పార్టీ పేరుతో పిలిచి.. తల నుంచి మొండెం వేరు చేసి దారుణ హత్య..

ప్రవీణ్‌తో పాత పరిచయం ఉండటంతో.. పార్టీ చేసుకుందాం రమ్మని పిలిచారు. ప్రవీణ్ వచ్చాక ముగ్గురు ఫూటుగా మద్యం సేవించారు. ఇదే క్రమంలో శ్రీను,శ్రీకాంత్ పాత గొడవలను చర్చకు తెచ్చారు. ఆపై...

news18-telugu
Updated: August 23, 2019, 10:48 AM IST
పార్టీ పేరుతో పిలిచి.. తల నుంచి మొండెం వేరు చేసి దారుణ హత్య..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
హైదరాబాద్ మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ హత్య జరిగింది. ప్రవీణ్ అనే ఓ ఆటో డ్రైవర్‌ను ఇద్దరు వ్యక్తులు కిరాతకంగా హతమార్చారు. తల నుంచి మొండెం వేరు చేసి.. మరో ప్రాంతంలో పడేశారు.పాత కక్షల నేపథ్యంలోనే హత్య జరిగిందని భావిస్తున్నారు.వివరాల్లోకి వెళ్తే.. మియాపూర్‌కు చెందిన ఆటో డ్రైవర్ ప్రవీణ్(24)కు గురువారం శ్రీను,శ్రీకాంత్
అనే ఇద్దరు ఫోన్ చేశారు. ప్రవీణ్‌తో పాత పరిచయం ఉండటంతో.. పార్టీ చేసుకుందాం రమ్మని పిలిచారు. ప్రవీణ్ వచ్చాక ముగ్గురు ఫూటుగా మద్యం సేవించారు. ఇదే క్రమంలో శ్రీను,శ్రీకాంత్ పాత గొడవలను చర్చకు తెచ్చారు. దాంతో ఇరువురి మధ్య వాగ్వాదం పెరిగింది. మద్యం మత్తులో విచక్షణ కోల్పోయిన శ్రీను, శ్రీకాంత్ ప్రవీణ్‌పై దాడి చేసి హత్య చేశాడు. తల నుంచి మొండెం వేరు చేసి.. బొల్లారం చౌరస్తాలో పడేశారు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి.. మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్ నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.


First published: August 23, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు