ఆసుపత్రిలో తల్లి, మరో బిడ్డ ..
తల్లి మమత చికిత్స పొందుతోంది. భర్త నవీన్, అత్త లక్ష్మి, మామ నారాయణ వరకట్న వేధింపులతోనే తమ బిడ్డ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని మమత కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. దీంతో మమత తమ్ముడు కల్లూరి మధు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న ఎస్సై సంతోష్ కుమార్ దర్యాప్తు చేస్తున్నట్లుగా తెలిపారు. కవల పిల్లల్లో ఒకరైన ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించిన మహా శ్రీ డెడ్ బాడీని పరిశీలించారు డీఎస్పీ సోమనాథం. రమేష్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మమతతో మాట్లాడారు. ఆత్మహత్యాయత్నం ఘటనకు సంబంధించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఏ పాపం తెలియని చిన్నారి బలి..
అయితే తొమ్మది నెలలు కడుపులో మోసి .. పదకొండు నెలలు కళ్లల్లో పెట్టుకుని పెంచి పెద్ద చేసిన తల్లి క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం ఎంతవరకు సమంజసం... తనకు కష్టం వస్తే తాను బరించాలి కాని ముక్కు పచ్చలారని చిన్నరుల ప్రాణాలు తీసేహక్కు లేదని స్థానికులు అంటున్నారు. ఏదైన సమస్యం వస్తే ప్రాణాలు తీసుకోవడం వల్ల పరిష్కారం కావని అలాంటి సమస్యలపై పోరాడాలని అప్పుడే ఆ సమస్యలకు పరిష్కారం లబిస్తుందని గ్రామస్థులు అంటున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.