Auto driver and gang molested on girl in Madhya pradesh: యువతులు, మహిళలపై అఘాయిత్యాలు నిరోధించడానికి ప్రభుత్వాలు ఎన్నిచట్టాలు తీసుకొచ్చిన ఈ కామాంధుల ఏమాత్రం మారడం లేదు. ప్రతిరోజు మహిళలు, యువతులపై దారుణాలు జరుగుతునే ఉన్నాయి. మహిళలు ప్రతిచోట వేధింపులు, వివక్షతలను ఎదుర్కొంటునే ఉన్నారు. కొన్ని చోట్ల కాపాడాల్సిన తల్లిదండ్రులే.. అమ్మాయిల పట్ల అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. మరికొన్ని చోట్ల సోదరుడు, ఇంట్లో వారు సైతం వీరిని వేధింపులకు గురిచేస్తున్నారు. ఇక కొన్ని చోట్ల పాఠశాలలు, బస్టాండ్లు, ఆటోలు... ఇలా మహిళలు వేధింపులు ఎదుర్కొని ప్రదేశం లేదనేది ఒక నమ్మలేని నిజం. ప్రస్తుతం ఈ కోవకు చెందిన ఘటన మధ్య ప్రదేశ్ లో జరిగింది.
పూర్తి వివరాలు.. భోపాల్ లోని ఎంపి నగర్ ప్రాంతంలో ఒక యువతి ప్రభుత్వ ఉద్యోగం కోసం క్లాస్ లు అటెండ్ అవుతుంది. ఈక్రమంలో ఇంటికి వెళ్లడానికి.. షేర్డ్ ఆటో ఎక్కింది. యువతి ఎక్కినప్పుడు ఆటోలో ఇద్దరు మహిళలు ఉన్నారు. కాసేపు అయ్యాక.. వారు ఆటోలో నుంచి దిగిపోయారు. దీంతో మరో ఇద్దరు యువకుడు ఆటో ఎక్కారు. వారి చూపులు వింతగా ఉన్నాయి. ఎక్కగానే.. యువతిని వేధించడం ప్రారంభించారు. ఆటో డ్రైవర్ కూడా చీకటి ప్రాంతం గుండా ఆటోను పోనిచ్చాడు. ఆ తర్వాత.. ముగ్గురు ఆమెపై అఘాయిత్యంచేయడానికి ప్రయత్నించారు. వెంటనే ఆమె ఆటోనుంచి దూకి అక్కడి నుంచి పారిపోయింది. ఇంటికి వెళ్లి జరిగిన దారుణాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. ఈ ఘటన బుధవారం జరిగింది. బాధితులు తొలుత భయంతో జరిగిన దారుణాన్నిఎవరికి చెప్పలేదు. కానీ ఆ తర్వాత.. ధైర్యంతెచ్చుకొని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
యూపీలో కన్న తండ్రి కూతురిని దారుణంగా హతమార్చాడు.
UP father Brutally murdered her doughter: ప్రస్తుతం సమాజంలో మహిళలపై హింసలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ప్రభుత్వాలు ఎన్నిచట్టాలు తీసుకొచ్చిన, మహిళలు,యువతులపై హింసలు మాత్రం ఆగడం లేదు. ప్రతి రోజు మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్న ఘటనలు వార్తలలో నిలుస్తున్నాయి. ఈ కోవకు చెందిన ఘటన ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్ లో జరిగింది.
పూర్తి వివరాలు.. యూపీలోని గుర్హా కాలా గ్రామంలో ఈ దారుణం జరిగింది. దేశ్ రాజ్ అనే వ్యక్తికి ఇద్దరు సంతానం. కొడుకు ధనుజంయ్ , పదిహేడేళ్ల కూతురు కూడా ఉంది. ఈ క్రమంలో.. కూతురు కొంత కాలంగా తన సమీపంలోని గ్రామంలోని మరోక యువకుడితో ప్రేమాయణం కొనసాగిస్తుంది. వీరిద్దరు పలుమార్లు ఒంటరిగా కలుసుకునే వారు. అది కాస్త వీరి తల్లిదండ్రులకు తెలిసింది. దీంతో చాలా సార్లు పద్దతి మార్చుకొవాలని యువతి తండ్రి, అన్న ఆమెను హెచ్చరించారు. కానీ ఆమె ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు.
ఈ క్రమంలో.. గత శుక్రవారం.. యువతి తన మాటను లెక్కచేయడం లేదని కోపం పెంచుకున్నారు.ఈక్రమంలో ఆమెపై కత్తితో దాడి చేశారు. ఆ తర్వాత.. ఆమెను గొంతునులిమి చంపేశారు. ఆమె చనిపోయిందని నిర్ధారించుకున్నాక.. ఆమెను ఇంటిలో ఉన్న పశువుల కొట్టంలో గొయ్యితీసి అక్కడ పూడ్చిపేట్టారు. ఆ తర్వాత.. తమ కూతురు కనిపించడం లేదని నాటకాం ఆడారు. వీరి ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండటంతో పోలీసులు అదుపులోనికి తీసుకుని తమదైన రీతిలో విచారించారు. దీంతో నిందితుడు తప్పుచేసినట్లు అంగీకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న అధికారులు విచారణ చేపట్టారు.
Published by:Paresh Inamdar
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.