చిత్తూరులో మరో దారుణం... బాలికపై మామిడితోటలో ఆటోడ్రైవర్ అత్యాచారం

అమ్మాయిని రాత్రి మామిడితోటకు తీసుకెళ్లి ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడు.

news18-telugu
Updated: December 10, 2019, 1:01 PM IST
చిత్తూరులో మరో దారుణం... బాలికపై మామిడితోటలో ఆటోడ్రైవర్ అత్యాచారం
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
తిరుపతిలో ఓ బాలికపై ఇద్దరు యువకులు అత్యాచారం చేసిన ఘటన మరువక ముందే చిత్తూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ప్రైవేటు డైరీలో పాల క్యాన్లు కడిగేందుకు వెళ్లిన బాలికపై ఆటోడ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. మండలం పెద్దబరినేపల్లి గ్రామానికి చెందిన 12 ఎళ్ళే బాలిక పై ఆటో డ్రైవర్ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. పెద్ద పర్లపల్లి గ్రామ సమీపంలోని ఓ ప్రైవేటు డైరీలో పాల క్యాన్లు కడిగేందుకు వెళ్లిన బాలికపై కన్నేసిన ఆటో డ్రైవర్ మాయమాటలు లొంగదీసుకున్నారు. అమ్మాయిని రాత్రి మామిడితోటకు తీసుకెళ్లి ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడు.

అయితే రాత్రి చాలా సేపటి తర్వాత వచ్చిన బాలికను గమనించగా జరిగిన విషయం తల్లిదండ్రులకు తెలుసుకుంది. దీంతో ఉదయం పాల కేంద్రం వద్దకు చేరుకున్న డ్రైవర్ ను బాలిక తండ్రి ప్రశ్నించగా .. డ్రైవర్ బాలిక తండ్రిపై దాడికి తెగబడ్డాడు. దీంతో గ్రామస్తులు అతనికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించినట్లు అప్పగించారు. నిందితుడు వి.కోట మండలం నక్కనపల్లెకు చెందిన యువకుడిగా గుర్తించారు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు అర్బన్ సిఐ యతీంద్ర రేప్ కేసు నమోదు చేసి దర్యాప్తు

First published: December 10, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>