విశాఖ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం...విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న ఆటో...ఆరుగురి దుర్మరణం...

చింతపల్లి మండలం, బలపం చెరువూరులో ఏర్పాటు చేసిన వారాంతపు సంతకు వెళుతున్న ఆటో కిక్కిరిసి ఉండటంతో అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో, ఆటోలోని ఆరుగురు వ్యక్తులు దహనమవగా, మరో ఆరుగురు తీవ్రంగా గాయాలపాలయ్యారు.

news18-telugu
Updated: June 2, 2019, 6:35 PM IST
విశాఖ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం...విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న ఆటో...ఆరుగురి దుర్మరణం...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఏపీలోని విశాఖ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్యాసింజర్ ఆటో విద్యుత్ స్తంభాన్ని ఢీ కొనడంతో ఆరుగురు ప్రయాణీకులు సజీవ దహనమవగా, మరో ఆరుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. చింతపల్లి మండలం, బలపం చెరువూరులో ఏర్పాటు చేసిన వారాంతపు సంతకు వెళుతున్న ఆటో కిక్కిరిసి ఉండటంతో అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో, ఆటోలోని ఆరుగురు వ్యక్తులు దహనమవగా, మరో ఆరుగురు తీవ్రంగా గాయాలపాలయ్యారు. ఘటన జరిగే సమయంలో ఆటోలో మొత్తం 12 మంది ప్యాసింజర్లు ఉన్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను స్థానికంగా ఉన్న చింతపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

First published: June 2, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...