యువతి కిడ్నాప్, గ్యాంగ్ రేప్... ఆటోలో డ్రాప్ చేస్తామని చెప్పి...

అర్థరాత్రి వేళ... ఇంటికి ఎలా వెళ్లాలా అని చూసిన ఆమెకు... ఆటో కనిపించేసరికి ప్రాణం లేచొచ్చింది. ఐతే, అదే ఆటో ఆమె జీవితాన్ని నాశనం చేస్తుందని ఆమె ఆ క్షణం ఊహించలేదు.

Krishna Kumar N | news18-telugu
Updated: July 20, 2019, 2:57 PM IST
యువతి కిడ్నాప్, గ్యాంగ్ రేప్... ఆటోలో డ్రాప్ చేస్తామని చెప్పి...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
Gurugram : హర్యానా... గురుగ్రామ్‌లోని MG రోడ్డులో ఉన్న ఓ నైట్ క్లబ్‌కి వెళ్లిందా యువతి. అర్థరాత్రి వేళ క్లబ్ నుంచీ బయటకు వచ్చింది. ఇంటికి వెళ్లేందుకు అక్కడ ఆమెకు ఓ ఆటో తప్ప ఏమీ కనిపించలేదు. ఎక్కడికి వెళ్లాలి మేడం అని అడిగాడు ఆటో డ్రైవర్. అడ్రెస్ చెప్పింది. "సరే మేడం తీసుకెళ్తాను. మీరు ఏమీ అనుకోనంటే... నా ఫ్రెండ్ కూడా నాతో వస్తాడు. తను ముందు కూర్చుంటాడు. మీరు వెనక కూర్చోండి" అన్నాడు ఆటో డ్రైవర్. ఆమె పెద్దగా సందేహించలేదు. లైట్ తీసుకుంది. సరే అంటూ ఆటో ఎక్కింది. ఆటో బయలుదేరింది. కాస్త దూరం వెళ్లేసరికి... రోడ్డుపై వాహనాలేవీ కనిపించలేదు. రోడ్డు ఖాళీగా ఉంది. ఆటో నడుపుతున్న సద్దాం, అతని పక్కన కూర్చున్న సంతోష్... ఇద్దరూ వీలైనప్పుడల్లా... ఆమె వైపు చూడసాగారు. ఆమె మొబైల్‌లో ఏవో మెసేజ్‌లు చూసుకుంటూ... ఆ ప్రపంచంలో తలమునకలైంది.

వేగంగా వెళ్లిన ఆటో... కాసేపటికి... నిర్మానుష్య ప్రాంతంలో వెళ్లసాగింది. కాసేపటికి ఆటో ఆమె వెళ్లాల్సిన గురు ద్రోణాచార్య మెట్రో స్టేషన్ వైపు కాకుండా... సద్దాం అద్దెకు ఉంటున్న షీత్లా కాలనీలోని ఇంటికి వెళ్లింది. ఆటో ఆగే సరికి... తన ఇల్లు వచ్చిందేమో అనుకుంది ఆమె. తీరా చూస్తే... అది వేరే ప్రాంతం. ఏ ఏరియా ఇది అని అడిగింది. "ఒక్కసారి దిగండి మేడం. ఆటోలో ఏదో రిపేర్ వచ్చింది" అన్నాడు సద్దాం. అప్పటికే ఆటో దిగి చుట్టూ ఎవరైనా ఉన్నారా లేదా అన్నది చూడసాగాడు సంతోష్. ఆమె ఆటో దిగి... అది ఏ ఏరియా అని చూస్తుండగా... సంతోష్... ఒక్కసారిగా ఆమెను పట్టుకొని... నోరు నొక్కేశాడు. వెంటనే సద్దాం... ఆమె కాళ్లను గట్టిగా పట్టుకున్నాడు. ఆమె గింజుకుంటుంటే... ఇద్దరూ ఆమెను సద్దాం రూంలోకి లాక్కుపోయారు. తలుపులు లాక్ చేసి... దారుణానికి పాల్పడ్డారు.

దాదాపు గంట తర్వాత ఆ దుర్మార్గుల చెర నుంచీ బయటకు వచ్చిన ఆమె... ఆటో నంబర్‌ను ఫొటో తీసింది. వేగంగా కిలోమీటర్ నడుస్తూ వెళ్లి... దగ్గర్లోని రోడ్డుపై వెళ్తున్న మరో క్యాబ్ ఎక్కి... తన ఇంటికి వెళ్లింది. మర్నాడు సెక్టార్ 5 పోలీస్ స్టేషన్‌లో పోలీసులను కలిసి జరిగింది చెప్పింది. ఆటో నంబర్‌ను వారికి చూపించింది. కేసు రాసిన పోలీసులు... ఆటో నంబర్ ఆధారంగా... ఉత్తరప్రదేశ్‌లోని కస్కంజ్ ప్రాంతానికి చెందిన సద్దాన్, ఆగ్రాకు చెందిన సంతోష్‌ని అదే రోజు అదుపులోకి తీసుకున్నారు.

సాధారణంగా ఇలాంటి కేసుల్లో... బాధితురాలిని వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి పంపుతారు పోలీసులు. ఆ పని పూర్తైన తర్వాత... నిందితుల కోసం గాలిస్తుంటారు. ఈ కేసులో పోలీసులు అలా చెయ్యలేదు. బాధితురాలు చెప్పిన ఆధారాలతో... వెంటనే వెళ్లి నిందితుల్ని పట్టుకున్నారు. ఆ తర్వాత వైద్య పరీక్షల కోసం ఆమెను పంపారు. 2018 డిసెంబర్‌లో కూడా ఇలాగే 42 ఏళ్ల మహిళను ఐదుగురు కేటుగాళ్లు ఆటో నడుపుతూ గ్యాంగ్ రేప్ చేశారు. అందరూ ఆటో డ్రైవర్లే. అప్పట్లో పోలీసులు ఆ ఐదుగురినీ అరెస్టు చేశారు.

First published: July 20, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>