మహిళపై దొంగ బాబా అత్యాచారం.. కాళ్లు చేతులు కట్టేసి..

ఆమెకు మాయమాటలు చెప్పిన బాబా.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. కాళ్లు చేతులు కట్టేసి అఘాయత్యానికి పాల్పడ్డాడు. ప్రతిఘటించేందుకు ప్రయత్నించడంతో ఆమెపై దాడి చేశాడు.

news18-telugu
Updated: September 10, 2019, 3:22 PM IST
మహిళపై దొంగ బాబా అత్యాచారం.. కాళ్లు చేతులు కట్టేసి..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
మనోళ్లు లాజిక్‌ను నమ్మరు. మ్యాజిక్‌నే నమ్ముతారు. అందుకే గల్లీకో దొంగబాబా పుట్టుకొచ్చి.. అమాయకుల నుంచి అందిన కాడికి దోచుకుంటున్నారు. ఆడవారిపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. నిత్యం ఇలాంటి ఘటనలు జరుగుతున్నా జనాల్లో మాత్రం మార్పు రావడం లేదు. తాజాగా జార్ఖండ్‌లోనూ ఇలాంటి ఘటనే జరిగింది. అనారోగ్య సమస్యలతో వచ్చిన మహిళపై ఓ స్వయం ప్రకటిత బాబా అత్యాచారానికి పాల్పడ్డాడు. ధంబాడ్ జిల్లాలో ఈ ఘోరం జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సాలుకచప్రా ప్రాంతానికి చెందిన ఓ దళిత మహిళలకు రెండు నెలల క్రింద వివాహమైంది. గుర్తు తెలియని వ్యాధితో ఆమె కొన్ని రోజులుగా బాధపడుతోంది. ఐతే లాల్ బాబా ఆశ్రమానికి వెళ్తే వ్యాధి నయమవుతుందని తెలిసిన వారు చెప్పారు. భరత్ ఆచార్య అలియాస్ భారు బాబా మంత్రిస్తే ఎలాంటి రోగమైనా పారిపోతుందని తెలిపారు. అది నమ్మిన ఆ మహిళ.. ఇటీవల లాల్ బాబా ఆశ్రమానికి వెళ్లింది. ఆమెకు మాయమాటలు చెప్పిన బాబా.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. కాళ్లు చేతులు కట్టేసి అఘాయత్యానికి పాల్పడ్డాడు. ప్రతిఘటించేందుకు ప్రయత్నించడంతో ఆమెపై దాడి చేశాడు. ఎవరికైనా చెబితే మంత్రాలతో చేతబడి చేసి చంపేస్తానని బెదరించాడు.

అక్కడి నుంచి ఎలాగోలా బయటపడిన బాధితురాలు జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు వివరించి.. బోరున విలపించింది. బంధువులు ఆమెకు ధైర్యం చెప్పి అనంతరం పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి ఫిర్యాదు చేయించారు. ఘటనపై బాధితురాలి నుంచి వాంగ్మూలం తీసుకున్న పోలీసులు బాబాను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ఆ మహిళలను పాటలీపుత్ర మెడికల్ ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించారు.

First published: September 10, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>