ఆయేషా పుర్రె, అస్థికలపై గాయాలు... రీపోస్టుమార్టంలో గుర్తించిన సీబీఐ

ఆయేషా మీరా హత్యకేసును సీబీఐ సీరియస్‌గా విచారణ పూర్తి చేస్తోంది. శవపరీక్ష పూర్తి చేసిన ఫోరెన్సిక్ నిపుణులు ఆ రిపోర్ట్‌ను ఓ సీల్డ్ కవర్‌లో పెట్టి హైకోర్టుకు సమర్పించారు.

news18-telugu
Updated: December 14, 2019, 2:35 PM IST
ఆయేషా పుర్రె, అస్థికలపై గాయాలు... రీపోస్టుమార్టంలో గుర్తించిన సీబీఐ
ఆయేషా మీరా కేసులో ట్విస్ట్... సీబీఐ సంచలన నిర్ణయం
  • Share this:
విజయవాడలో దారుణ హత్యకు గురైన ఆయేషామీరా హత్య కేసులో ఆమె మృతదేహానికి 12 ఏళ్ల తర్వాత రీపోస్టుమర్టం నిర్వహించారు. దాదాపు ఆరు గంటల పాటు అధికారుల పర్యవేక్షణలో ఈ ప్రక్రియ పూర్తి చేశారు. అయేషామీరా మృతదేహం వెలికితీసి... ఫోరెన్సిక్ నిపుణులు ఆనవాళ్లు నమోదు చేసుకున్నారు. ఎముకలు, కేశాలు, గోళ్లను క్షుణ్ణంగా పరిశీలించారు. ఆయేషా పుర్రె, అస్థికలపై గాయాలున్నట్లు గుర్తించారు. ఆధారాలు సేకరించి పూర్తి నివేదిక తయారుచేయనున్నట్లు ఫోరెన్సిక్ బృందం తెలిపింది. తెనాలి సబ్ కలెక్టర్ , ఎమ్మార్వో పంచనామా ప్రక్రియను పరిశీలించారు.  ఆయేషా మీరా హత్యకేసును సీబీఐ సీరియస్‌గా విచారణ పూర్తి చేస్తోంది. శవపరీక్ష పూర్తి చేసిన ఫోరెన్సిక్ నిపుణులు ఆ రిపోర్ట్‌ను ఓ సీల్డ్ కవర్‌లో పెట్టి హైకోర్టుకు సమర్పించారు. ఆయేషా మీరా ఎముకల నుంచి అవశేషాలు సేకరించారు. సీబీఐ ఎస్పీ విమల్ నేతృత్వంలో రీపోస్టుమార్టం నిర్వహించారు.

2007 డిసెంబర్‌లో విజయవాడ శివారులోని ఇబ్రహీంపట్నంలో ఓ ప్రైవేట్ హాస్టల్‌లో ఆయేషా మీరా దారుణహత్య జరిగింది. అప్పట్నుంచీ ఈ కేసులో ప్రతీ మలుపు సంచలనంగా మారింది. చివరకు ఈ హత్య కేసులో నిందితుడిగా ఉన్న సత్యం బాబును 2017 మార్చి 31న హైకోర్టు నిర్దోషిగా ప్రకటించింది. అయితే ఆయేషా హత్య కేసులో సత్యంబాబు నిర్దోషి అని తేలాడు కానీ... అసలు దోషులెవరో బయటపడలేదు. ఈ హత్య జరిగినప్పుడు ఏపీలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది.



First published: December 14, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>