ఆటోలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న వ్యక్తి.. డ్రైవర్ ఏం చేశాడో తెలుసా? తానే ఢీకొట్టి..

ప్రతీకాత్మక చిత్రం

రామకృష్ణ మియాపూర్‌లో ఓ ఏటీఎం కేంద్రానికి వెళ్లాడు. అక్కడ డబ్బులు డ్రా చేసుకొని రత్నదీప్ సూపర్ మార్కెట్ వద్ద రోడ్డు దాటుతుండగా.. హఫీజ్‌పేటకు చెందిన ఆటో డ్రైవర్ సయ్యద్ షేక్ అలీ తన ఆటోతో రామకృష్ణను ఢీకొట్టాడు.

 • Share this:
  ఓ వ్యక్తి రక్తపు మడుగులో ఉన్నాడు. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. కానీ క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించకుండా.. మధ్యలోనే రోడ్డుపక్కన వదిలేసి పారిపోయాడు ఆటో డ్రైవర్. అంతేకాదు అతడి మొబైల్ ఫోన్‌తో పాటు పర్సును తీసుకెళ్లాడు. సకాలంలో వైద్యం అందక బాధితుడిని రోడ్డుపక్కనే కన్నుమూశాడు. అసలు ఆ వ్యక్తిని ఢీకొట్టింది కూడా ఆ ఆటో డ్రైవర్. ఐనా.. ఏ మాత్రం బాధ్యత లేకుండా ప్రవర్తించాడు. మానవత్వాన్ని మంటగలిపాడు. రెండు నెలల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతుడి సెల్‌ఫోనే ఆటో డ్రైవర్‌ను పట్టించింది.

  పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. ఏపీలోని అమలాపురానికి చెందిన కాకర రామకృష్ణ (55) కుటుంబం మియాపూర్‌లో నివాసం ఉంటున్నారు. ఐతే జనవరి 7న తన మిత్రులతో కలిసి బయటకు వెళ్లిన రామకృష్ణ బయటకు రాలేదు. కుటుంబ సభ్యులు చుట్టుపక్కల అంతా వెతికారు. ఆ మరుసటి రోజు మధ్యాహ్నం మూసాపేటలోని ఓ డంపింగ్ యార్డు సమీపంలో రామకృష్ణ మృతదేహం లభ్యమయింది. అతడు ఎలా చనిపోయాడో కుటుంబ సభ్యులకు అర్ధం కాలేదు. ఒంటి నిండా గాయాలు ఉండడంతో రోడ్డు ప్రమాదమని భావించారు. కానీ అతడి జేబులో పర్సుతో పాలు సెల్‌ఫోన్ లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేశారు. కానీ రెండు నెలల తర్వాత కేసు మిస్టరీ వీడింది.

  కేసు దర్యాప్తులో భాగంగా ఇటీవల పోలీసులు రామకృష్ణ మొబైల్ నెంబర్‌కు కాల్ చేశారు. అవతలి నుంచి లతీఫ్ అనే వ్యక్తి మాట్లాడాడు. ఎవరు మీరు? రామకృష్ణ ఫోన్ నీ దగ్గర ఎందుకుంది? అని ఆరాతీశారు. తన మిత్రుడు, ఆటోడ్రైవర్ సయ్యద్ షేక్ అలీ (38) రూ.2వేలకు ఇటీవలే ఫోన్ అమ్మాడని.. అంతకు మించి తనకు ఏమీ తెలియదని చెప్పాడు. అతడు చెప్పిన వివరాల ఆధారంగా సయ్యద్ షేక్ అలీని పోలీసులు అదుపులోకి తీసుకొని తమదైన స్టైల్లో విచారించారు. అప్పుడు అసలు విషయం తెలిసింది.

  అసలేం జరిగిందంటే....?
  జనవరి 7న సాయంత్రం రామకృష్ణ మియాపూర్‌లో ఓ ఏటీఎం కేంద్రానికి వెళ్లాడు. అక్కడ డబ్బులు డ్రా చేసుకొని రత్నదీప్ సూపర్ మార్కెట్ వద్ద రోడ్డు దాటుతుండగా.. హఫీజ్‌పేటకు చెందిన ఆటో డ్రైవర్ సయ్యద్ షేక్ అలీ తన ఆటోతో రామకృష్ణను ఢీకొట్టాడు. ఈ ఘటనలో రామకృష్ణకు తీవ్ర గాయాలు అయ్యాయి. చుట్టుపక్కల ప్రజలు చేరుకొని..ఆటో డ్రైవర్‌పై మండిపడ్డారు. ఆస్పత్రికి తీసుకెళ్లాలని ఒత్తిడి చేసి.. బాధితుడిని అదే ఆటోలో ఎక్కించారు. ఐతే ఆస్పత్రికి వెళ్తే కేసు అవుతుందని భయపడిన సయ్యద్.. మూసాపేట కైత్లాపూర్ డంప్ యార్డ్ వద్దకు తీసుకెళ్లి రామకృష్ణను అక్కడ వదిలేశాడు. పర్సు, ఫోన్ తీసుకొని పారిపోయాడు. సాయం అందక అతడు అక్కడే మరణించాడు. ఈ కేసులో నిందితుడు సయ్యద్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

  ఇవి కూడా చదవండి:

  నడి రోడ్డుపై నగ్నంగా బైక్ రైడింగ్.. వీడియో చూసి పోలీసులు షాక్.. అసలేంటి మ్యాటర్?

  నువ్వు దొంగ.. జైలుకెళ్లావు.. పెళ్లి చేసుకోనన్న ప్రియుడు.. ఆ యువతి ఏం చేసిందో తెలుసా?

  ప్రేమ పెళ్లి చేసుకున్న కూతురు.. భర్తతో కలిసి ఆటోలో వెళ్తుండగా.. నోట్లో పురుగుల ముందు పోసి..
  Published by:Shiva Kumar Addula
  First published: