AURANGABAD FAMILY TORTOISE WITH 21 TOENAILS BLACK LABRADOR FOR DOWRY IN MAHARASHTRA VB
ఇదెక్కడి కోరికండి బాబు.. వరకట్నం కింద వింత కోరిక కోరారు.. తీర్చకపోవడంతో వివాహాన్ని రద్దు చేశారు.. అసలేమైందంటే..
ప్రతీకాత్మక చిత్రం
Dowry Harassment: వరకట్నం అడగడం అనేది చట్ట ప్రకారం నేరం. అయినా కుమార్తెకు గిఫ్ట్ కింద ఇస్తున్నామంటూ వధువు తరఫు బంధువులు కట్నం కింద ఇస్తుంటారు. ఎవరైనా కట్నం కింద డబ్బులు లేదా ఆస్తులను ఇస్తుంటారు. కానీ ఇక్కడ మాత్రం వరుడి తరఫు బంధువులు వింత కోరికను కోరారు. వివరాలిలా ఉన్నాయి.
వరకట్నం అడగడం చట్టప్రకారం నేరమని చెప్తున్నా అమ్మాయిలకి, వారి కుటుంబ సభ్యులకి ఈ సమస్య తప్పట్లేదు. ఇప్పటికీ వరకట్న ఆత్మహత్యలు, వేధింపులు అప్పుడప్పుడు మనం వార్తల్లో వింటూనే ఉంటాం. సాధారణంగా వరకట్నం అంటే ఆస్తులు, డబ్బులు అడుగుతుంటారు. అయితే వెరైటీ కోరికలు కోరి వరకట్నంగా తీర్చమన్నారు ఓ కుటుంబ సభ్యులు. ఈ ఘటన మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో చోటు చేసుకుంది. వాళ్లు కోరిన కోరికలు ఏంటంటే.. 21 గోర్లు గల ఒక తాబేలు, ఒక నల్ల కుక్క కావాలని డిమాండ్ చేశారు. యువతి కుటుంబం నిశ్చితార్థానికి ముందే రూ.2 లక్షల నగదు, 10 గ్రాముల బంగారం వరకట్నంగా ఇచ్చారు. అంతేకాకుండా ఇంకా వరకట్నం వావాలని డిమాండ్ చేశారు. 21 గోర్లు గల తాబేళ్లు, ఒక నల్ల లాబ్రడార్ కుక్క, ఒక బుద్ధ విగ్రహం, సమై లాంప్‌స్టాండ్, రూ.10 లక్షలు ఇవ్వాలంటూ యువతి కుటుంబ సభ్యులను డిమాండ్ చేశారు. ఇవి ఇస్తేనే వివాహం తర్వాత ఉద్యోగం వస్తుందని వాళ్లని నమ్మించారు. అయితే యువతి కుటుంబం ఈ వింత కోరికలను తీర్చలేమని చెప్పడంతో వివాహాన్ని రద్దు చేసుకున్నారు. దీనికి సంబంధించి ఉస్మాన్‌పురా పోలీసుల కథనం ప్రకారం ఇలా ఉన్నాయి.
ఈ ఏడాది ఫిబ్రవరి 10న రామనగర్ ప్రాంతంలోని ఒక హాలులో ఓ జంటకు నిశ్చితార్థం అయ్యింది. యువతి కుటుంబం నిశ్చితార్థానికి ముందే 2 లక్షల నగదు, 10 గ్రాముల బంగారం వరకట్నంగా ఇచ్చారు. నిశ్చితార్థం తరువాత, వరుడి కుటుంబం వధువు బంధువుల నుంచి వరకట్నం కోసం 21 గోళ్ళతో ఒక తాబేలు, ఒక నల్ల లాబ్రడార్ కుక్క, బుద్ధ విగ్రహం, సమై లాంప్ స్టాండ్‌తో పాటు రూ .10 లక్షలు డిమాండ్ చేశారు.
పెళ్లి తర్వాత వధువుకు ఉద్యోగం రావాలంటే ఈ కోరికలను తీర్చాలని వరుడు పేర్కొన్నాడు. ఆ డిమాండ్లను తాము నెరవేర్చలేకపోయామని.. దయచేసి వాటి బదులు ఏమన్న అడగండంటూ వేడుకున్నామని ఆ మహిళ కుటుంబం తెలిపింది. కానీ వాళ్లు ఏ మాత్రం వినిపించుకోలేదని వాపోయారు. దీంతో వరుడి కుటుంసభ్యులు వివాహాన్ని రద్దు చేసుకున్నారు. మనస్తాపం చెందిన వధువు కుటుంబసభ్యులు ఉస్మాన్‌పురా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు సెక్షన్ 420 కింద వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.