హోమ్ /వార్తలు /క్రైమ్ /

హైదరాబాద్‌లో దారుణం... ట్రాన్స్‌జెండర్‌పై ఆటోడ్రైవర్‌ అత్యాచారయత్నం

హైదరాబాద్‌లో దారుణం... ట్రాన్స్‌జెండర్‌పై ఆటోడ్రైవర్‌ అత్యాచారయత్నం

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ప్రస్తుతం ఆటో డ్రైవర్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు.

   తెలంగాణలో కొందరు కామాంధులు రెచ్చిపోతున్నారు. తాజాగా ఓ ఆటో డ్రైవర్ ట్రాన్స్‌‌జెండర్‌పై అఘాయిత్యానికి ప్రయత్నించాడు. దీంతో బాధిత ఓ ట్రాన్స్ జెండర్ పోలీసులను ఆశ్రయించింది. హైదరాబాద్ లోని బాచుపల్లిలో ఓ ఆటోడ్రైవర్ తనపై అత్యాచారానికి ఒడిగట్టడానికి అతని బారి నుండి  తప్పించుకున్నానని సదరు ట్రాన్స్ జెండర్ ఆరోపించింది. తోటి ట్రాన్స్ జెండర్లతో కలిసి అతన్ని పోలీసులకు అప్పగించింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఆటో డ్రైవర్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు.


  తెలంగాణలో దిశ నిందితులను ఎన్‌కౌంటర్ చేసినా.. ఆంధ్రప్రదేశ్‌లో దిశ చట్టం వంటి కఠిన చట్టాలు వచ్చినా.. కామాంధుల్లో మార్పు రావడం లేదు. దేశంలో నిత్యం ఏదో ఒక చోట అత్యాచార ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తెలంగాణలో రోజురోజుకు అత్యాచర ఘటనలు ఎక్కువైపోతున్నాయి. నిన్న హైదరాబాద్ శివారులోని మేడ్చల్‌లో బీటెక్ విద్యార్థినిపై అత్యాచారం జరిగింది. పేట్ బషీరాబాద్‌లోని మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీలో ఈ ఘటన చోటుచేసుకుంది. కాలేజీలో ల్యాబ్ ఇంచార్జిగా పని చేస్తున్న వెంకటేష్.. తనపై అత్యాచారం చేశాడని ఓ యువతి పోలీసులను ఆశ్రయించింది. కాలేజీ ల్యాబ్‌లోనే తనను బెదిరించి లైంగిక దాడికి పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొంది.

  Published by:Sulthana Begum Shaik
  First published:

  Tags: Hyderabad, RAPE, Telangana, Transgender

  ఉత్తమ కథలు