అడ్రస్ తెలియక ఆటో ఎక్కిన యువతిపై...ఆటోడ్రైవర్ లైంగికదాడి...

ఇంతలో ఆటోను ఓ నిర్మానుష్య రైల్వే బ్రిడ్జి కింద ఆపాడు. ఆటో రిపేరుకు వచ్చిందని...అందులోనే వేచి ఉండాలని యువతితో చెప్పి, అక్కడి నుంచి కాస్త దూరంగా వెళ్లాడు. ఇంతలో ఇద్దరు వ్యక్తలు వచ్చి యువతిని ఆటోలోనుంచి దిగకుండా బంధించారు.

news18-telugu
Updated: June 18, 2019, 8:18 PM IST
అడ్రస్ తెలియక ఆటో ఎక్కిన యువతిపై...ఆటోడ్రైవర్ లైంగికదాడి...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
మైనర్ యువతిని ఆటో డ్రైవర్ దారి తప్పించి స్నేహితులతో కలిసి లైంగిక దాడి చేసిన ఘటన పాట్నాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే నలందకు చెందిన బాధిత యువతి పాట్నాలో తమ బంధువుల ఇంటికి వెళ్లాలని రైల్వేస్టేషన్ లో ఆటో ఎక్కింది. అయితే అడ్రస్ సరిగ్గా తెలియకపోవడంతో పాటు, పాట్నా కొత్త ప్రదేశం కావడంతో ఆటోడ్రైవర్‌ ను తనను సరైన అడ్రస్‌కు తీసుకెళ్లాలని కోరింది. దీంతో యువతికి పాట్నా కొత్త అని నిందితుడైన ఆటోడ్రైవర్ పసిగట్టాడు. అంతే కాదు, యువతిని సరైన చోటికే తీసుకెళతానని నమ్మబలికాడు. అంతే కాదు యువతితో మంచి మాటలు మాట్లాడుతూ తానొక మంచి వ్యక్తినని నమ్మబలికాడు. ఇంతలో ఆటోను ఓ నిర్మానుష్య రైల్వే బ్రిడ్జి కింద ఆపాడు. ఆటో రిపేరుకు వచ్చిందని...అందులోనే వేచి ఉండాలని యువతితో చెప్పి, అక్కడి నుంచి కాస్త దూరంగా వెళ్లాడు. ఇంతలో ఇద్దరు వ్యక్తలు వచ్చి యువతిని ఆటోలోనుంచి దిగకుండా బంధించారు.

ఆ తర్వాత ఆటో డ్రైవర్ వచ్చి బాలికను బెదిరించాడు. నోరుమూసుకొని తాము చెప్పింది వినాలని గద్దించాడు. అయినప్పటికీ యువతి ప్రతిఘటించింది. దీంతో ఆటో డ్రైవర్ ఆ బాలికపై తన స్నేహితులతో కలిసి లైంగిక దాడి చేశాడు. అనంతరం యువతిని మెయిన్ రోడ్డుపై వదిలేసి పారిపోగా, స్థానికులు యువతి పరిస్థితి చూసి పోలీసులకు తెలిపారు. అనంతరం పోలీసులు యువతిని ఆసుపత్రికి తరలించి, ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. అనంతరం రైల్వే స్టేషన్ వద్ద ఆటో డ్రైవర్ సీసీ కెమెరాలో రికార్డయ్యింది. దీని ఆధారంగా నిందితుడిని అరెస్టుచేయగా, మిగతా ఇద్దరు నిందితుల్లో ఒకరిని అదుపులో తీసుకున్నారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడు.

First published: June 18, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>