శ్రీకాకుళం జిల్లాలో మరో దారుణం... అమ్మాయిని తీవ్రంగా కొట్టి

విద్యార్థిని కేకలు వేయడంతో అక్కడున్న స్థానికులు గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

news18-telugu
Updated: December 2, 2019, 9:23 AM IST
శ్రీకాకుళం జిల్లాలో మరో దారుణం... అమ్మాయిని తీవ్రంగా కొట్టి
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఎన్ని కఠిన చట్టాలు వస్తున్నా అమ్మాయిలపై దాడులు మాత్రం ఆగడం లేదు. ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో పోకిరీలు రెచ్చిపోయారు. అమ్మాయిని ఒంటరిగా చూసి ఆమెపై లైంగిక దాడికి ప్రయత్నించారు. అమ్మాయిని తీవ్రంగా కొట్టారు. విద్యార్థిని కేకలు వేయడంతో అక్కడున్న స్థానికులు గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వెంటనే పోలీసులు నలుగురి యువకుల్నిఅదుపులోకి తీసుకున్నారు. బాధితురాలిని చికిత్స నిమిత్తం రాజాం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాధితురాలు ఇంజినీరింగ్ విద్యార్థిగా గుర్తించారు. నిందితుల వివరాల్ని కూడా పోలీసులు గోప్యంగా ఉంచారు.

First published: December 2, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>