Home /News /crime /

Aunty: అల్లుడి వరసయ్యే 18 ఏళ్ల కుర్రాడితో అఫైర్ ఈ అత్తను ఎక్కడ కనిపించేలా చేసిందంటే..

Aunty: అల్లుడి వరసయ్యే 18 ఏళ్ల కుర్రాడితో అఫైర్ ఈ అత్తను ఎక్కడ కనిపించేలా చేసిందంటే..

పుష్ప (ఫైల్ ఫొటో)

పుష్ప (ఫైల్ ఫొటో)

వివాహేతర సంబంధాలు, పెళ్లైన తర్వాత వేరొకరితో ప్రేమలు అనర్థాలకు దారితీస్తాయన్న సంగతి తెలిసినా క్షణిక సుఖాల మోజులో పడి కొందరు చేజేతులా జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.

    ఎత్వా: వివాహేతర సంబంధాలు, పెళ్లైన తర్వాత వేరొకరితో ప్రేమలు అనర్థాలకు దారితీస్తాయన్న సంగతి తెలిసినా క్షణిక సుఖాల మోజులో పడి కొందరు చేజేతులా జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. అలాంటి ఓ ఘటనే ఉత్తరప్రదేశ్‌లోని ఎత్వా జిల్లాలో వెలుగుచూసింది. జిల్లాలోని హర్దాస్‌పూర్ గ్రామానికి చెందిన సంతోష్ అతని భార్య పుష్ప(32)తో కలిసి ఉంటున్నాడు. గ్రామంలోని ఇటుకల బట్టీలో భార్యాభర్తలు రోజూ పనికి వెళ్లేవారు. ఏ రోజు డబ్బు ఆ రోజు పని అయిపోగానే తీసుకుని ఇంటికి వెళ్లేవాళ్లు. ఇలా సుఖంగా ఉన్న ఈ జంట జీవితంలో రోహిత్ అనే 20 ఏళ్ల యువకుడి ఎంట్రీతో మొత్తం మారిపోయింది.

    రోహిత్ కూడా అదే ఇటుకల బట్టీలో పనిచేస్తుండేవాడు. రోహిత్ కుటుంబం, సంతోష్ కుటుంబానికి బాగా దగ్గరి బంధుత్వం ఉంది. పండగలకుపబ్బాలకు ఒకరి ఇంటికి ఒకరు వస్తుండటం, పోతుండటం జరుగుతుండేది. రోహిత్‌కు సంతోష్ వరుసకు మామయ్య అవుతాడు. సంతోష్ భార్య పుష్పతో అత్త అంటూ రోహిత్ బాగా చనువుగా ఉండేవాడు. అప్పుడప్పుడూ కేవలం ఆమె కోసమే రోహిత్ సంతోష్ ఇంటికి వెళుతుండేవాడు. ఈ క్రమంలో.. సంతోష్ భార్య పుష్ప ఆలోచన కూడా దారితప్పింది. ఆ యువకుడికి మరింత దగ్గరయింది. భర్తకు తెలియకుండా రోహిత్‌తో వివాహేతర సంబంధం కొనసాగించింది. ఇద్దరూ సంతోష్‌కు తెలియకుండా అతను ఊళ్లో లేనప్పుడు ఇంట్లోనే రాసలీలలు సాగించేవారు. దగ్గర బంధువు కావడంతో రోహిత్‌పై సంతోష్‌కు పెద్దగా అనుమానం రాలేదు. కొన్ని రోజుల తర్వాత విషయం తెలిసి భార్యను హెచ్చరించాడు. అప్పటి నుంచి రోహిత్, పుష్ప దూరంగా ఉన్నారు.

    ఇది కూడా చదవండి: So Sad: ఇతను ప్రాణం తీసుకోవడానికి కారణం బస్సు కండక్టర్.. అసలేం జరిగిందో తెలిస్తే ఎవరికైనా బాధనిపిస్తుంది..

    ఇదిలా ఉండగా.. నవంబర్ 30న ఇటుకల బట్టీలో పని అయిపోయిన తర్వాత పుష్ప, రోహిత్ ఇద్దరూ ఆ రోజు కూలి డబ్బులు తీసుకుని కనిపించకుండాపోయారు. అప్పటికే వీరి వివాహేతర సంబంధం గురించి తెలుసుకున్న సంతోష్ ఇద్దరూ బాందా వెళ్లిపోయి ఉంటారని అక్కడికి వెళ్లి వెతుకులాట సాగించాడు. ఎక్కడా ఇద్దరి ఆచూకీ లభించలేదు. మరుసటి రోజు ఉదయం రోహిత్, అతని అత్త, ప్రియురాలు అయిన పుష్ప మృతదేహాలు ఊరి బయట ఉన్న చెట్టుకు వేలాడుతూ కనిపించాయి. ఉదయాన్నే బహిర్భూమికి వెళ్లిన వారు చెట్టుకు విగత జీవులుగా వేలాడుతూ ఉండటం చూసి ఒక్కసారిగా షాకయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

    ఇది కూడా చదవండి: Mother Affair: తల్లి వివాహేతర సంబంధం.. 20 ఏళ్ల వయసున్న కూతురికి ఊహించని కష్టం..

    చెట్టుకు వేలాడుతూ ఉన్న మృతదేహాలను పుష్ప, రోహిత్‌లవిగా గుర్తించారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఆత్మహత్యగా అనుమానిస్తున్నారు. ఇద్దరి మధ్య అఫైర్ ఉందని, ఈ విషయం ఆమె భర్తకు తెలిసిందని గ్రామస్తులు చెప్పడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిజంగానే తాము ఇక అఫైర్ కొనసాగించలేమని భావించి మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డారా లేక ఎవరైనా హత్య చేసి చెట్టుకు వేలాడదీసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. ఏదేమైనా తెల్లారేసరికి చెట్టు దగ్గర అత్త, అల్లుడు శవాలుగా కనిపించడంతో గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
    Published by:Sambasiva Reddy
    First published:

    Tags: Crime news, Extra marital affair, Love affair

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు