ఎంపీకి షాక్... బర్రెను దొంగిలించాడని కేసు నమోదు

ఎంపీ ఆజమ్‌ ఖాన్‌తో పాటు మాజీ అధికారి అలయ్‌ హసన్‌ పేర్లను అందులో చేర్చారు. మరో 40 మంది గుర్తు తెలియని వ్యక్తుల పేర్లను కూడా ఎఫ్ఐఆర్‌లో పొందుపరిచారు.

news18-telugu
Updated: August 30, 2019, 6:49 PM IST
ఎంపీకి షాక్... బర్రెను దొంగిలించాడని కేసు నమోదు
ప్రతీకాత్మక చిత్ర
  • Share this:
రాజకీయ నాయకులు కుంభకోణాల్లో ఇరుక్కోవడం చూశాం. అవి రుజువై జైలుపాలవడం చూశాం. కానీ ఈ ఎంపీ మాత్రం దొంగతనం కేసులో చిక్కుకున్నారు. అది కూడా ఓ విచిత్రమైన దొంగతనం. ఏ డబ్బుల చోరీయో...నగల దోపిడీయో కాదు.. గేదెను దొంగిలించాడని ఆయనపై కేసు పెట్టారు. ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌లో ఈ ఘటన జరిగింది. దొంగతనం కేసు నమోదైన ఆ ఎంపీ ఎవరో తెలుసా..? సమాజ్‌వాదీ పార్టీ ఫైర్ బ్రాండ్, రాంపూర్ ఎంపీ ఆజమ్ ఖాన్‌‌కు ఈ షాక్ తగిలింది. దీనిపై కేసు‌ ఫైల్‌చేసిన పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు.
ఆజం ఖాన్

రాంపూర్‌కు చెందిన అసిఫ్‌, జాకీర్‌ అనే వ్యక్తులు ఆజంఖాన్‌పై ఫిర్యాదు చేశారు. తన అనుచరులతో కలిసి 2016 అక్టోబరు 15న రాంపూర్‌లోని తప ఇంటిని ఆజంఖాన్ ధ్వంసం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇంటి ఆవరణలో ఉన్న గేదెతో పాటు రూ.25 వేల నగదును సైతం దొంగిలించారని ఆరోపించారు. ఇంటి స్థలాలన్ని ఇవ్వాలంటూ ఎంపీ అనచరులు తమపై దాడిచేశారని వెల్లడించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసుపెట్టి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎంపీ ఆజమ్‌ ఖాన్‌తో పాటు మాజీ అధికారి అలయ్‌ హసన్‌ పేర్లను అందులో చేర్చారు. మరో 40 మంది గుర్తు తెలియని వ్యక్తుల పేర్లను కూడా ఎఫ్ఐఆర్‌లో పొందుపరిచారు.

First published: August 30, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు