థాయిలాండ్‌లో సౌదీ యువతికి అవమానం... ఆస్ట్రేలియా యువతుల ‘టాప్‌లెస్’ నిరసన...

గృహహింసను భరించలేక సౌదీ నుంచి పారిపోయి... థాయిలాండ్ చేరిన యువతి... రిటర్న్ టికెట్ లేదంటూ ఆమె ఆస్ట్రేలియా ప్రయాణాన్ని అడ్డుకున్న అధికారులు...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: January 10, 2019, 7:01 PM IST
థాయిలాండ్‌లో సౌదీ యువతికి అవమానం... ఆస్ట్రేలియా యువతుల ‘టాప్‌లెస్’ నిరసన...
సౌదీ యువతి రహాఫ్ మహ్మద్ (AP Photo)
Chinthakindhi.Ramu | news18-telugu
Updated: January 10, 2019, 7:01 PM IST
‘నాకు ఇక్కడ రక్షణ లేదు...’ అంటూ సౌదీ అరేబియా నుంచి పారిపోయి... బ్యాంకాక్ చేరిందో 18 ఏళ్ల యువతి. గృహహింసను తట్టుకోలేక కువైట్‌లోని తన ఇంటి నుంచి పారిపోయి... థాయిలాండ్‌కు శరణార్థిగా చేసిన రహాఫ్ మహమ్మద్ అల్ ఖునన్ అనే 18 ఏళ్ల అమ్మాయి... ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్‌లోని సౌదీ అరేబియా రాయభార కార్యాలయం అధికారులు... అక్రమంగా పారిపోయి వచ్చిన యువతిని అదుపులోకి తీసుకోవడంతో రహాఫ్... చర్చనీయాంశమైంది. ఈ విషయంలో ఐక్యరాజ్యసమితి జోక్యం చేసుకోవడం విషయం హాట్ టాపిక్‌గా మారిపోయింది. సౌదీ నుంచి వచ్చిన యువతి దగ్గర రిటర్న్ టికెట్ లేకపోవడంతో ఆమెను నిర్భదించారు విమానాశ్రయ సిబ్బంది. పాస్‌పోర్ట్ స్వాదీనం చేసుకుని, తనను ఆస్ట్రేలియా వెళ్లకుండా థాయ్ అధికారులు అడ్డగించారని ఆమె ఫిర్యాదు చేసింది. ట్విట్టర్ వేదికగా ఆమె ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటికి వచ్చింది.

ఐక్యరాజ్యసమితి శరణార్తి వ్యవహారాల కమిషన్, రహాఫ్ మహమ్మద్ అల్ ఖునన్‌ను తమకు అప్పగిస్తే ఆమె ‘చట్టబద్ధమైన శరణార్థి’గా గుర్తించి ఆదుకుంటామని ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రకటించింది. అయితే కువైట్‌లో రహాఫ్ కుటుంబం గురించి, ఆమెకు ఎదురైన గృహహింస గురించి ఎలాంటి సమాచారం అందలేదు. అయితే సౌదీ యువతికి మద్ధతుగా... థాయిలాండ్ అధికారుల చర్యలను ఖండిస్తూ ఆస్ట్రేలియాలో నిరసనలు మొదలయ్యాయి. నలుగురు యువతులు... ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ అర్ధనగ్నంగా నిరసన తెలిపారు. ‘ది సీక్రెట్ సిస్టర్ హుడ్’ అనే అక్షరాలను వీపు మీద రాసుకున్న నలుగురు యువతులు... కేవలం జీన్స్ మాత్రమే ధరించి, టాప్‌లెస్‌గా సిడ్నీ నగరంలో నిరసన వ్యక్తం చేశారు.

Australia Secret Sisterhood: Women hold topless protest to support 18 year old Saudi Runaway Girl సౌదీ నుంచి పారిపోయి ఆస్ట్రేలియా చేరిన యువతి... ఆమెకు మద్ధతుగా టాప్‌లెస్‌గా యువతుల నిరసన...
టాప్‌లెస్‌గా నిరసనలు తెలుపుతున్న యువతులు (Photo: twitter)


‘గో ఫండ్ మీ’ పేరుతో ఆమెకు అవసరమైన ఆర్థిక సాయం చేయాల్సిందిగా కోరుతూ విరాళాలను కూడా ఆహ్వానిస్తున్నారు ఈ యువతులు. గృహహింసను భరించలేక, ఇళ్లు వదిలేసి వచ్చిన ఆమె తెగువను తాము గౌరవిస్తామంటూ ఈ ఆర్గనైజేషన్ ఫౌండర్ జాకీ లవ్ తెలిపింది. స్వేచ్ఛగా, స్వాతంత్య్రంగా తమ భావాలను వెల్లడించేందుకు మహిళలకు హక్కు ఉండాలనే ఉద్దేశంతోనే టాప్‌లెస్‌గా నిరసనలు తెలుపుతున్నట్టు పేర్కొన్నారు లవ్. ఇప్పటికే ఈ సంస్థకు 4 వేల డాలర్ల దాకా విరాళాలు రావడం విశేషం.ఇవి కూడా చదవండి...

గుల్బర్గా బస్టాప్‌లో ‘లైవ్ మర్డర్’... కత్తులతో పొడుస్తున్నా స్పందించని జనం... వైరల్ వీడియో...


‘ఖాకీ జూదం’... పేకాట ఆడుతూ అడ్డంగా దొరికిపోయిన పోలీసులు...

Loading...

ఎటిఎంలో పరిచయమయ్యాడు... యువతిని మాటల్లో పెట్టి దోచేశాడు...


‘ముద్దుగా ఉన్నావ్... ఓ ముద్దు ఇవ్వవా’... విద్యార్థినికి 50 ఏళ్ల ‘నీచపు టీచర్’ మెసేజ్...

First published: January 10, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...