మహిళలపై అఘాయిత్యాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. అభం శుభం తెలియని చిన్న పిల్లల నుండి వృద్ధుల వరకు ఎవరిని కామాంధులు వదిలిపెట్టడం లేదు. వావి వరస మరిచి విచక్షణా రహితంగా ప్రవర్తిస్తున్నారు. ఇక తాజాగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (Hyderabad Central University) లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఉన్నత చదువుల కోసం థాయ్ లాండ్ నుండి హైదరాబాద్ కు వచ్చిన విద్యార్థినిపై HCU ప్రొఫెసర్ అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. అతని నుంచి తప్పించుకున్న విద్యార్థిని గచ్చిబౌలి పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా ఈ ఘటనపై యూనివర్సిటీ విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దారుణానికి ఒడిగట్టిన ప్రొఫెసర్ రవిరంజన్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా ప్రతిష్టాత్మక యూనివర్సిటీలో ఇలాంటి ఘటన జరగడంతో విద్యార్థులు ఆందోళనకు గురువుతున్నారు. ఇంత పెద్ద యూనివర్సిటీలో విద్యార్థినులకు రక్షణ లేకపోవడంపై పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోఉద్రిక్తత..
ఈ ఘటనతో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (Hyderabad Central University) విద్యార్థులు గేటు ముందు ఆందోళన చేపట్టారు. ప్రొఫెసర్ రవిరంజన్ పై కఠిన చర్యలు తీసుకోవాలని, థాయ్ లాండ్ విద్యార్థినికి న్యాయం చేయాలనీ విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థుల ఆందోళనతో యూనివర్సిటీ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇలాంటి ప్రొఫసర్ ను వెంటనే సస్పెండ్ చేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.
దర్యాప్తు చేపట్టిన పోలీసులు..
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రొఫెసర్ రవిరంజన్ ఎలాంటి వారని పోలీసులు అడిగి తెలుసుకుంటున్నారు. ఒకవేళ అత్యాచారయత్నం నిజమే అయితే పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. అంత పెద్ద స్థాయిలో ఉన్న ప్రొఫెసర్ ఇలాంటి దారుణానికి పాల్పడడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అయింది. అయితే దర్యాప్తులో ఎలాంటి నిజం బయటకు వస్తుందో చూడాలి.
యూనివర్సిటీకి మాయని మచ్చ..
ఒకవేళ విద్యార్థినిపై ప్రొఫెసర్ అత్యాచారయత్నం పాల్పడిన ఘటన నిజమే అయితే అది యూనివర్సిటీకి మాయని మచ్చే అని చెప్పుకోవాలి. ఇంత పెద్ద యూనివర్సిటీలో వేల సంఖ్యలో విద్యార్థులు ఇతర దేశాల నుండి వస్తుంటారు. వారి రక్షణకు సరైన చర్యలు లేకపోవడం ఇప్పుడు ఆందోళనకు గురి చేస్తుంది. మరి ఈ ఘటనకు సంబంధించి ఎలాంటి విషయాలు బయటకు వస్తాయో చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime, Crime news, HCU, Hyderabad, Telangana