హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదం... మూడుసార్లు పల్టీలు కొట్టిన ఆటో...

Hyderabad | Road Accident : రోడ్డు ప్రమాదాలు జరగకుండా ప్రభుత్వాలు అన్ని చర్యలూ తీసుకుంటున్నా... కొంతమంది సరిగా డ్రైవింగ్ చెయ్యకపోవడం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి.

news18-telugu
Updated: March 11, 2020, 6:07 AM IST
హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదం... మూడుసార్లు పల్టీలు కొట్టిన ఆటో...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
Hyderabad | Road Accident : హైదరాబాద్‌లోని కాచిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిందీ రోడ్డు ప్రమాదం. చాదర్‌ఘాట్ చిన్న బ్రిడ్జిపై వెళ్తూ... ఆటో సడెన్‌గా పల్టీ కొట్టింది. ఇలా ఏకంగా మూడుసార్లు పల్టీ కొట్టింది. దాంతో... ఆటోలో ప్రయాణిస్తున్న మహిళ అటూ ఇటూ కదిలిపోతూ... తీవ్రగాయాలపాలై... ప్రాణాలు కోల్పోయింది. దీనంతటికీ కారణం... ఆటో డ్రైవరే. బాగా మద్యం తాగాడు. పొట్ట నిండిపోయింది. ఏమీ ఎరగనట్టు ఆటోలో కూర్చున్నాడు. ఆ మహిళకు అర్జెంటుగా ఎక్కడికో వెళ్లాల్సి ఉంది. హైదరాబాద్‌లో 800 బస్సులు తీసేయడంతో... టైముకి బస్సు రాలేదు. లేటైపోతోందన్న ఉద్దేశంతో... ఆమె ఆటో ఎక్కింది. తాను మద్యం తాగి ఉన్నానన్న విషయం ఆమెతో చెప్పకుండా ఆటో డ్రైవర్... సరిగానే ఉన్నట్టు బిల్డప్ ఇచ్చాడు. ఆమెకేం తెలుసు... పాపం ఆటో ఎక్కేసింది. తీరా... చాదర్ ఘాట్ చిన్న బ్రిడ్జిపైకి రాగానే... ఎటు వెళ్తున్నాడో, ఎలా డ్రైవ్ చేస్తున్నాడో అతనికే అర్థం కాలేదు. కళ్లు మూసుకుపోతుంటే... స్టీరింగ్ ఎటో తిప్పేశాడు. అంతే... ఆటో పల్టీలు కొట్టి ఆమె చనిపోయింది. విషయం పోలీసులకు తెలిసింది. అక్కడికి వచ్చి ఆటో డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఆమె ఎవరో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కేసు రాసి దర్యాప్తు చేస్తున్నారు.

ఓ ఆటోడ్రైవర్ నిర్లక్ష్యం ఓ మహిళ ప్రాణం తీసింది. మనం కూడా ఏదైనా వాహనం ఎక్కేటప్పుడు జాగ్రత్త పడటం మంచిదే. డ్రైవర్‌ను గమనిస్తూ ఉండాలి. డ్రైవర్లంతా మంచివాళ్లే ఉండరు. ఇలాంటి తాగిన వాళ్లు కూడా అక్కడక్కడా ఉంటారు. వాళ్లకెలాగూ అప్రమత్తత ఉండదు. మనం జాగ్రత్తగా ఉంటే... కనీసం ప్రాణాపాయం నుంచైనా తప్పించుకునే ఛాన్స్ ఉండొచ్చు.

First published: March 11, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading